శభాష్ మిహీకా, పేదవారి కోసం గొప్ప పని చేస్తున్న రానా భార్య.. ఆ కుటుంబాల్లో వెలుగులు
పేద వారి కోసం మిహీకా ఎర్త్ యాంగిల్స్ అనే ఎన్జీవో ఆర్గనైజేషన్ తో కలసి కొన్ని కార్యక్రమాలు చేస్తోంది.

బాహుబలి చిత్రంతో రానా విలక్షణమైన నటన గురించి దేశం మొత్తం తెలిసింది. ఇప్పటికీ రానా ఒకే తరహా చిత్రాలు చేయకుండా నటుడిగా ప్రయోగాలు చేస్తున్నాడు. అయితే ఆశించిన స్థాయిలో సక్సెస్ దక్కడం లేదు. 2020లో తన ప్రేయసి మిహీక బజాజ్ ని వివాహం చేసుకుని రానా ఇంటివాడయ్యాడు. మిహీక తరచుగా సోషల్ మీడియాలో తన భర్తతో ఉన్న పిక్స్ షేర్ చేస్తూ ఉంటుంది.
ప్రస్తుతం వీరిద్దరూ అన్యోన్యంగా జీవిస్తున్నారు. అయితే మిహీకా సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటుంది. ఆమె పెట్టే పోస్టులు వైరల్ అవుతుంటాయి. తాజాగా మిహీకా బీచ్ లో ప్రశాంతంగా విహరిస్తున్న ఫొటోస్ షేర్ చేసింది.
లాంగ్ డ్రెస్ లో బీచ్ పక్కన చల్లగాలికి వాకింగ్ చేస్తూ గడుపుతోంది. ఈ ఫోటోలకు మిహీకా హ్యాపీ ప్లేస్, బీచ్ డేస్, లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్ అని కామెంట్స్ పెట్టింది. ఈ ఫొటోల్లో మిహీక పొట్ట కొంచెం ముందుకు కనిపిస్తుండడంతో ఆమె గర్భవతా అని నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు.
గతంలో కూడా మిహీకా ప్రెగ్నెన్సీ గురించి రూమర్స్ వచ్చాయి. అయితే అప్పుడు ప్రెగ్నన్సీ లేదని మిహీకా క్లారిటీ ఇచ్చింది. తాజాగా ఆమె చేసిన మరో పోస్ట్ అందరిని ఆకట్టుకుంటోంది. మిహీకా గొప్ప మనసుని అంతా కొనియాడుతున్నారు. ఇంతకీ మ్యాటర్ ఏంటంటే.. పేద వారి కోసం మిహీకా ఎర్త్ యాంగిల్స్ అనే ఎన్జీవో ఆర్గనైజేషన్ తో కలసి కొన్ని కార్యక్రమాలు చేస్తోంది.
ప్రస్తుతం మిహీకా ఈ సంస్థతో కలసి ఇండియాలో మారుమూల ప్రాంతాల్లో విద్యుత్ సౌకర్యం లేని గ్రామాల్లో పేద వారి కోసం సోలార్ ఎనర్జీతో వెలిగే లైట్స్ పంపిణి చేస్తున్నారు. ఈ విషయాన్ని మిహీకా సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది.
చిన్న సోలార్ ప్యానల్ కి కనెక్ట్ అయిన బల్బ్ పేద వారి ఇళ్లల్లో వెలుగులు విరజిమ్ముతోంది. ఇండియాలో ఇప్పటికి ఎలక్ట్రిసిటీ లేని గ్రామాలు ఉన్నాయి. ఆ గ్రామాల్లో మహిళలు రాత్రి వెళల్లో తమ పనులు చేసుకునేందుకు అవస్థలు పడకుండా ఎన్జీవో ఆర్గనైజేషన్ తో కలసి మిహీక చేస్తున్న ఈ కార్యక్రమం ఉపయోగపడుతోంది. రానా, మిహీకా అందిస్తున్న సపోర్ట్ కి థాంక్యూ అంటూ ఎర్త్ యాంగిల్స్ అనే ఎన్జీవో కామెంట్ పెట్టింది.