`అకీరా మా అన్నయ్య కొడుకు`.. పవన్ ఫ్యాన్స్ కి మరోసారి ఇచ్చిపడేసిన రేణు దేశాయ్.. లాంఛింగ్ ప్లాన్!
నటి, పవన్ మాజీ భార్య రేణు దేశాయ్ ఇటీవల మళ్లీ యాక్టివ్ అయ్యారు. తాజాగా ఆమె అకీరా నందన్ బర్త్ డే రోజు నెలకొన్ని వివాదంపై తాజాగా రేణు దేశాయ్ స్పందించారు. మరోసారి గట్టిగా ఇచ్చారు.
పవన్ కళ్యాణ్(Pawan Kalyan), రేణు దేశాయ్(Renu Desai)లకు అకీరా నందన్(Akira Nandan), ఆద్య (Aadya)జన్మించారు. అయితే పవన్ రేణుతో విడిపోయిన విషయం తెలిసిందే. అయితే బయోలాజికల్ ఫాదర్ అని చాటి చెప్పే విషయాల్లో మాత్రం పవన్ వారితో కలుస్తున్నారు. అడపాదడపా పిల్లలను కలవడం జరుగుతుంది. కానీ అకీరా, ఆద్యల పెంపకం, పోషణ బాధ్యత మొత్తం రేణు దేశాయ్‌నే చూసుకుంటున్నారు.
అకీరా ప్రస్తుతం విదేశాల్లో స్టడీస్ చేస్తున్నారు. ఫిల్మ్ కోర్స్ కూడా చేస్తున్నారని సమాచారం. త్వరలోనే హీరోగా లాంఛ్ చేసే అవకాశం ఉందని ఆ మధ్య వార్తలొచ్చాయి. తాజాగా దీనిపై నటి రేణు దేశాయ్ స్పందించింది. ఏం చేయబోతుందో తెలిపింది. తాజాగా ఆమె జర్నలిస్ట్ ప్రేమకి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈ విషయాలను పంచుకుంది. ఈ ఇంటర్వ్యూ ప్రోమో నెట్టింట వైరల్ అవుతుంది. ఇందులో పూర్తిగా పర్సనల్ విషయాలను షేర్ చేసుకుంది. ఈ క్రమంలో ఆ మధ్య అకీరా బర్త్ డే సందర్భంగా పవన్ ఫ్యాన్స్ పై తాను ఫైర్ కావడానికి సంబంధించి స్పందించింది.
photo credit prema interview
అకీరా నందన్ బర్త్ డే రోజు అనుకోకుండా.. నా బిడ్డ ఇంత పెద్దవాడు అయ్యాడనే ఆనందంలో ఆ ఫోటోని సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టి బర్త్ డే విషెస్ చెప్పానని తెలిపింది. కానీ దీనిపై పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ స్పందిస్తూ, `మా అన్నయ్య కొడుకు`, `అకీరా మా అన్నయ్య బిడ్డ` అంటూ రకరకాలుగా కామెంట్లు చేశారు. ఆ ఫోటోని వైరల్ చేశారు. దీంతో మండిపోయిన రేణు దేశాయ్.. వారికి స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చింది. తాజాగా ప్రేమ ఈ ప్రస్తావన తీసుకురావడంతో రేణు దేశాయ్ మరోసారి రియాక్ట్ అయ్యింది. క్లారిటీ ఇస్తూ, మరోసారి పవన్ ఫ్యాన్స్ కి ఇచ్చిపడేసింది.
photo credit prema interview
`మీ అన్నయ్య అంటే మీకు ఇష్టమే కాదనను, కానీ అకీరా నందన్ పవన్‌కి, తనకు జన్మించిన బిడ్డ అని, మీ అన్నయ్య కేవలం బయోలాజికల్ ఫాదర్ మాత్రమే, పెంచే ఫాదర్ కాదని, అతన్ని తాను టేక్ కేర్ చేస్తున్నానని చెప్పింది. మీకు కూడా ఒక తల్లి సెంటిమెంట్ ఉంది, మీక్కూడా ఒక తల్లి ఎమోషన్ ఉంది. మీరు కూడా మీ తల్లిదండ్రులకు పుట్టారు. కానీ ప్రతి ఒక్కరు వచ్చి నువ్వు తండ్రి కొడుకు,తండ్రి కొడుకు అంటే ఎలా ఉంటుంది. అకీరా పవన్ కొడుకే, కానీ నా కొడుకు కూడా, ఇద్దరికి సమ ప్రాధాన్యత ఇవ్వండి` అంటూ ఆవేదనతో కూడిన హెచ్చరిక చేసింది రేణు దేశాయ్.
photo credit prema interview
ఈ ప్రోమోలో అకీరాని, ఆద్యలను ఎలా చూడాలనుకుంటుందో ఈ ఇంటర్వ్యూలో చెప్పింది. చివర్లో అకీరాని లాంఛ్ చేస్తానని చెప్పడం విశేషం. దీనిపై క్లారిటీ రావాల్సి ఉంది. పూర్తి ఇంటర్వ్యూలో క్లారిటీ వస్తుంది. అయితే ఇందులో పవన్ రాజకీయ ప్రయాణంపై కూడా రేణు దేశాయ్ స్పందించింది. తనపై వచ్చే విమర్శలకు కౌంటర్ ఇచ్చింది. ఇండస్ట్రీలో హీరోయిన్లని ఎలా చూస్తున్నారో తెలిపింది రేణు దేశాయ్.