- Home
- Entertainment
- లగ్జరీ కారు కొన్న రవితేజ, ప్రత్యేకతలు తెలిస్తే దిమ్మ తిరగాల్సిందే.. వేలంలో అధిక మొత్తం వెచ్చించి..
లగ్జరీ కారు కొన్న రవితేజ, ప్రత్యేకతలు తెలిస్తే దిమ్మ తిరగాల్సిందే.. వేలంలో అధిక మొత్తం వెచ్చించి..
మాస్ మహారాజ్ రవితేజ చివరగా ప్రేక్షకులని రావణాసుర చిత్రంతో పలకరించాడు. ఎప్పటిలాగే రవితేజ నటనలో అదరగొట్టినప్పటికీ.. థ్రిల్లర్ గా తెరకెక్కిన ఈ చిత్రం ఆడియన్స్ ని పూర్తి స్థాయిలో ఆకట్టుకోలేకపోయింది.

మాస్ మహారాజ్ రవితేజ చివరగా ప్రేక్షకులని రావణాసుర చిత్రంతో పలకరించాడు. ఎప్పటిలాగే రవితేజ నటనలో అదరగొట్టినప్పటికీ.. థ్రిల్లర్ గా తెరకెక్కిన ఈ చిత్రం ఆడియన్స్ ని పూర్తి స్థాయిలో ఆకట్టుకోలేకపోయింది. సుధీర్ వర్మ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రానికి బాక్సాఫీస్ వద్ద నిరాశ తప్పలేదు.
ప్రస్తుతం రవితేజ టైగర్ నాగేశ్వరరావు చిత్రంలో నటిస్తున్నారు. తాజాగా రవితేజ ఖైరతాబాద్ లోని ఆర్టీఏ కార్యాలయంలో సందడి చేశారు. రవితేజ రీసెంట్ గా ఓ లగ్జరీ కారు కొనుగోలు చేశారు. స్టార్ హీరోలు తరచుగా వాహనాలు కొనుగోలు చేయడం చూస్తూనే ఉన్నాం. కానీ రవితేజ కాస్త ట్రెండు మార్చి.. ఖరీదైన ఎలక్ట్రిక్ కారుని కొన్నారు.
ఇప్పుడిప్పుడే ఇండియాలో ఎలక్ట్రిక్ వాహనాలకు డిమాండ్ పెరుగుతోంది. రవితేజ కొనాలనుకుంటే ఎంతటి ఖరీదైన కారుని అయినా సొంతం చేసుకోవచ్చు. కానీ ఈసారి రవితేజ ఎలక్ట్రిక్ వాహనంపై మక్కువ చూపించాడు. ఈ ఎలక్ట్రిక్ కారు ధర రూ. 34 లక్షల 49 వేలు. ఇది చైనాకి చెందిన కంపెనీ తయారు చేసిన వాహనం. BYD ATTO 3 EV అనే మోడల్ కి చెందిన ఈ ఎలక్ట్రిక్ కారులో అనేక సదుపాయాలు ఉన్నాయి.
ఇది అత్యంత సురక్షితమైన వాహనంగా 5 స్టార్ రేటింగ్ కలిగి ఉంది. ఇందులో 12.8 ఇంచెస్ సెంట్రల్ స్క్రీన్,ఆండ్రాయిడ్, ఫరోనామిక్ సన్ రూఫ్, వైర్ లెస్ ఫోన్ ఛార్జర్, పవర్ టైల్ గేట్ లాంటి అద్భుతమైన ఫీచర్లు ఈ కారులో ఉన్నాయి. ఇన్ని ఫీచర్లు కలిగి ఉంది కాబట్టే రవితేజ ఎంతో ఇష్టపడి ఈ వాహనాన్ని కొన్నారు.
ఇక ఈ వాహనానికి సంబంధించిన రిజిస్ట్రేషన్ కోసం రవితేజ ఖైరతాబాద్ ఆర్టీఏ కార్యాలయంలో సందడి చేశారు. ఈ వాహనం కోసం రవితేజ TS09GB2628 ఫ్యాన్సీ నంబర్ ని వేలంలో దక్కించుకున్నట్లు తెలుస్తోంది. ఈ నంబర్ కోసం రవితేజ ఏకంగా రూ 17,628 వెచ్చించి వేలంలో దక్కించుకున్నారు.
రిజిస్ట్రేషన్ పనుల కోసం రవితేజ స్వయంగా ఆర్టీఏ కార్యాలయానికి హాజరయ్యారు. దీనితో ఆర్టీఏ అధికారులు రవితేజతో సెల్ఫీలు తీసుకోవడం జరిగింది. ఈ ఫొటోల్లో రవితేజ లాంగ్ హెయిర్ పెంచుతూ కనిపిస్తున్నట్లు అర్థం అవుతోంది. టైగర్ నాగేశ్వర రావు చిత్రం కోసమే రవితేజ ఇలా కొత్త గెటప్ ట్రై చేస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి.