- Home
- Entertainment
- రెడ్ శారీలో నడుము మడతలు చూపిస్తూ కైపెక్కిస్తున్న రితికా సింగ్.. ఆ స్లీవ్‌లెస్ అందాలు చూస్తే మెంటలే
రెడ్ శారీలో నడుము మడతలు చూపిస్తూ కైపెక్కిస్తున్న రితికా సింగ్.. ఆ స్లీవ్‌లెస్ అందాలు చూస్తే మెంటలే
బాక్సింగ్ నుంచి సినిమాల్లోకి వచ్చి అందాల విందుతో దుమ్ములేపుతుంది రితికా సింగ్. అందాల జోరు చూపిస్తూ కుర్రాళ్లకి నిద్ర లేకుండా చేస్తుంది. ప్రస్తుతం చీరలో ఈ బ్యూటీ మత్తెక్కిస్తుంది.

`గురు` చిత్రంతో తెలుగు ఆడియెన్స్ కి పరిచయం అయ్యింది రితికా సింగ్. ఇందులో బాక్సర్‌గా నటించింది. వెంకటేష్ హీరోగా రూపొందిన చిత్రమిది. తమిళంలో వచ్చిన `ఇరుదు సుట్రు` చిత్రానికి రీమేక్. సినిమాలో రియల్ బాక్సర్‌గా కనిపించి వాహ్ అనిపించింది. అందరి చూపు తనవైపు తిప్పుకుంది.
ఈ సినిమాకిగానూ ఆమెకి ఏకంగా స్పెషల్ మెన్షన్‌లో జాతీయ అవార్డు దక్కడం విశేషం. దీంతో అందరి అటెన్షన్ తనవైపు తిప్పుకుంది. `ఇరుదు సుట్రు`ని తెలుగులో `గురు`గా రీమేక్ చేసిన విషయం తెలిసిందే. అలా తెలుగు ఆడియెన్స్ కి పరిచయమైందీ హాట్ బ్యూటీ.
తమిళంలో `ఆందవన్ కట్టలై`, `శివలింగ` చిత్రాలతో మెరిసింది. మరోసారి 2018లో `నీవెవరో` చిత్రంతో తెలుగు ఆడియెన్స్ ని పలకరించింది. ఆదిపినిశెట్టి హీరోగా రూపొందిన చిత్రమిది. తాప్సి హీరోయిన్‌గా నటించగా, రితికా సింగ్ కీలక పాత్ర పోషించింది. ఇలా అడపాదడపా సినిమాలు చేస్తూ రాణిస్తుంది.
వీటితోపాటు తమిళంలో `ఓ మై కడవులే`, హిందీలోకి ఎంట్రీ ఇస్తూ `ఇన్‌కార్` మూవీ చేసింది. ఇది యావరేజ్ రిజల్ట్ ని చవిచూశాయి. ఇక ఇటీవల `కోలై`మూవీలోమెరిసింది. విజయ్ ఆంటోనీ హీరోగా తెరకెక్కిన చిత్రమిది. ఇది తెలుగులో `హత్య`గా విడుదలైంది. కానీ మెప్పించలేకపోయింది. కథ బాగున్నప్పటికీ, టేకింగ్ విషయంలో ఫెయిల్ అయ్యింది.
`హత్య` చిత్రంలో పోలీస్ ఆఫీసర్‌గా కనిపించింది రితికా. సినిమాలో సింగర్ మోడల్ హత్య జరిగిన నేపథ్యంలో ఆ మర్డర్ మిస్టరీని చేదించే పోలీస్ ఆఫీసర్‌గా ఆకట్టుకుంది రితికా. తనదైన నటనతో మెప్పించింది. సీరియస్ లుక్‌లో అదరగొట్టింది.
ఇక ఇప్పుడు ఐటెమ్ సాంగ్ కూడా చేసింది. మలయాళంలో రూపొందిన `కింగ్ ఆఫ్ కోథ`లో స్పెషల్ సాంగ్ చేసింది. తనదైన గ్లామర్ ట్రీట్ తో మంత్రముగ్దుల్ని చేసింది. `కాలపక్కార` అంటూ సాగే ఈ స్పెషల్ సాంగ్‌లో తన దైన ఘాటు రేపే అందాలతో పిచ్చెక్కించిందీ బ్యూటీ. అంతేకాదు మాస్ డాన్సుతో రచ్చ చేసింది. ఈ సాంగ్ ట్రెండ్ అవుతుంది. ఈ సినిమా ఈ నెల 25న రాబోతుంది. తెలుగులోనూ రిలీజ్ కానుంది.
ఈ పాట కోసం ఆమె రీల్స్ చేస్తుంది. తన ఫ్రెండ్స్ తో కలిసి డాన్సులు చేస్తూ ఆయా వీడియోలను సోషల్ మీడియా ద్వారా పంచుకుంది. చీరలో ఈ బ్యూటీ చేసే డాన్సులు పిచ్చెక్కించేలా ఉన్నాయి. అసలే బొద్దు అందాలకు కేరాఫ్ రితికా. పైగా చీరలో ఇలాంటి డాన్సులు చేస్తే మెంటల్ ఎక్కిపోవాల్సిందే. ఇప్పుడు అదే చేస్తుందీ సెక్సీ బ్యూటీ.
ఇక బాక్సర్, మిక్స్ డ్ మార్షల్ ఆర్ట్స్ లో అనేక విజయాలు అందుకుంది రితికా. సినిమాల్లోకి రాకముందు నేషనల్ ఛాంపియన్‌గా రాణించారు. బై సబ్మిషన్స్ లో 8సార్లు,బై డిసీషన్‌లో 9సార్లు విన్నర్ అయ్యారు. ఇలా మార్షల్ ఆర్ట్స్ లో అనేక రికార్డులున్నాయి ఈ బ్యూటీ పేరుమీద. ఇప్పుడు సినిమాలతో బిజీ అవుతుంది.