Regina Cassandra : ‘ఎంగేజ్ మెంట్’ అంటూ రెజీనా పోస్ట్.. అసలు విషయం ఇదా!
టాలీవుడ్ హీరోయిన్ రెజీనా కసాండ్రా (Regina Cassandra) లేటెస్ట్ లుక్ ఆకట్టుకుంటోంది. కానీ ఆమె పోస్టుకు ఇచ్చిన క్యాప్షన్ మాత్రం నెట్టింట ఆసక్తికరంగా మారింది.

యంగ్ బ్యూటీ రెజీనా కసాండ్రా తెలుగు ప్రేక్షకుల్లో మంచి గుర్తింపే తెచ్చుకుంది. తమిళ చిత్రాలతో కెరీర్ ను ప్రారంభించినప్పటికీ తెలుగులోనే మంచి క్రేజ్ దక్కించుకుంది.
‘శివ మనస్సులో శృతి’ చిత్రంతో టాలీవుడ్ కు ఎంట్రీ ఇచ్చిన ఈ ముద్దుగుమ్మ ‘పిల్లా నువ్వులేని జీవితం’, రోటీన్ లవ్ స్టోరీ, రారా కృష్ణయ్య, పవర్, సుబ్రహ్మణ్యం ఫర్ సేల్, శౌర్యం, సౌఖ్యం, రీసెంట్ గా ‘శాకినీ డాకినీ’ చిత్రాలతో అలరించింది.
ఇదిలా ఉంటే... రెజీనా పేరు ఇటీవల సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గ్గా మారుతోంది. కారణం ఆమె త్వరలో పెళ్లి చేసుకోబోతుందంటూ పలు వార్తలు నెట్టింట వైరల్ గా మారాయి.
ఓ బిజినెస్ మ్యాన్ ను రెజీనా పెళ్లి చేసుకోబోతుందంటూ ఈ నెల ప్రారంభంలో ప్రచారం జరిగింది. ఇందులో నిజమెంత ఉందో లేదో కొద్దిరోజులు ఆగితే తెలుస్తుంది.
ఈ క్రమంలోనే రెజీనా ‘పోలింగ్ ఫర్ ఎంగేజ్ మెంట్’ అంటూ తన సోషల్ మీడియా ఫ్యాన్స్, ఆడియెన్స్ ను ఉద్దేశించి పోస్టు పెట్టింది. స్టన్నింగ్ ఫొటోలను పంచుకుంటూ అలా క్యాప్షన్ ఇచ్చింది.
అయితే ఈ పోస్ట్ తన నిశితార్థాన్ని తెలియజేసేది కాకున్నా.. తను పెట్టిన క్యాప్షన్ లో ఎంగేజ్ మెంట్ అనే పదం ఉండటంతో అంతా.. ఆమె పెళ్లి ఎప్పుడంటూ మళ్లీ మొదలు పెట్టారు. ప్రస్తుతం ఫొటోలను లైక్స్, కామెంట్లతో వైరల్ గా మార్చారు.