Rashmika Mandanna : రష్మిక మందన్న టాటూ సీక్రెట్ ఇదే? ఇంత స్టోరీ ఉందా!
నేషనల్ క్రష్, స్టార్ హీరోయిన్ రష్మిక మందన్న (Rashmika Mandanna)తాజాగా ఓ సీక్రెట్ ను రిలీజ్ చేసింది. అందేంటో కాదు.. తన చేతిపై ఉన్న ‘టాటూ’ వెనుక జరిగిన కథను వివరించింది. అది ఇంట్రెస్టింగ్ న్యూస్ గా మారింది.

బ్లాక్ బాస్టర్ ఫిల్మ్ ‘పుష్ప : ది రైజ్’తో రష్మిక మందన్న ఒక్కసారిగా నేషనల్ క్రష్ గా మారిపోయింది. ఈ దెబ్బతో బాలీవుడ్ లోనూ వరుస ఆఫర్లను అందుకుంటూ దూసుకుపోతోంది. ప్రస్తుతం తను నటించిన హిందీ చిత్రాలు ఒక్కొక్కటిగా రిలీజ్ అవుతూ వస్తున్నాయి.
ఈ క్రమంలో ఆయా ఇంటర్వ్యూల్లో రష్మిక ఏం మాట్లాడిన క్షణాల్లో వైరల్ అవుతోంది. తాజాగా బాలీవుడ్ మీడియాతో రష్మిక మందన్న మాట్లాడుతూ.. తన వ్యక్తిగత విషయాలను కూడా షేర్ చేసుకుంది. ఈ సందర్భంగా తన కుడి చేతిపై ఉన్న టాటూ వెనుక ఉన్న రహస్యాన్ని చెప్పేసింది.
రష్మిక మాట్లాడుతూ.. మొదట్లో తనకు టాటూలపై ఆసక్తి లేదని చెప్పింది. తను కాలేజీలో ఉన్నప్పుడు క్లాస్మేట్ ఒకరు అమ్మాయిలపై కామెంట్ చేయడంతో టాటూ వేయించుకుందంట. ఆ వ్యక్తి ‘ఆడపిల్లలు బాధను తట్టుకోలేరు.. వాళ్లకు సూదులన్నా భయమే’ అంటూ కామెంట్ చేయడంతో అది తప్పు అని నిరూపించాలనుకుందంట.
దీంతో వెంటనే టాటూ వేయించుకోవాలని డిసైడ్ అయ్యి.. ఏం వేయించుకోవాలో ఆలోచిందిందంట. ఈ క్రమంలో ‘ఎవరూ, ఎవరిన్ని భర్తీ చేయలేరు. ప్రతి ఒక్కరికి సొంతం గుర్తింపు ఉంటుంది. ఎవరికి వారు ప్రత్యేకమే’ అనే అర్థం వచ్చేలా Irreplaceable అనే పదాన్ని టాటూగా వేయించుకుందంటా.
ఈ విషయం తెలుసుకున్న రష్మిక ఫ్యాన్స్ ఆమెను పొగుడుతున్నారు. ఇలా ప్రతి అంశాన్ని ఛాలెంజింగ్ తీసుకోవడం వల్లే స్టార్ హీరోయిన్ మారిందంటూ ప్రశంసిస్తున్నారు. మరోవైపు రష్మిక మందన్న కూడా తన కేరీర్ కోసం ఎంతలా కష్టపడుతుందో తెలిసిందే. ఫలితం పాన్ ఇండియా హీరోయిన్ గా దూసుకుపోతోంది.
ఇక గతేడాది అక్టోబర్ లో అమితాబ్ తో కలిసి నటించిన ‘గుడ్ బై’ చిత్రం విడుదలై మంచి టాక్ ను సొంతం చేసుకుంది. కానీ బాక్సాఫీస్ వద్ద ఫెయిల్ అయినట్టు ట్రేడ్ వర్గాలు నివేదికలు తెలుపుతున్నారు. ఇక ఈ నెల 20 నుంచి సిద్ధార్థ్ మల్హోత్రా సరసన నటించిన ‘మిషన్ మజ్ను’ నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ కానుంది. ప్రస్తుతం ‘యానిమల్’,‘పుష్ప 2’లో నటిస్తోంది. ఇక సంక్రాంతి కానుగా వచ్చిన ‘వారసుడు’ థియేటర్లలో సందడి చేస్తోంది.