- Home
- Entertainment
- `జెర్సీ` ఆఫర్ రిజక్ట్ చేయడంపై రష్మిక మందన్నా ఓపెన్.. తెలివి అంటే అదే మరి.. నేషనల్ క్రష్షా మజాకా!
`జెర్సీ` ఆఫర్ రిజక్ట్ చేయడంపై రష్మిక మందన్నా ఓపెన్.. తెలివి అంటే అదే మరి.. నేషనల్ క్రష్షా మజాకా!
రష్మిక మందన్నా.. `జెర్సీ` సినిమాపై స్పందించింది. ఇందులో హీరోయిన్‌గా నటించే ఆఫర్ తిరస్కరించిన నేపథ్యంలో తాను ఎందుకు రిజెక్ట్ చేసిందో వెల్లడించింది. ఆమె సమాధానం విని తెలివిగా తప్పించుకుందంటున్నారు నెటిజన్లు.

నేషనల్ క్రష్‌గా నేషనల్ వైడ్‌గా పాపులర్ అయ్యింది రష్మిక మందన్నా(Rashmika Mandanna). `పుష్ప` చిత్రంతో ఏకంగా పాన్ ఇండియా కథానాయికగా పేరుతెచ్చుకుంది. ఇప్పుడు వరుసగా బిగ్ ప్రాజెక్ట్స్ తో దూసుకుపోతుంది. తిరుగులేని స్టార్ హీరోయిన్‌గా రాణిస్తుంది. స్టార్ హీరోలకు బెస్ట్ ఆప్షన్‌గా నిలుస్తున్న రష్మిక మందన్నా తాజాగా ఓ ఆసక్తికర విషయాన్ని పంచుకుంది. బాలీవుడ్ `జెర్సీ` రిజక్ట్ చేయడంపై ఆమె ఓపెన్ అయ్యింది.
నాని హీరోగా నటించిన హిట్ మూవీ `జెర్సీ`(Jersey) హిందీలో రీమేక్ చేశారు. అల్లు అరవింద్, సితార ఎంటర్‌టైన్‌మెంట్ కలిసి, ఓ బాలీవుడ్ నిర్మాణ సంస్థతో కలిసి నిర్మించారు. షాహిద్ కపూర్, మృణాల్ ఠాకూర్ జంటగా నటించారు. గత శుక్రవారం విడుదలైన ఈ చిత్రం ఫ్లాప్ టాక్‌ని తెచ్చుకుంది. అయితే ఇందులో హీరోయిన్‌గా మొదట రష్మిక మందన్నాకే ఛాన్స్ వచ్చిందట. దాన్ని తాను రిజక్ట్ చేసింది. ఎందుకు రిజక్ట్ చేశారనేదానిపై ఆమె ఓపెన్ అయ్యింది.
ఓ జాతీయ మీడియాతో రష్మిక మందన్నా ముచ్చటించింది. తాను అప్పటి వరకు అన్ని కమర్షియల్ చిత్రాలు చేశానని, `జెర్సీ` లాంటి చిత్రంలో నటిస్తే ఎలా ఉంటుందో అనే సందేహం కలిగిందట. ఆ చిత్రం మంచిది కాదని తన ఉద్దేశ్యం కాదని, చాలా రియలిస్టిక్ చిత్రమని, తాను సూట్ అవుతానా అనే డౌట్ వచ్చిందట. తెలుగు వెర్షన్‌లో నానికి జోడీగా శ్రద్ధా శ్రీనాథ్ నటించింది. ఆమె అద్భుతంగా చేసింది.
ఆ పాత్రలో శ్రద్ధా శ్రీనాథ్ కంటే తాను గొప్పగా నటించలేనని రష్మిక భావించిందట. అందుకే ఆ పాత్రకి తాను కరెక్ట్ కాదని రిజక్ట్ చేసినట్టు చెప్పింది రష్మిక మందన్నా. కావాలనుకుంటే తాను నటించడానికి సిద్ధమే అని, కాకపోతే పాత్రకి న్యాయం చేయలేకపోతే దర్శక, నిర్మాతలు నష్టపోతారనే ఉద్దేశ్యంతో నో చెప్పినట్టు వెల్లడించింది నేషనల్ క్రష్.
అయితే ప్రస్తుతం ఆ సినిమా హిందీలో ఆల్మోస్ట్ డిజాస్టర్ టాక్ తెచ్చుకుంటోంది. కాకపోతే షాహిద్ కపూర్‌కి ప్రశంసలు దక్కుతున్నాయి. కానీ కమర్షియల్ డీలా పడిపోయింది. మరీ స్లోగా ఉందనే కామెంట్లు వినిపించాయి. సినిమా పరాజయం చెందడంతో రష్మిక తెలివిగా తప్పించుకుందని అంటున్నారు నెటిజన్లు. నేషనల్ క్రష్ తెలివే వేరని, నేషనల్ క్రష్షా మాజాకా అంటూ,ఆమెపై ప్రశంసలు కురిపిస్తున్నారు ఇంటర్నెట్ ఫ్యాన్స్.
రష్మిక మందన్నా.. ఇటీవల `పుష్ప`తో బ్లాక్‌బస్టర్ అందుకుంది. `ఆడవాళ్లు మీకు జోహార్లు` చిత్రంతో పరాజయాన్ని చవిచూసింది. కానీ భారీ ఆఫర్స్ తో దూసుకుపోతుంది. ప్రస్తుతం ఆమె తెలుగులో అల్లు అర్జున్‌తో `పుష్ప 2`లో నటిస్తుంది. మరోవైపు ఇటీవలే థళపతి విజయ్‌తో `విజయ్66` చిత్రంలో ఫైనల్ అయ్యింది. వంశీపైడిపల్లి రూపొందించే చిత్రమిది. మరోవైపు హిందీలో రణ్‌బీర్ కపూర్‌తో `యానిమల్` సినిమా చేస్తుంది. దీంతోపాటు `మిషన్ మజ్ను`, `గుడ్‌బై` సినిమాల్లో నటించింది రష్మిక.