- Home
- Entertainment
- నెట్ ఫ్లిక్స్ లో సరికొత్త రికార్డు క్రియేట్ చేసిన ‘ఆర్ఆర్ఆర్’.. నాన్ ఇంగ్లిష్ ఫిల్మ్స్ లో టాప్ 1లో ట్రెండింగ్
నెట్ ఫ్లిక్స్ లో సరికొత్త రికార్డు క్రియేట్ చేసిన ‘ఆర్ఆర్ఆర్’.. నాన్ ఇంగ్లిష్ ఫిల్మ్స్ లో టాప్ 1లో ట్రెండింగ్
దర్శకధీరుడు ఎస్ఎస్ రాజమౌళి తెరకెక్కించిన బ్లాక్ బాస్టర్ ఫిల్మ్ ‘ఆర్ఆర్ఆర్’ (RRR). థియేట్రికల్ రన్ తో ఎంతటి సెన్సేషన్ క్రియేట్ చేసిందో తెలిసిందే. ఇటీవల ఓటీటీలోకి వచ్చిన ఈ చిత్రం నాన్ ఇంగ్లిష్ ఫిల్మ్స్ లో టాప్ 1గా ట్రెండింగ్ అవుతోంది.

స్వాతంత్ర్య సమర యోధులు కొమురం భీం, అల్లూరి సీతారామా రాజు జీవితాల ఆధారంగా తెరకెక్కించిన మల్టీస్టారర్ చిత్రం ‘ఆర్ఆర్ఆర్’. ఈ మూవీ మార్చి 25న ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ అయి సరికొత్త రికార్డులను క్రియేట్ చేసింది. వరల్డ్ వైడ్ బాక్సాఫీస్ వద్ద కూడా కాసుల వర్షం కురిసింది.
ప్రపంచ వ్యాప్తంగా హాయేస్ట్ గ్రాసింగ్ ఇండియన్ ఫిల్మ్ గా మూడో స్థానాన్ని దక్కించుకుంది. మొదటి స్థానంలో బహుబలి : ది కన్ క్ల్యూజన్ ఉండగా.. ఇటీవల ‘కేజీఎఫ్ ఛాప్టర్ 2’ రెండో స్థానాన్ని దక్కించుకుంది. రూ.1,200 కోట్లు వసూళ్లు చేసి రికార్డు క్రియేట్ చేసింది.
మరోవైపు ఓటీటీ సంస్థలైన జీ5, నెట్ ఫ్లిక్స్ లో మే 20 నుంచి స్ట్రీమింగ్ అవుతోంది. తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ వెర్షన్ ‘జీ5’లో రిలీజ్ కాగా, హిందీ వెర్షన్ ‘ఆర్ఆర్ఆర్’రైట్స్ ను నెట్ ఫ్లిక్స్ దక్కించుకుంది. అయితే ప్రస్తుతం ఆర్ఆర్ఆర్ హిందీ వెర్షన్ ఓటీటీలో దూసుకుపోతోంది.
కేవలం వారంలోనే నెట్ ఫ్లిక్స్ లో 18.6 మిలియన్ల వ్యూస్ తో ట్రెండింగ్ లో ఉంది. యునైటెడ్ స్టేట్స్‌లోని నెట్‌ఫ్లిక్స్ టాప్ 10 సినిమాల జాబితాను తాజాగా రిలీజ్ చేసింది. ప్రస్తుతం దేశంలో అత్యంత జనాదరణ పొందిన ఐదవ చిత్రంగా RRR నిలిచింది. నాన్ తెలుగు ఫిల్మ్ లో టాప్ 1గా ట్రెండింగ్ లో ఉంది.
ప్రస్తుతం నెట్‌ఫ్లిక్స్ లో టాప్ వన్ లో డిసాజపియరెన్స్ ఎట్ క్లిఫ్టన్ హిల్, సెకండ్ లో టాప్ గన్, థర్డ్ లో సీనియర్ ఈయర్, ఫోర్త్ లో ఏ ఫర్ఫెక్ట్ పేయిరింగ్, ఐదో స్థానంలో ఆర్ఆర్ఆర్ ఉంది. నాన్ ఇంగ్లిష్ ఫిల్మ్ గా ఆర్ఆర్ఆర్ హిందీ వెర్షన్ ట్రెండింగ్ లో ఉండటం పట్ల ఇండియన్ ఆడియెన్స్ ఖుషీ అవుతున్నారు.
ఈ చిత్రం ద్వారా మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ (Ram Charan), యంగ్ టైగర్ ఎన్టీఆర్ (NTR)లు పాన్ ఇండియన్ స్టార్స్ గా ఖాతా ఓపెన్ చేశారు. ప్రస్తుతం ఇద్దరు భారీ చిత్రాల్లో నటిస్తున్నారు. చెర్రీ ‘ఆర్సీ15’ షూటింగ్ లో బిజీగా ఉన్నారు. తారక్ ఎన్టీఆర్ 30, ఎన్టీఆర్ 31లో నటిస్తున్నారు.