- Home
- Entertainment
- RRR v/s Puneet: `ఆర్‌ఆర్‌ఆర్`పై శివరాజ్ కుమార్ అసంతృప్తి.. `జేమ్స్` సినిమా విషయంలో మండిపాటు
RRR v/s Puneet: `ఆర్‌ఆర్‌ఆర్`పై శివరాజ్ కుమార్ అసంతృప్తి.. `జేమ్స్` సినిమా విషయంలో మండిపాటు
`ఆర్‌ఆర్‌ఆర్` సినిమా శుక్రవారం ప్రపంచ వ్యాప్తంగా భారీ స్థాయిలో విడుదలైంది. అంతా ఈ సినిమాని కోసం వేచి చూస్తున్నారు. కానీ కర్నాటకలో మాత్రం పరిస్థితి వేరుగా ఉంది. ఈ సినిమాపై స్టార్ హీరో శివరాజ్‌కుమార్ అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. దీంతో కన్నడ నాట `ఆర్‌ఆర్‌ఆర్ వర్సెస్ జేమ్స్` గా మారింది.

rrr movie v/s james
కర్నాటకలో `RRR v/s James` అనే పరిస్థితి నెలకొంది. ప్రస్తుతం ఈ రెండు చిత్రాలు బాక్సాఫీసు వద్ద పోటీ పడుతున్నాయి. కన్నడ పవర్ స్టార్ పునీత్ రాజ్‌కుమార్ నటించిన చివరి చిత్రం `జేమ్స్` కి జరుగుతున్న అన్యాయంపై ఆయన అభిమానులు, పలు రాజకీయ పార్టీలు మండిపడుతున్నారు. అంతేకాదు పునీత్ ఫ్యామిలీ కూడా ఈ విషయంలో గుర్రుగా ఉంది. మరి ఈ వివాదానికి కారణమేంటనేది చూస్తే.
rrr movie v/s james
కన్నడ పవర్ స్టార్ పునీత్ రాజ్‌కుమార్(Puneet Rajkumar) గత ఏడాది అక్టోబర్‌లో గుండెపోటుతో మరణించిన విషయం తెలిసిందే. ఆయన హఠాన్మరణంతో కన్నడ చిత్ర పరిశ్రమ షాక్‌లోకి వెళ్లింది. ఇటు తెలుగు చిత్ర పరిశ్రమ సైతం దిగ్బ్రాంతిని వ్యక్తం చేయగా, చిరంజీవి, వెంకటేష్, బాలయ్య, ఎన్టీఆర్, శ్రీకాంత్ వంటి హీరోలు స్వయంగా వెళ్లి పునీత్ రాజ్‌కుమార్‌కి నివాళ్లు అర్పించారు.
rrr movie v/s james
పునీత్‌రాజ్‌కుమార్ నటించిన చివరి చిత్రం `జేమ్స్`(James Movie) గత వారం విడుదలైంది. భారీ కలెక్షన్లతో దూసుకుపోతుంది. తొలి రోజు ఇది రూ.35కోట్లు కలెక్ట్ చేయగా, మొదటి వారం సుమారు.150కోట్ల కలెక్షన్లని రాబట్టింది. ప్రస్తుతం థియేటర్లలో రన్ అవుతుంది. పునీత్ కెరీర్‌లోనే అత్యధిక కలెక్షన్లని రాబట్టిన చిత్రంగా నిలిచింది. పునీత్ మరణం అనంతరం వచ్చిన సినిమా కావడంతో ఆయనపై అభిమానంతో ఈ సినిమాని అభిమానులు, కన్నడ సినీ ప్రియులు బాగా చూస్తున్నారు. సినిమా సైతం సక్సెస్ టాక్‌తో దూసుకుపోతుంది.
