- Home
- Entertainment
- హాట్ టాపిక్.. పుష్ప తర్వాత 5 లగ్జరీ ఫ్లాట్స్ కొన్న రష్మిక..? నేషనల్ క్రష్ సంపాదన ఎంతంటే..
హాట్ టాపిక్.. పుష్ప తర్వాత 5 లగ్జరీ ఫ్లాట్స్ కొన్న రష్మిక..? నేషనల్ క్రష్ సంపాదన ఎంతంటే..
నేషనల్ క్రష్ రష్మిక మందన రష్మిక ఏం చేసినా క్షణాల్లో వైరల్ అవుతోంది. రష్మిక గ్లామర్ కి యువత ఫిదా అవుతున్నారు. చూపు తిప్పుకోలేని అందాలు, చిరునవ్వుతో రష్మిక మెస్మరైజ్ చేస్తోంది.

నేషనల్ క్రష్ రష్మిక మందన రష్మిక ఏం చేసినా క్షణాల్లో వైరల్ అవుతోంది. రష్మిక గ్లామర్ కి యువత ఫిదా అవుతున్నారు. చూపు తిప్పుకోలేని అందాలు, చిరునవ్వుతో రష్మిక మెస్మరైజ్ చేస్తోంది. ఛలో చిత్రంతో టాలీవుడ్ లోకి అడుగుపెట్టిన రష్మిక వరుస విజయాలు సొంతం చేసుకుంది. రష్మిక నటించిన పుష్ప చిత్రంతో ఆమె క్రేజ్ మరింతగా పెరిగింది.
Rashmika Mandanna
ఈ ఏడాది రష్మిక విజయ్ వారసుడు చిత్రంలో మెరిసింది. రష్మిక తరచూ వార్తలో ఉండే నటి. ఆమె సినిమాలు, వివాదాలు , ట్రోలింగ్ ఇలా పలు వ్యవహారాలతో రష్మిక వార్తల్లో నిలుస్తూ ఉంటుంది. అయితే తాజాగా రష్మిక గురించి ఒక హాట్ న్యూస్ సోషల్ మీడియాలో వైల్డ్ ఫైర్ లాగా వ్యాపిస్తోంది.
రష్మిక మందన పుష్ప చిత్రంతో పాన్ ఇండియా క్రేజ్ సొంతం చేసుకుంది. బాలీవుడ్ లో కూడా ఆమెకి ఆఫర్స్ వస్తున్నాయి. పుష్ప తర్వాత రష్మిక ఇండియాలోని ఐదు ప్రధాన నగరాల్లో 5 లగ్జరీ ఫ్లాట్స్ కొనుగోలు చేసినట్లు ప్రచారం జరుగుతోంది. వైరల్ అవుతున్న రూమర్ ప్రకారం రష్మిక బెంగళూరు, కూర్గ్, హైదరాబాద్, ముంబై, గోవా నగరాల్లో ఏ విలాసవంతమైన ఫ్లాట్స్ కొన్నట్లు ప్రచారం జరుగుతోంది.
రష్మిక తన రెమ్యునరేషన్, ఇతర యాడ్స్ ద్వారా వచ్చిన సంపాదనలో ఎక్కువ శాతం ఫ్లాట్స్ కొనేందుకు ఇన్వెస్ట్ చేస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. అయితే తాను 5 ఫ్లాట్స్ కొన్నట్లు జరుగుతున్న ప్రచారాన్ని రేష్మిక ఖండించింది. ఇది నిజమైతే బాగుండు అంటూ రష్మిక తన స్పందన తెలిపింది.
వరుస చిత్రాలతో బిజీగా ఉండే రష్మిక తరచుగా ముంబై, హైదరాబాద్ మధ్య తిరుగుతుండడం చూస్తూనే ఉన్నాం. రష్మికకి స్టార్ డమ్ వచ్చాక 5 కోట్ల వరకు రెమ్యునరేషన్ అందుకుంటోంది. ఈ స్థాయిలో పారితోషికం అందుకునే నటికి 5 ఫ్లాట్స్ కొనడం అసాధ్యం ఏమీ కాదు. కానీ ఈ వార్తలు అవాస్తవం అని రష్మిక ఖండించింది.
మరోవైపు రష్మిక విజయ్ దేవరకొండతో సహజీవనం చేస్తున్నట్లు కూడా తెలుస్తోంది. వీరిద్దరూ మాల్దీవులకు కలసి వెళ్లడం, తమ ప్రేమ గురించి హింట్స్ వదలడంతో నెటిజన్లకు దొరికిపోయారు. ఆ తర్వాత కవర్ చేసుకునేందుకు రష్మిక.. విజయ్ దేవరకొండ తో వెకేషన్ కి వెళితే తప్పేంటి అని హాట్ కామెంట్స్ చేసింది.