- Home
- Entertainment
- Ranbir Alia Wedding: 11ఏళ్లకే రన్బీర్ ప్రేమలో పడిపోయిన అలియా... పెళ్ళికి సిద్ధమైన ఈ జంట షాకింగ్ లవ్ జర్నీ!
Ranbir Alia Wedding: 11ఏళ్లకే రన్బీర్ ప్రేమలో పడిపోయిన అలియా... పెళ్ళికి సిద్ధమైన ఈ జంట షాకింగ్ లవ్ జర్నీ!
బాలీవుడ్ లవ్ బర్డ్స్ రన్బీర్ కపూర్-అలియా భట్ పెళ్లి (Ranbir-Alia Wedding) పీటలు ఎక్కనున్నారు. విశ్వసనీయ సమాచారం ప్రకారం ఏప్రిల్ 13-18 తేదీలలో వీరి పెళ్లి వేడుకలు జరగనున్నాయట. దాదాపు ఐదేళ్లుగా డేటింగ్ చేస్తున్న రన్బీర్-అలియాల పెళ్లి నేషనల్ న్యూస్ అయ్యింది.

Ranbir Alia Wedding
ఈ క్రమంలో అలియా(Alia Bhatt), రన్బీర్ ల పరిచయం, ప్రేమ... పెళ్లి వరకు నడిచిన వ్యవహారం ఏమిటో ఒకసారి పరిశీలిద్దాం. పెళ్లిళ్లు స్వర్గంలో నిర్ణయించబడతాయి అంటారు. అంటే మన జీవిత భాగస్వామి ఎప్పుడో నిర్ణయించబడి ఉంటుందట. అలియా, రన్బీర్ విషయంలో కూడా అదే రుజువైంది. బాలీవుడ్ లవర్ బాయ్ గా అరడజను అమ్మాయిలతో ప్రేమాయణం నడిపిన రన్బీర్... అలియాతో పెళ్ళికి సిద్ధమయ్యాడు.
11 ఏళ్లకే ప్రేమ..
Ranbir Alia Wedding
ప్రేమకు వయసు లేదంటారు. అలియా కూడా 11 ఏళ్లకే రన్బీర్(Ranbir Kapoor) పై మనసు పారేసుకుంది. దర్శకుడు సంజయ్ లీలా భన్సాలీ బ్లాక్ చిత్రం కొరకు ఆడిషన్స్ జరుపుతున్న రోజుల్లో రన్బీర్ ఆయన వద్ద అసిస్టెంట్ డైరెక్టర్ గా పని చేస్తున్నాడు. ఆ మూవీ ఆడిషన్స్ కి హాజరైన చైల్డ్ ఆర్టిస్ట్ అలియా... రన్బీర్ చార్మింగ్ పెర్సనాలిటీ చూసి పడిపోయారట. లవ్ అటు ఫస్ట్ సైట్ అన్నట్లు అతి చిన్న ప్రాయంలోనే రన్బీర్ పట్ల ఆమె ఆకర్షితులయ్యారు
Ranbir Alia Wedding
ప్రేమ మొదలవడానికి ముందే పెళ్లి కోరిక...
హీరోయిన్ గా మారక అలియా ప్రముఖ టాక్ షో.. కాఫీ విత్ కరణ్ లో పాల్గొన్నారు. 2014లో ప్రసారమైన ఈ షోలో రన్బీర్ ని పెళ్లి చేసుకోవాలనే కోరికను అలియా బయటపెట్టారు. అప్పటికీ వాళ్ళ మధ్య ప్రేమ మొదలు కాలేదు. ఆ సమయంలో అలియా నటించిన హైవే మూవీకి రన్బీర్ ప్రచారం కల్పించారు. ఆ తర్వాత ఈ ఇద్దరు నటులపై ఇతర సెలెబ్రిటీలతో డేటింగ్ చేస్తున్నట్లు రూమర్స్ వచ్చాయి.
Ranbir Alia Wedding
ఇద్దరి మధ్య ప్రేమకు కారణమైన అయాన్ ముఖర్జీ..
2017లో దర్శకుడు అయాన్ ముఖర్జీ బ్రహ్మాస్త్ర మూవీ ప్రకటించారు. అలాగే ఈ మూవీలో రన్బీర్, అలియా నటిస్తున్నట్లు తెలియజేశారు. బ్రహ్మాస్త్ర మూవీ రన్బీర్, అలియాలను దగ్గర చేసింది. వీరి మధ్య ఏదో నడుస్తోందన్న పుకార్లు ఎక్కువయ్యాయి. ఈ క్రమంలో సోనమ్ కపూర్ పెళ్లి వేడుకలో జంటగా పాల్గొన్న అలియా-రన్బీర్ టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీ అయ్యారు. తర్వాత కొద్దిరోజులకే రన్బీర్ అలియాతో తన రిలేషన్షిప్ పై ఓపెన్ అయ్యారు.
Ranbir Alia Wedding
ప్రతి వేడుకకు జంటగా..
2018 నుండి అలియా-రన్బీర్ మరింత ఓపెన్ అయ్యారు. వేడుకలు, విహారాల్లో కలిసి పాల్గొనేవారు. ఎక్కడ చూసినా ఈ జంటే అన్నట్లు వారి తీరు మారింది. అలాగే క్యాన్సర్ తో బాధపడుతున్న రన్బీర్ తండ్రి రిషి కపూర్ ని న్యూయార్క్ హాస్పిటల్ లో జాయిన్ చేశారు. ఈ క్రమంలో తరచుగా రన్బీర్-అలియా అమెరికా వెళ్లారు. ఇక రిషి కపూర్ 2020లో మరణించగా ఆయన అంత్యక్రియల్లో కుటుంబ సభ్యులతో పాటు పాల్గొన్నారు.
Ranbir Alia Wedding
రన్బీర్ తో దివాళీ వేడుకలు..
దివాళి పండుగను రన్బీర్ తో కలిపి ప్రత్యేకంగా జరుపుకుంది అలియా. అలాగే ఆయనతో దిగిన ఓ రొమాంటిక్ ఫోటోను షేర్ చేశారు. ఫెస్టివ్ లుక్ లో క్రేజీ కపుల్ అదిరిపోగా.. అలియా పోస్ట్ అందరినీ ఆకర్షించింది. అదే సమయంలో రన్బీర్ ఫై ఆమెకున్న ప్రేమను తెలియజేసింది.