rrr movie v/s james
అయితే ఈ సినిమా విజయవంతంగా రన్ అవుతున్నా, ఆడియెన్స్ పాజిటివ్ టాక్ ఉన్నా, ప్రస్తుతం ఈ శుక్రవారం నుంచి సినిమాని ఆల్మోస్ట్ అన్ని థియేటర్లలో తీసేశారు. `ఆర్‌ఆర్‌ఆర్` సినిమా శుక్రవారం భారీ స్థాయిలో విడుదలైన నేపథ్యంలో `జేమ్స్` మూవీ కొన్ని థియేటర్లకే పరిమితమయ్యింది. కన్నడ నాట ప్రధానంగా `ఆర్‌ఆర్‌ఆర్` సినిమాని ప్రదర్శిస్తున్నారు. దీంతో పునీత్ రాజ్ కుమార్ అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రాజకీయ పార్టీలు సైతం దీన్ని వ్యతిరేకిస్తున్నాయి.
rrr movie v/s james
తాజాగా పునీత్ అన్నయ్య, సూపర్‌స్టార్ శివరాజ్‌కుమార్ సైతం దీనిపై స్పందించారు. ఆయన తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేశారు. కన్నడ ఫిల్మ్ ఛాంబర్‌ని ఆయన ఈ విషయంపై ప్రశ్నించినట్టు తెలుస్తుంది. ఈ విషయంలో ఎవరిది తప్పు అనేది పక్కన పెడితే, బాగా ఆడుతున్న సినిమాని ఎలా తీసేస్తారని, ఇతర భాష సినిమా కోసం సొంత భాష సినిమాని ఎలా తీసేస్తారని ఆయన ఫిల్మ్ ఛాంబర్ పెద్దలపై మండిపడ్డారని సమాచారం. ఓ వైపు పునీత్ అభిమానులు సైతం ఇదే అభిప్రాయంతో ఉన్నారని తెలుస్తుంది.
rrr movie v/s james
ఇదిలా ఉంటే ఇటీవల కర్నాటకలోని చిక్‌బళ్లాపూర్‌లో జరిగిన `ఆర్‌ఆర్‌ఆర్` ప్రీ రిలీజ్ ఈవెంట్‌కి కర్నాటక సీఎం బసవరాజు బొమ్మై, సూపర్‌స్టార్ శివరాజ్‌కుమార్ కూడా హాజరయ్యారు. సినిమాని సపోర్ట్ చేశారు. ఇటు `ఆర్‌ఆర్‌ఆర్` టీమ్ సైతం పునీత్ రాజ్‌కుమార్‌ని తలుచుకున్నారు. దీంతో వారి అభిమానులు కూడా `ఆర్‌ఆర్‌ఆర్`ని ఎంకరేజ్ చేస్తారని భావించారు రాజమౌళి. కానీ ఇప్పుడు అక్కడ పరిస్థితి రివర్స్ కావడం ఆశ్చర్యానికి గురి చేస్తుంది. మరోవైపు కన్నడ భాషలో `ఆర్‌ఆర్‌ఆర్`ని విడుదల చేయడం లేదంటూ అభిమానులు ఈ చిత్రాన్ని కర్నాటకలో బ్యాన్ చేయాలని డిమాండ్ చేసిన విషయం తెలిసిందే.
rrr movie v/s james
ఇక శుక్రవారం విడుదలైన `ఆర్‌ఆర్‌ఆర్` చిత్రం బ్లాక్‌బస్టర్ టాక్‌ని తెచ్చుకుంటోంది. కాస్త స్లోగా ఉందని, ఎమోషన్స్ క్యారీ కాలేదని, ఎపిసోడ్లు వైజ్‌గా బాగుందనే టాక్ వినిపిస్తున్నా, సినిమా కమర్షియల్‌గా బాగా ఆడుతుందని సినీ విశ్లేషకుల నుంచి వినిపిస్తున్న మాట. రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన ఈ చిత్రంలో ఎన్టీఆర్, రామ్‌చరణ్ హీరోలుగా నటించిన విషయం తెలిసిందే. 1920లో కొమురంభీమ్, అల్లూరి సీతారామరాజు కలిసి బ్రిటీష్‌వ వారిపై చేసిన పోరాటం ప్రధానంగా సాగే చిత్రమిది.