- Home
- Entertainment
- సౌందర్య ముఖంపై కాలు పెట్టి, ఆ టైం నాకు భయం వేసింది.. నా లైఫ్ లో బెస్ట్ డెసిషన్ అదే: రమ్యకృష్ణ
సౌందర్య ముఖంపై కాలు పెట్టి, ఆ టైం నాకు భయం వేసింది.. నా లైఫ్ లో బెస్ట్ డెసిషన్ అదే: రమ్యకృష్ణ
ఒకప్పుడు యువతని తన సొగసుతో ఊపేసిన రమ్యకృష్ణ ప్రస్తుతం సెకండ్ ఇన్నింగ్స్ లో పవర్ ఫుల్ రోల్స్ చేస్తోంది. రమ్యకృష్ణ అందం మాత్రమే నటన పరంగా కూడా ఆమెకి తిరుగులేదు.

ఒకప్పుడు యువతని తన సొగసుతో ఊపేసిన రమ్యకృష్ణ ప్రస్తుతం సెకండ్ ఇన్నింగ్స్ లో పవర్ ఫుల్ రోల్స్ చేస్తోంది. రమ్యకృష్ణ అందం మాత్రమే నటన పరంగా కూడా ఆమెకి తిరుగులేదు. రజనీకాంత్, చిరంజీవి, వెంకటేష్, బాలయ్య ఇలా స్టార్ హీరోలందరి సరసన నటించి మెప్పించింది. బాహుబలిలో శివగామి పాత్రతో రమ్యకృష్ణ దేశం మొత్తం ప్రశంసలు అందుకున్న సంగతి తెలిసిందే.
రేపు ఆగష్టు 10న విడుదల కాబోయే సూపర్ స్టార్ రజనీకాంత్ జైలర్ చిత్రంతో మరోసారి రమ్య ప్రేక్షకుల ముందుకు వస్తోంది. ఈ చిత్రంలో రమ్యకృష్ణ రజనీ సతీమణిగా నటించింది. ఈ సందర్భంగా ఓ ఇంటర్వ్యూలో రమ్యకృష్ణ మాట్లాడుతూ.. రజనీకాంత్ తో కలసి నటించిన నరసింహ చిత్రాన్ని గుర్తు చేసుకుంది. ఆ చిత్రంలో అవకాశం వచ్చినప్పుడు నేను హీరోయినా, సెకండ్ హీరోయినా , విలనా అనే దానిగురించి ఆలోచించలేదు.
రజనీకాంత్ సినిమాలో నేను కూడా ఉండాలి అనే ఉద్దేశంతో వెంటనే ఒకే చెప్పా. నీ జీవితంలో నేను తీసుకున్న బెస్ట్ డెసిషన్ నరసింహ మూవీ. ఆ మూవీలో సౌదర్య ముఖంపై కాలుపెట్టి నటించే సీన్ విషయంలో భయపడ్డా. ఆడియన్స్ ఎలా రిసీవ్ చేసుకుంటారో అనే కంగారు ఉండేది అని రమ్యకృష్ణ తెలిపింది.అయితే ఆ చిత్రంలో రజనీకి ధీటుగా నటించి ప్రశంసలు అందుకుంది.
తన సెకండ్ ఇన్నింగ్స్ లో మరో స్థాయి గుర్తింపు తెచ్చిపెట్టిన బాహుబలి గురించి కూడా రమ్యకృష్ణ కామెంట్స్ చేసింది. బాహుబలి అంత పెద్ద విజయం సాధిస్తుంది అని నేను ఊహించలేదు. ఆ మూవీ విషయంలో రాజమౌళికి నేను కొన్ని షరతులు పెట్టా. నైట్ షూటింగ్స్ లో పాల్గొనను.. కొద్దీ రోజులు మాత్రమే డేట్స్ ఇస్తా అంటూ తాను కండిషన్స్ పెట్టిన విషయాన్ని రమ్యకృష్ణ గుర్తు చేసుకున్నారు.
చిరంజీవి, రజనీకాంత్ గురించి మాట్లాడుతూ..కేవలం కొద్దిమందికి మాత్రమే అలంటి స్టార్ స్టేటస్ సాధ్యం అవుతుంది. వాళ్ళ చిత్రాలకు పిల్లల నుంచి వృద్ధుల వరకు ప్రతి ఒక్కరూ ఎంజాయ్ చేశారు. భవిష్యత్తులో ఇలాంటి స్టార్లు వస్తారో రారో నాకు తెలియదు. కానీ వీళ్ళలాగా సుదీర్ఘ కాలం కొనసాగడం మాత్రం కష్టం అని రమ్యకృష్ణ పేర్కొన్నారు.
ఇక జైలర్ చిత్రం ప్రతి ఒక్కరూ ఎంజాయ్ చేసే విధంగా ఉంటుందని రమ్యకృష్ణ తెలిపింది. మొత్తంగా రమ్యకృష్ణ సెకండ్ ఇన్నింగ్స్ లో సైతం స్టార్ హీరోల సినిమాల్లో నటిస్తూ బిజీగా మారింది.