MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
Today Rasi Phalalu
Team India T20 Squad
Irumudi 12 Days Collections
Hello Brother Movie Review
Andhra Pradesh Startup Hub
Horror Movies Streaming on OTT
Ishtakameshwari Temple
ICC WTC Standings 2026-27
IMD Weather Update
Toxic Movie Box Office Collections
G Subhash Chandra
Actress Hema Health Update
Tollywood Stylish Heroes
  • Home
  • Entertainment
  • 'మాస్ జాతర' ట్రైలర్ రివ్యూ, ఇది రవితేజ వార్ జోన్.. వినోదం కోరుకునే వారికి కంప్లీట్ ప్యాకేజ్

'మాస్ జాతర' ట్రైలర్ రివ్యూ, ఇది రవితేజ వార్ జోన్.. వినోదం కోరుకునే వారికి కంప్లీట్ ప్యాకేజ్

Mass Jathara Trailer: మాస్ మహారాజ్ రవితేజ పోలీస్ పాత్రలో నటించిన మాస్ జాతర మూవీ ట్రైలర్ వచ్చేసింది. టైటిల్ కి తగ్గట్లుగానే ట్రైలర్ లో రవితేజ మాస్ జాతర చేస్తున్నారు. 

2 Min read
Author : Tirumala Dornala
Published : Oct 27 2025, 08:57 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
మాస్ జాతర ట్రైలర్
Image Credit : Asianet News

మాస్ జాతర ట్రైలర్

మాస్ మహారాజా రవితేజ అభిమానులతో పాటు అందరూ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న 'మాస్ జతర' సినిమా ట్రైలర్ ఎట్టకేలకు విడుదలైంది. రవితేజ నుండి అభిమానులు, ప్రేక్షకులు ఆశించే అసలుసిసలైన మాస్ వేడుకలా ఈ ట్రైలర్ ఉంది.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25
రైల్వే పోలీస్ పాత్రలో రవితేజ
Image Credit : Asianet News

రైల్వే పోలీస్ పాత్రలో రవితేజ

రైల్వే పోలీస్ అధికారిగా రవితేజ తనదైన శైలిలో ఒదిగిపోయిన తీరు కట్టిపడేసింది. రవితేజ అంటేనే ఉత్సాహంతో తెర వెలిగిపోతుంది. ఆ ఉత్సాహం 'మాస్ జతర' ట్రైలర్ లో అడుగడుగునా కనిపించింది. భారీ యాక్షన్ సన్నివేశాలు, అదిరిపోయే పంచ్ డైలాగ్‌లతో మాస్ మహారాజా అభిమానులు కోరుకునే మాస్ విందులా ఈ ట్రైలర్ ను మలిచారు. కథానాయకుడు, ప్రతినాయకుడు మధ్య ఉత్కంఠభరితమైన సంఘర్షణ నేపథ్యంలో ట్రైలర్ ను రూపొందిన తీరు ఆకట్టుకుంది. వాణిజ్య అంశాలతో నిండిన పూర్తి స్థాయి వినోదాత్మక చిత్రానికి హామీ ఇచ్చేలా 'మాస్ జతర' ట్రైలర్ ఉంది. నవీన్ చంద్ర మరోసారి శక్తివంతమైన ప్రతినాయక పాత్రలో మెరిసి, రవితేజను ఢీకొట్టే పాత్రలో మెప్పించారు.

Related Articles

Related image1
నాగార్జున, పవన్ కళ్యాణ్ తో సినిమాలు.. నా కష్టానికి ఫలితం దక్కలేదు, మ్యూజిక్ డైరెక్టర్ షాకింగ్ కామెంట్స్
Related image2
ఎవరికీ తెలియకుండా ఈ విలన్ అంత గొప్ప పని చేశారా, పేద విద్యార్థుల కోసం ఏం చేశారంటే..
35
శ్రీలీలతో రవితేజ కెమిస్ట్రీ అదుర్స్
Image Credit : Asianet News

శ్రీలీలతో రవితేజ కెమిస్ట్రీ అదుర్స్

ట్రైలర్ కు మరింత ఆకర్షణ, తాజాదనాన్ని జోడిస్తూ, కథానాయిక శ్రీలీల తెరపై ఎంతో అందంగా కనిపించారు. ఆమె మొదటిసారి శ్రీకాకుళం యాసలో మాట్లాడినప్పటికీ, ఆ యాసను పూర్తిగా ఆస్వాదిస్తూ అద్భుతంగా పలికిన తీరు ఆశ్చర్యపరిచింది. రవితేజ-శ్రీలీల ఆన్ స్క్రీన్ కెమిస్ట్రీ, ఈ ట్రైలర్ కు మరింత అందాన్ని తీసుకొచ్చింది.

