హృదయాలు కదిలిస్తున్న రాకింగ్ రాకేష్ కన్నీటి గాధ.. ఇప్పటికీ శ్మశానానికి వెళతాడట
రాకింగ్ రాకేష్ కి మంచి కమెడియన్ గా గుర్తింపు ఓవర్ నైట్ లో దక్కలేదు. అందరి జీవితంలో ఎదుగుదల వెనుక కష్టాలు ఉంటాయి. తాను ఈ స్థాయికి వచ్చానంటే ఎన్నో కన్నీటి బాధలు ఎదుర్కొన్నట్లు రాకింగ్ రాకేష్ ఓ ఇంటర్వ్యూలో పేర్కొన్నాడు.

ప్రస్తుతం ఎక్స్ట్రా జబర్దస్త్ లో రాకింగ్ రాకేష్ కూడా సీనియర్ కమెడియన్. దీనితో రాకేష్ కూడా తన బాధ్యతని గుర్తు చేసుకుంటూ మంచి స్కిట్ లతో ప్రేక్షకులని నవ్విస్తున్నాడు. రాకింగ్ రాజేష్, సుజాత లవ్ స్టోరీ ఎక్స్ట్రా జబర్దస్త్ షోకే ఆకర్షణగా మారుతోంది. వీళ్ళిద్దరూ జంటగా ఆడియన్స్ ని భలే ఎంటర్టైన్ చేస్తున్నారు.
రాకింగ్ రాకేష్ కి మంచి కమెడియన్ గా గుర్తింపు ఓవర్ నైట్ లో దక్కలేదు. అందరి జీవితంలో ఎదుగుదల వెనుక కష్టాలు ఉంటాయి. తాను ఈ స్థాయికి వచ్చానంటే ఎన్నో కన్నీటి బాధలు ఎదుర్కొన్నట్లు రాకింగ్ రాకేష్ ఓ ఇంటర్వ్యూలో పేర్కొన్నాడు. తన జీవితం, తల్లి, ప్రేయసి సుజాత గురించి అనేక విషయాలు వివరించాడు.
అవకాశాల కోసం వరంగల్ నుంచి హైదరాబాద్ వచ్చాను. 11 ఏళ్ల పాటు ఛాన్సుల కోసం ప్రయత్నించాను. డబ్బుల కోసం మిమిక్రి కూడా చేశాను. మిమిక్రి ప్రోగ్రాం అయ్యాక డబ్బుల కోసం వాళ్ళ వద్ద చేతులు కట్టుకుని నిలబడేవాడిని. చాలా ప్రోగ్రామ్స్ లో సరిగా చేయలేదని పేమెంట్ తక్కువ ఇచ్చేవారు. వాళ్ళు రూ 500 ఇచ్చినా మహా ప్రసాదంగా భావించే వాడిని.
ఇప్పుడు నాదగ్గర డబ్బు ఉంది. కానీ ఒకప్పుడు తిండి తినడానికి కూడా లేదు. మా అమ్మ పస్తులు ఉండి అన్నం పెట్టేది అంటూ రాకింగ్ రాకేష్ ఎమోషనల్ అయ్యాడు. తనకి అప్పుడప్పుడూ శ్మశానానికి వెళ్లే అలవాటు ఉందని రాకేష్ ఆశ్చర్యపరిచాడు. శ్మశానంలో నాకు మానసిక ప్రశాంతత దొరుకుతుంది. ఇప్పటికీ శ్మశానానికి వెళుతుంటా అని తెలిపాడు. ధనరాజ్ తనని ఓ కామెడీ షోకి తీసుకుని వెళ్లడం వల్లే తాను ఈ స్థాయిలో ఉన్నానని రాకేష్ గుర్తు చేసుకున్నాడు.
పెళ్లి చేసుకునే ఉద్దేశం లేదని చెప్పినప్పుడు.. నేను ఇంట్లో నుంచి వెళ్లిపోతానని మా అమ్మ బెదిరించింది. కానీ సుజాత పరిచయం అయ్యాక నా అభిప్రాయం మారింది. సుజాత మా ఇంట్లో వాళ్ళకి కూడా నచ్చింది అని రాకేష్ తెలిపాడు.
సుజాతకి ఇంటర్వ్యూ ఇవ్వడానికి వెళ్ళినప్పుడు ఫస్ట్ టైం ఆమెతో పరిచయం ఏర్పడినట్లు రాకేష్ పేర్కొన్నాడు. ఆ పరిచయం స్నేహంగా, ఆ తర్వాత రాకేష్ తెలిపాడు.