- Home
- Entertainment
- అల్లు అర్జున్ నే గుర్తుపట్టలేదా.. రష్మిక మందన్న ఇంట్రెస్టింగ్ కామెంట్స్.. నిజమే కదా?
అల్లు అర్జున్ నే గుర్తుపట్టలేదా.. రష్మిక మందన్న ఇంట్రెస్టింగ్ కామెంట్స్.. నిజమే కదా?
స్టార్ హీరోయిన్ రష్మిక మందన్న ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ పై ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేసింది. వీరిద్దరూ బ్లాక్ బాస్టర్ ఫిల్మ్ ‘పుష్ఫ’లో కలిసి నటించిన విషయం తెలిసిందే. అయితే తాజాగా ఈ బ్యూటీ చేసిన కామెంట్స్ వైరల్ గా మారాయి.

‘పుష్ఫ’ సినిమాతో దేశవ్యాప్తంగా అభిమానులకు సంపాదించుకున్నారు అల్లు అర్జున్ (Allu Arjun), ఇంకా యంగ్ హీరోయిన్ రష్మిక మందన్న. ఈ మూవీలో ప్రధానంగా పుష్పరాజ్ మ్యానరిజం, డైలాగ్స్, సాంగ్స్, డాన్స్ మూమెంట్స్ కు ప్రపంచ వ్యాప్తంగా అన్ని వర్గాల నుంచి సాలిడ్ రెస్పాన్స్ వచ్చింది. ఈ క్రేజ్ తో బన్నీకి ఇంటర్నేషనల్ బ్రాండ్స్ ను ప్రమోట్ చేసే అవకాశం దక్కుతోంది.
ఇటీవల పేరుగాంచిన ఇంటర్నేషనల్ ప్లాస్టిక్ పైప్ కంపెనీ ‘ఆస్ట్రాల్’ కోసం అల్లు అర్జున్ యాడ్ ఫిల్మ్ చేశారు. షూట్ కూడా పూర్తి చేశారు. దీనికి టాలీవుడ్ దర్శకుడు హరీశ్ శంకర్ దర్శకత్వం వహించారు. ఈ యాడ్ షూట్ కు సంబంధించిన పిక్స్, అల్లు అర్జున్ నయా లుక్ రీసెంట్ గా బయటికి వచ్చింది.
అల్లు అర్జున్ న్యూ లుక్ ఇంటర్నెట్ ను షేక్ చేస్తోంది. నోట్లో బీడీ కట్ట, నెరిసిన జుట్టు, అట్రాక్టివ్ హెయిర్ స్టైయిల్, చెవులకు పోగులతో సరికొత్తగా కనిపిస్తున్నారు. అయితే ఈ కొత్త లుక్ కు సంబంధించిన ఫొటోను అల్లు అర్జున్ రీసెంట్ గా సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన విషయం తెలిసిందే. ఇప్పటికీ ఈ పిక్స్ ఇంటర్నెట్ లో వైరల్ అవుతూనే ఉంది.
అయితే తాజాగా అల్లు అర్జున్ పోస్ట్ ను చూసిన నేషనల్ క్రష్ రష్మిక మందన్న (Rashmika Mandanna) ఇంట్రెస్టింగ్ కామెంట్ పెట్టింది. అల్లు అర్జున్ నయా లుక్ కు యంగ్ బ్యూటీ ఫిదా అయ్యింది. ‘దేవుడా.. ఒక్క క్షణం మిమ్మల్ని గుర్తుపట్టలేకపోయాను సార్’ అంటూ కామెంట్ చేసింది. నిజానికి ఊహించని విధమైన లుక్ లో బన్నీ కనిపించడం.. ఫ్యాన్స్ థ్రిల్ ఫీలవుతున్నారు. రష్మిక లాగే ఒక్కసారిగా చూస్తే గుర్తుపట్టడం కష్టమనే అంటున్నారు. ప్రస్తుతం అల్లు అర్జున్ పోస్ట్ పై రష్మిక కామెంట్ వైరల్ గా మారింది.
ప్రస్తుతం బాలీవుడ్ లో వరుస చిత్రాలు చేస్తూ తన ఫ్యాన్స్ ను, ఆడియెన్స్ ను అలరిస్తోంది రష్మిక.. ఏకంగా బడా హీరోల సరనస నటిస్తున్న ఈ ముద్దుగుమ్మ తన సినిమాలను ఒక్కొక్కటిగా ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తోంది. ప్రస్తుతం ‘సీతా రామం’, ‘గుడ్ బై’ చిత్రాలను రిలీజ్ కు సిద్ధ అయ్యాయి.
ఈ చిత్ర ప్రమోషన్స్ లో రష్మిక బిజీగా ఉంది. ఈ సందర్భంగా ట్రెండీ అవుట్ ఫిట్స్ లో మెరుస్తూ తన అభిమానులను ఫిదా చేస్తోంది. క్రేజీ ప్రాజెక్టుల్లో అవకాశాలను దక్కించుకుంటూ నేషనల్ క్రష్ గా మరింత పాపులారిటీని సొంతం చేసుకుంటోంది. ‘వారసుడు, పుష్ఫ : ది రూల్, యానిమల్’ చిత్రాల్లో ప్రస్తుతం నటిస్తోందీ బ్యూటీ.