మ్యాజిక్ కళ్ళతో కట్టిపడేస్తున్న రష్మిక.. నేషనల్ క్రష్ కొంటె చూపులకు కుర్రాళ్లు బౌల్డ్
రష్మిక మందన తక్కువ టైంలోనే క్రేజీ హీరోయిన్ గా మారిపోయింది. తెలుగులో రష్మిక ఛలో చిత్రంతో ఎంట్రీ ఇచ్చిన సంగతి తెలిసిందే.

రష్మిక మందన తక్కువ టైంలోనే క్రేజీ హీరోయిన్ గా మారిపోయింది. తెలుగులో రష్మిక ఛలో చిత్రంతో ఎంట్రీ ఇచ్చిన సంగతి తెలిసిందే. ఆ చిత్రంలో రష్మిక అల్లరి వేషాలు కుర్రాళ్లకు బాగా నచ్చేశాయి.

ఘాటుగా గ్లామర్ కూడా ఒలకబోయడంతో ఆమె అందాలకు కుర్రాళ్లు ఫిదా అయిపోయారు. దీనితో రష్మికకు టాలీవుడ్ లో వరుస ఆఫర్స్ వచ్చాయి. గీత గోవిందం, భీష్మ, సరిలేరు నీ కెవ్వరు లాంటి సూపర్ హిట్స్ ని రష్మిక తన ఖాతాలో వేసుకుంది.
ప్రస్తుతం రష్మిక సౌత్ లో క్రేజీ హీరోయిన్ గా మారిపోయింది. ప్రస్తుతం రష్మిక స్టార్ హీరోల సరసన అవకాశాలు అందుకుంటోంది. సౌత్ లో అత్యధిక రెమ్యునరేషన్ అందుకునే హీరోయిన్లలో రష్మిక ఒకరు.
సోషల్ మీడియాలో రష్మిక చాలా యాక్టివ్. ఆమె తన గ్లామరస్ పిక్స్ ని షేర్ చేస్తే క్షణాల్లో వైరల్ అయిపోతుంది. రష్మికని ఇన్స్టాగ్రామ్ లో 21 మిలియన్ల మంది ఫాలో అవుతున్నారు.
రష్మిక తాజాగా పోస్ట్ చేసిన పిక్ నెటిజన్లని విశేషంగా ఆకర్షిస్తోంది. గ్రీన్ టాప్ లో కనిపిస్తున్న రష్మిక కళ్ళతోనే మాయ చేసే విధంగా ఫోజు ఇచ్చింది.
నా కళ్ళలో మ్యాజిక్.. మనసులో స్పార్క్ ఉంది అంటూ ఈ పిక్ కి రష్మిక కామెంట్ పెట్టింది. రష్మిక ప్రస్తుతం అల్లు అర్జున్ సరసన పుష్ప చిత్రంలో నటిస్తున్న సంగతి తెలిసిందే.