- Home
- Entertainment
- బావాబామ్మర్దులు కాబోతున్న ఎన్టీఆర్, సాయి ధరమ్?... నందమూరి, మెగా ఫ్యాన్స్ కి మైండ్ బ్లోయింగ్ న్యూస్!
బావాబామ్మర్దులు కాబోతున్న ఎన్టీఆర్, సాయి ధరమ్?... నందమూరి, మెగా ఫ్యాన్స్ కి మైండ్ బ్లోయింగ్ న్యూస్!
ఎన్టీఆర్, సాయి ధరమ్ బావాబామ్మర్దులు కాబోతున్నారన్న న్యూస్ ఇండస్ట్రీని షేక్ చేస్తుంది. ఇదే జరిగితే ఇండస్ట్రీ షేక్ కావడం ఖాయం అంటున్నారు. ఇక వివరాల్లోకి వెళితే...

ntr - sai dharam tej
ఆర్ ఆర్ ఆర్(RRR Movie) మూవీతో భారీ హిట్ సొంతం చేసుకున్న ఎన్టీఆర్... కొరటాల శివ చిత్రానికి సిద్ధమవుతున్నారు. ఎన్టీఆర్ 30వ చిత్రంగా తెరకెక్కుతున్న ఈ మూవీ ప్రీ ప్రొడక్షన్ జరుపుకుంటుంది. ఆచార్య మూవీ ఆర్థిక ఇబ్బందుల నుండి దర్శకుడు కొరటాల బయటపడలేదు. ఈ కారణంగా ఎన్టీఆర్ 30 చిత్రం సెట్స్ పై కెళ్ళడం ఆలస్యం అవుతుంది. కాగా ఆగస్టు నుండి ఎన్టీఆర్ 30 రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం కానుందట.
ntr - sai dharam tej
ఈ క్రమంలో ఎన్టీఆర్ 30(NTR 30)కి సంబంధించి ఓ క్రేజీ న్యూస్ చక్కర్లు కొడుతుంది. ఈ మూవీలో మెగా హీరో సాయి ధరమ్ జాయిన్ కానున్నారట. ఆయన కీలక రోల్ చేస్తున్నారట. కథ రీత్యా ఎన్టీఆర్ బావమరిదిగా సాయి ధరమ్ తేజ్ పాత్ర ఉంటుందట. ఇక సాయి ధరమ్ తేజ్(Sai Dharam Tej) పాత్రకు హీరోయిన్ కూడా ఉంటుందట. ఆ విధంగా ఎన్టీఆర్-సాయి ధరమ్ తేజ్ బావా బామ్మర్దులుగా కనిపిస్తారని సమాచారం.
ntr - sai dharam tej
దీనిపై అధికారిక సమాచారం లేకున్నప్పటికీ పరిశ్రమలో చక్కర్లు కొడుతుంది. మరి ఇదే జరిగితే మరో నందమూరి-మెగా కాంబో ఆవిష్కృతం అవుతుంది. ఆర్ ఆర్ ఆర్ మూవీతో చాలా కాలం తర్వాత నందమూరి, మెగా కుటుంబాల హీరోలు కలిసి నటించారు. అప్పుడెప్పుడో ఎన్టీఆర్, చిరంజీవి కలిసి నటించారు. దశాబ్దాల తర్వాత రాజమౌళి ఇది సాధ్యం చేసి చూపించారు. ఆర్ ఆర్ ఆర్ మూవీతో చరణ్, ఎన్టీఆర్(NTR) పాన్ ఇండియా ఇమేజ్ తెచ్చుకున్నారు.
ntr - sai dharam tej
ఇక సెంటిమెంట్ చూసుకున్నా బాగా కలిసొస్తుంది. ఆర్ ఆర్ ఆర్ విజయమే దానికి నిదర్శనం. వెండితెరపై సాయి ధరమ్, ఎన్టీఆర్ లను కలిసి చూడడం నిజంగా గొప్ప అనుభూతి పంచుతుంది. కావున ఈ కాంబో సాకారం కావాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు.
ఇక ప్రమాదం నుండి కోలుకున్న తర్వాత సాయి ధరమ్ తేజ్ వినోదయ సిత్తం రీమేక్ ప్రకటించారు. పవన్ మరో హీరోగా నటిస్తుండగా మల్టీస్టారర్ గా దర్శకుడు సముద్ర ఖని తెరకెక్కిస్తున్నారు. ఈ మూవీ షూటింగ్ మొదలు కాగా సాయి ధరమ్ తేజ్ పాల్గొంటున్నారట. పవన్ కూడా త్వరలో జాయిన్ కానున్నారట.