- Home
- Entertainment
- అరా కొరా బట్టలో పూర్తిగా తడిసిన పాయల్... ఇసుకలో ఆడుకుంటూ కెరటాలను హీటేక్కిస్తున్న హాటీ!
అరా కొరా బట్టలో పూర్తిగా తడిసిన పాయల్... ఇసుకలో ఆడుకుంటూ కెరటాలను హీటేక్కిస్తున్న హాటీ!
టాలీవుడ్ కి దొరికిన మోస్ట్ సెక్సియస్ట్ హీరోయిన్ పాయల్ రాజ్ పుత్. ఒకప్పటి ఈ సీరియల్ నటి ఆర్ఎక్స్ 100 మూవీతో హీరోయిన్ గా మారింది. వస్తూ వస్తూనే సంచలన విజయం నమోదు చేసింది.

payal rajput
ఆర్ఎక్స్ 100 మూవీ 2018లో విడుదలైన సంచలన విజయం నమోదు చేసింది. డెబ్యూ డైరెక్టర్ అజయ్ భూపతి వాస్తవ సంఘటనల ఆధారంగా ఓ వినూత్నమైన ప్రేమకథ తెరకెక్కించారు. హీరోయిన్ పాయల్ నెగిటివ్ షేడ్స్ ఉన్న పాత్రలో మైండ్ బ్లోయింగ్ క్లైమాక్స్ ట్విస్ట్ ఇస్తుంది.
ఈ మూవీతో పాయల్ ని ఆపడం కష్టమే అనుకున్నారంతా. కారణం తెలియదు కానీ ఆమెకు అనుకున్న స్థాయిలో ఆఫర్స్ దక్కలేదు. ఆర్ఎక్స్ 100లో పాయల్ నెగిటివ్ షేడ్స్ తో కూడిన బోల్డ్ రోల్ చేశారు. అది కూడా ఓ కారణం కావచ్చు.
Payal Rajput
స్టార్స్ అటుంచితే కనీసం టైర్ తూ హీరోలు కూడా ఆమెను పట్టించుకోలేదు. పాయల్ జతకట్టిన పెద్ద హీరోల లిస్ట్ లో వెంకటేష్, రవితేజ మాత్రమే ఉన్నారు. వెంకీ మామ ఓ మోస్తరు విజయాన్ని నమోదు చేయగా... డిస్కో రాజా ప్లాప్ అయ్యింది.
Payal Rajput
చిత్ర పరిశ్రమలో విజయాల ఆధారణంగానే అవకాశాలు వస్తాయి. అత్యంత తక్కువ సక్సెస్ రేట్ కలిగిన పాయల్ ని మెల్లగా దర్శక నిర్మాతలు దూరం పెట్టారు. అడపాదడపా అవకాశాలతో నెట్టుకొస్తున్న పాయల్ కి సరైన బ్రేక్ రావడం లేదు.
Payal rajput
ఆమె లేటెస్ట్ మూవీ తీస్ మార్ ఖాన్ ఆగస్టు 19న విడుదలైంది. ఈ మూవీలో పాయల్ రెచ్చిపోయి గ్లామర్ షో చేసింది. సినిమా మిక్స్డ్ టాక్ సొంతం చేసుకుంది. హీరో ఆది సాయికుమార్ తో పాటు పాయల్ ఈ మూవీ విజయంపై చాలా ఆశలే పెట్టుకున్నారు.
Payal Rajput
తీస్ మార్ ఖాన్ హిట్టా ఫట్టా తెలియాలంటే వీకెండ్ ముగియాలి. టాలీవుడ్ లో పాయల్ అనుకున్న స్థాయిలో సక్సెస్ కాలేదు. ఆమె చిన్నగా కన్నడ, తమిళ పరిశ్రమలపై దృష్టి పెట్టారు. ఆ రెండు భాషల్లో పాయల్ చిత్రాలు చేస్తున్నారు. మరి అక్కడైనా పాయల్ కోరుకున్న ఇమేజ్ తెచ్చుకుంటుందో లేదో.
మరోవైపు వెబ్ మూవీస్ లో నటిస్తున్నారు. ఓటీటీ ప్లాట్ ఫార్మ్స్ లో విపరీతంగా అవకాశాలు దక్కుతుండగా ఆ దిశగా అడుగులు వేస్తున్నారు. చాలా కాలంగా ఓ వ్యక్తిని ప్రేమిస్తున్న పాయల్... అతనితో చట్టాపట్టాలేసుకుని తిరుగుతుంది.