- Home
- Entertainment
- ‘షంషేరా’కోసం రన్బీర్ కపూర్ అదిరిపోయే మేక్ ఓవర్.. బాడీ బిల్డింగ్ కోసం బాలీవుడ్ స్టార్ కు ఎన్ని తిప్పలో..
‘షంషేరా’కోసం రన్బీర్ కపూర్ అదిరిపోయే మేక్ ఓవర్.. బాడీ బిల్డింగ్ కోసం బాలీవుడ్ స్టార్ కు ఎన్ని తిప్పలో..
బాలీవుడ్ లవర్ బాయ్ రన్బీర్ కపూర్ భారీ చిత్రం ‘షంషేరా’లో నటిస్తున్న విషయం తెలిసిందే. ఈ మూవీలో తొలిసారిగా డ్యూయల్ రోల్ లో నటించాడు. అయితే ఈ పాత్రల కోసం రన్బీర్ తన శరీరాకృతిని మార్చుకోవడం ఎంత కష్టమైందో రివీల్ చేశాడు.

బాలీవుడ్ స్టార్ హీరో, లవర్ బాయ్ రన్బీర్ కపూర్ (Ranbir Kapoor) నటిస్తున్న తాజా పాన్ ఇండియన్ ఫిల్మ్ ‘షంషేరా’ (Shamshera). ఈ చిత్రానికి దర్శకుడు కరణ్ మల్హోత్రా దర్శకత్వం వహించారు. ప్రస్తుతం మూవీ రిలీజ్ కు సిద్ధమవుతోంది. దీంతో చిత్ర యూనిట్ జోరుగా ప్రచార కార్యక్రమాలను షూరు చేశారు.
ఈ సందర్భంగా ఇంటర్వ్యూలో రన్బీర్ కపూర్ మాట్లాడుతూ ఈ చిత్రంలో తొలిసారిగా తను డ్యూయల్ రోల్ లో నటించాల్సి వచ్చిందని తెలిపారు. దీంతో తన బాడీ ట్రాన్స్ ఫామ్ కోసం ఎంతా కష్టపడ్డాడ్డో తెలియజేశాడు. ఇందుకోసం వారానికి ఐదురోజుల పాటు కఠినమైన నియమనిబంధనలతో కూడిన డైట్, అదేవిధంగా వర్క్ అవుట్ షెడ్యూల్ ఫాలో అయ్యే వాడని తెలిపాడు.
‘షంషేరా’లోని రెండు పాత్రలకు న్యాయం చేసేందుకు ఫిజికల్ ఫిట్ నెస్ తనకు చాలా కష్టమైందన్నారు. అయితే సన్నగా ఉండటం తన సాధారణ నిర్మాణమే కాబట్టి బరువు తగ్గడం చాలా సులభంగా జరిగిందంట. కానీ బాడీని బిల్డ్ చేయడం చాలా కష్టమైందన్నారు. ఈ సమయంలో చాలా గందరగోళానికి గురయ్యాడంట. ఈ విషయమై రణబీర్ కపూర్ ఫిట్‌నెస్ ట్రైనర్ కునాల్ గిర్ కు స్పందించారు.
రన్బీర్ సిక్స్ ప్యాక్ లుక్ రావడానికి స్పెషల్ ట్రైయినింగ్ తీసుకోవాల్సి వచ్చిందన్నారు. సినిమాలో రెండు పాత్రలకు అనువైన శరీరాకృతిని తీర్చిదిద్దడం కోసం ప్రత్యేక డైట్ ను రన్బీర్ ఫాలోయ్యాడని తెలిపారు. వారంలో ఐదు రోజులు భోజనం చేసేవాడని, ఒక రోజు మాత్రం అధిక ప్రొటీన్ మరియు తక్కువ కార్బ్ డైట్ ఉన్న ఆహార పదార్థాలను తీసుకునే వాడన్నారు. ఆ ఐదు రోజులు మాత్రం కఠినమైన శిక్షణ తీసుకున్నాడని తెలిపారు.
దర్శకుడు కరణ్ మల్హోత్రా సూచనల మేరకు పాత్రలకు అస్సెట్ గా ఉండేందుకు ఒక అథ్లైట్ గా మార్చేలా ట్రైయింగ్ ఇచ్చినట్టు తెలిపారు. అయితే బాడీ బిల్డింగ్ ట్రెయినింగ్ తో పాటు 5 నిమిషాల హై-ఇంటెన్సిటీ కార్డియో సెషన్‌ను కూడా నిర్వహించేవారంట. కొన్ని శ్వాస వ్యాయామాలపైనా వర్క్ చేసినట్టు తెలిపారు. షూటింగ్ పూర్తయ్యే వరకు ఇదే ఫార్మూలా ఫాలో అవడంతో.. షంషేరాలోని ప్రతి ఫ్రేమ్ అదిరిపోయేలా వచ్చిందని దర్శకుడు పేర్కొన్నాడు.
ఈ చిత్రంలో రన్బీర్ కపూర్, వాణీ కపూర్ (Vaani kapoor) జంటగా నటిస్తున్నారు. సంజయ్ దత్ కీలక పాత్ర పోషిస్తున్నారు. రూ.150 కోట్లతో యష్ రాజ్ ఫిల్మ్ బ్యానర్ లో 50వ చిత్రంగా ‘షంషేరా’ను ఆదిత్యా చోప్రా నిర్మించారు. ప్రముఖ సంగీత దర్శకుడు మిథూన్ మ్యూజిక్ అందించారు. జూలై 22న ప్రపంచ వ్యాప్తంగా హిందీతో పాటు తెలుగు, తమిళంలోనూ రిలీజ్ కాబోతోంది.