45
భీమ్స్ సంగీతం
Image Credit : Asianet News

భీమ్స్ సంగీతం

ఇప్పటికే పాటలతో ప్రేక్షకుల మనసు దోచుకున్న సంగీత దర్శకుడు భీమ్స్ సిసిరోలియో, తన నేపథ్య సంగీతంతో ట్రైలర్ ను మరో స్థాయికి తీసుకెళ్ళారు. రవితేజ వింటేజ్ మాస్ ఆరాకు సరిగ్గా సరిపోయేలా ఆయన సంగీతం ఉంది. భారీ పోరాట సన్నివేశాలు, కడుపుబ్బా నవ్వించే హాస్యం, అద్భుతమైన పాటలతో విందు భోజనం లాంటి చిత్రానికి 'మాస్ జాతర' హామీ ఇస్తోంది.

55
నాగవంశీ నిర్మాణంలో..
Image Credit : Asianet News

నాగవంశీ నిర్మాణంలో..

తెలుగులో ఎన్నో విజయవంతమైన చిత్రాలకు రచయితగా పనిచేసిన భాను భోగవరపు, 'మాస్ జాతర' చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. శ్రీకర స్టూడియోస్ సమర్పణలో సితార ఎంటర్‌టైన్‌మెంట్స్, ఫార్చూన్ ఫోర్ సినిమాస్ పతాకాలపై సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య ఈ చిత్రాన్ని ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. ప్రేక్షకులకు పూర్తి స్థాయి మాస్ విందుని అందించడానికి అక్టోబర్ 31న 'మాస్ జాతర' చిత్రం ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో అడుగుపెట్టనుంది.

About the Author

TD
Tirumala Dornala
ఏడేళ్లుగా డిజిటల్, వెబ్ మీడియా రంగంలో పనిచేస్తున్నారు. ప్రధానంగా సినిమా, ఎంటర్టైన్మెంట్ విభాగాల్లో పని చేసిన అనుభవం ఉంది. గతంలో కొన్ని మీడియా సంస్థల్లో సబ్ ఎడిటర్ గా రాణించారు. ప్రస్తుతం 2021 నుంచి ఏసియా నెట్ లో ఎంటర్టైన్మెంట్ విభాగంలో సీనియర్ సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. సినిమాకి సంబంధించిన వార్తలు, విశ్లేషణలు అందించడంలో అనుభవం ఉంది.
తెలుగు సినిమా
ఏషియానెట్ న్యూస్
వినోదం

Latest Videos
Recommended Stories
Recommended image1
Maa Ramudu Andarivadu: సీఎం పాత్రలో హీరో సుమన్.. ట్విస్టులు అదిరిపోతాయి, హిట్ గ్యారెంటీ అంటూ కామెంట్స్
Recommended image2
OG Universe: ఇదీ పవన్ కళ్యాణ్ కి అసలైన బర్త్ డే గిఫ్ట్.. గూస్ బంప్స్ తెప్పిస్తున్న ఓజీ యూనివర్స్ వీడియో
Recommended image3
Short Films for Kids: పిల్లలకు తప్పక చూపించాల్సిన 5 షార్ట్స్ ఫిల్మ్స్.. ఇవి చూస్తే ఇక రీల్స్ జోలికెళ్లరు
Related Stories
Recommended image1
నాగార్జున, పవన్ కళ్యాణ్ తో సినిమాలు.. నా కష్టానికి ఫలితం దక్కలేదు, మ్యూజిక్ డైరెక్టర్ షాకింగ్ కామెంట్స్
Recommended image2
ఎవరికీ తెలియకుండా ఈ విలన్ అంత గొప్ప పని చేశారా, పేద విద్యార్థుల కోసం ఏం చేశారంటే..
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved