హీరోగా అకీరా ఎంట్రీ ఎప్పుడంటే..? రేణు దేశాయ్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్..
టైగర్ నాగేశ్వర రావు సినిమాతో రీ ఎంట్రీకి రెడీ అయ్యింది పవర్ స్టార్ పవర్ కళ్యాణ్ మాజీ భార్య రేణ దేశాయ్. ఈసందర్భంగా ఆమె ఈ సినిమా ప్రమోషన్లలో పాల్గొంటూ.. ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు. ఇంతకీ ఆమె ఏమంటుందంటే...?
ప్రస్తుతం టైగర్ నాగేశ్వరావు సినిమాలో నటించింది పవన్ కళ్యాణ్ మాజీ భార్య రేణు దేశాయ్. ఈసినిమాలో హేమలతా లవణం పాత్రలో కనిపించబోతోంది. ఈ పాత్రకు సబంధించిన స్పెషల్ లుక్ ను కూడా రిలీజ్ చేశారు టీమ్. ఇక పాన్ఇండియా రేంజ్ లో ఈమూవీ రిలీజ్ అవ్వబోతుండగా.. ప్రమోషన్లతో మూవీ టీమ్ బిజీ బిజీగా ఉన్నారు. ఈక్రమంలో మీడియాతో సరదాగా మాట్లాడారు రేణు.
Akira Nandan
అయితే పవన్ కళ్యాణ్, రేణు దేశాయ్ ల తనయుడు అకీరా నందన్ ఎంట్రీ కోసం మెగా ఫ్యాన్స్ వెయ్యి కళ్లతో ఎదరు చూస్తున్నారు. ఎప్పుడెప్పుడు తెరపై కనిపిస్తాదా అని ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇదివరకే అకీరా ఎంట్రీపై రకరకాల ఊహాగానాలు వినిపించాయి. అంతే కాదు హీరోగా ఎంట్రీ కోసమే ట్రైనింగ్ కూడా తీసుకుంటున్నాడు అన్నారు. ఈ విషయంలో తాజాగా రేణు దేశాయ్ స్పందించారు. అకీరా వెండితెర ఎంట్రీ ఎప్పుడు అనే ప్రశ్నకు సమాధానం ఇచ్చారు.
Renu Desai
అందరిలానే నాకు కూడా అకీరాను బిగ్ స్క్రీన్ పై చూడలని వుందని చెప్పుకొచ్చారు రేణు. ఇదే క్షణంలో అకీరాకి హీరో అవ్వాలనే ఆసక్తి ఇప్పరివరకూ రాలేదని చెప్పారు.” అకీరాది చాలా భిన్నమైన వ్యక్తిత్వం. తను పియానో, ఫిల్మ్ ప్రొడక్షన్, యోగా, మార్సల్ ఆర్ట్స్, కిక్ బాక్సింగ్ ఇవన్నీ నేర్చుకున్నాడు. కాని తాను హీరో అవుతానని మాత్రం ఎప్పుడూ చెప్పలేదు అన్నారు.
అంతే కాదు అఖీరాకు రైటింగ్ ఇష్టం. ఒక స్క్రిప్ట్ కూడా రాశాడు. అయితే ఇప్పటివరకూ నటుడిని అవుతానని మాత్రం చెప్పలేదు. తను హీరో అవ్వాలని డిసైడ్ అయితే అందరికంటే ముందు నేనే ప్రకటిస్తా అని తేల్చేశారు రేణు. దాంతో అకీరా త్వరగా స్క్రీన్ మీదకు వస్తే బాగుండు అని ఫ్యాన్స్ అంతా ఎదరు చూస్తున్నారు. ఇక ఈ సందర్భంగా మరికొన్ని విషయాలు కూడా వెల్లడించారు రేణు.
నటిగా తను గ్యాప్ తీసుకోవడం కోసం చాలా కారణాలు ఉన్నాయన్నారు రేణు. ఇక ముందు తన వయస్సుకు తగ్గ పాత్రలే చేస్తానంటున్నారు. అంతే కాదు తాను ఏదైనా సినిమా చేయాలన్నా.. కథ, అందులో పాత్ర, దర్శకుడు,నిర్మాత.. ఇలా అన్ని కోణాల్లో చూసుకుని సినిమా ఒప్పుకుంటానంటున్నారు రేణు. నా ఈ కట్టుబాట్ల విషయంలో అన్నీ కలిసి వచ్చిన సినిమా టైగర్ నాగేశ్వర రావు అని అన్నారు. ఈ సినిమా అన్ని విధాలుగా తనకు నచ్చిందన్నారు.
ప్రముఖ రచయిత గుర్రం జాషువా కూతురే హేమలత లవణం. ఆమె ఒక సంఘసంస్కర్త. తండ్రి బాటలోనే నడిచి రచయితగానూ మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఇక ఈమూవీలో హేమలతా లవణం పాత్ర చేయడం పుర్వ జన్మలో చేసిన పుణ్యం అని అంటున్నారు రేణు. ఈ పాత్రలో తనను చూడా తన కూతురు ఆద్య బెస్ట్ కాప్లిమెంట్ ఇచ్చిందని.. తన జీవితంలో తన బిడ్డులు తనను చూసి గర్వించేలా ఉంటానన్నారు. చేసే సినిమాలు కూడా అలానే ఉండేలా చూసుకుంటా అన్నారు. రేణు. ఇక హేమలతా లవణం పాత్ర తనకు ఛాలెంజింగ్ గా అనిపించింది అన్నారు రేణు. ఎంతో మంది జీవితాలు బాగుచేసిన ఆమె పాత్ర చేయాలంటే ముందు ఆమెగురించి తెలసుకోవాలి.. అందుకే హేమలత గారి మేనకోడలిని కలిసి తన గురించి పూర్తిగా తెలుకున్నాను అన్నారు.
ఇక నా జీవితంలో పశ్చాతాపం చెందిన సందర్భాలు లేవు.. కాని హేమలత గారి పాత్ర చేశాక.. ఆమెను కలవలేకపోయానన్న లోటు మాత్రం తనను వెంటాడుతోంది అని అంటున్నారు రేణు. అందుకే ఆమహానుభావురాలి అంత కాకపోయినా.. తన వంతుగా ఓ ట్రస్ట్ పెట్టి.. చిన్నారుల ఆకలి తీరేలా.. వారికి సేవలు చేయాలని నిర్ణించినట్టు చెప్పుకొచ్చారు రేణు దేశాయి.