MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Update
Today's Rasi Phalalu
Dakshina Kailasam Temple
Bigg Boss Agnipariksha
Ameer Log Movie Review
WTC Qualification Scenario
Sowcar Janaki
Agnipariksha Season 2
Telangana Air Pollution
Indian Diaspora in USA
Telangana Cinema Ticket Prices
Kavya Maran-Anirudh Wedding
Hyderabad TSRTC Bus Routes
  • Home
  • Entertainment
  • రమ్యకృష్ణకు భర్తగా, తండ్రిగా నటించిన ఆ ఇద్దరు నటులు ఎవరో తెలుసా...?

రమ్యకృష్ణకు భర్తగా, తండ్రిగా నటించిన ఆ ఇద్దరు నటులు ఎవరో తెలుసా...?

హీరోయిన్ గా, విలన్ గా, క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా.. తల్లిగా అక్కగా.. ఎన్నో పాత్రల్లో నటించి మెప్పించిన తార రమ్య కృష్ణ., తన కెరీర్ లో స్టార్ హీరోలతో పాటు.. స్టార్ క్యారెక్టర్ ఆర్టిస్ట్ ల సరసన కూడా నటించింది శివగామి. అయితే ఆమె ఓ ఇద్దరు నటుల పక్కన మాత్రం భార్యగా, కూతురిగా నటించి ఆశ్చర్యపరిచారు. ఇంతకీ ఆ నటులు ఎవరో తెలుసా.? 

2 Min read
Author : Mahesh Jujjuri
Published : Mar 31 2024, 01:01 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
19

హీరోయిన్ గా, విలన్ గా, క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా.. తల్లిగా అక్కగా.. ఎన్నో పాత్రల్లో నటించి మెప్పించిన తార రమ్య కృష్ణ., తన కెరీర్ లో స్టార్ హీరోలతో పాటు.. స్టార్ క్యారెక్టర్ ఆర్టిస్ట్ ల సరసన కూడా నటించింది శివగామి. అయితే ఆమె ఓ ఇద్దరు నటుల పక్కన మాత్రం భార్యగా, కూతురిగా నటించి ఆశ్చర్యపరిచారు. ఇంతకీ ఆ నటులు ఎవరో తెలుసా.? 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
29

రమ్యకృష్ణ పరిచయం అవసరం లేని పేరు.. సౌత్ లో ఆమె క్రేజ్అంతా ఇంతా కాదు.. హీరోయిన్ గా  దాదాపు రెండు దశాబ్ధాలుదుమ్మురేపి వదిలిపెట్టిన ఈ సీనియర్ తార.. ఆతరువాత క్యారెక్టర్ రోల్స్ విషయంలో కూడా అదే జోరు కొనసాగించింది. బాహుబలితో హీరోయిన్ ను మించిన క్రేజ్ ను క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా సంపాదించుకుంది. 
 

39


హీరోయిన్ గా ఆమె ఎన్ని సినిమాలు చేసినా.. శివగామిగా బాహుబలిలో రమకృష్ణను చూసి ఆడియన్స్ కు పూనకాలు వచ్చాయినే చెప్పాలి. అంతాల ఆసినిమాలో ఆమెప్రభావం కనిపించింది. ప్రభాస్ , రానా తరువాత ఆసినిమా ద్వారా రమ్యకృష్ణకే అంత క్రేజ్ వచ్చింది. ఇక ఇక క్యారెక్టర్ రోల్స్ లో కూడా ఈసీనియర్ తార ఎంతో ప్రభావం చూపించింది. 
 

49

స్టార్ హీరోలకు అమ్మ పాత్రల్లో నటిస్తూ.. మెప్పిస్తూ వచ్చింది రమ్య కృష్ణ. తాజాగా ఆమెకు సబంధించిన ఓ ఇంట్రెస్టింగ్ విషయం వైరల్ అవుతోంది. అదేంటంటే.. ఇండస్ట్రీలో ఇద్దరు నటులతో ఆమె భార్యగా నటించింది... వారికి కూతురిగా కూడా నటించి మెప్పించింద. ఇంతకీ ఎవరా నటులు అనుకుంటున్నారా.. ఎవరో కాదు.. ప్రకాశ్ రాజ్, నాజర్. 
 

59

విలక్షణ నటుడు ప్రకాశ్ రాజ్ ఎన్నో పాత్రల్లో మెరిశారు. అందులో భాగంగా ఎప్పుడో 30 ఏళ్ల కిందట వచ్చిన ఆవిడే శ్యామల సినిమాతో పాటు.. ఆతరువాత కాలంలో వచ్చిన కొంచెం ఇష్టం కొంచెం కష్టం, రంగమార్తాండ లాంటి సినిమాల్లో ప్రకాశ్ రాజ్ భార్యగా నటించారు రమ్యకృష్ణ. 

69

ఇక రీసెంట్ గా వచ్చిన గుంటూరు కారం సినిమాలో.. మహేష్ బాబు తల్లిగా నటించిన రమ్యకృష్ణ.. అటు ప్రకాశ్ రాజ్ కూతురుగా కనిపించారు. 

79

ఇక మరో నటుడు నాజర్.. ఆయన కూడా తమిళంతో పాటు.. తెలుగులో కూడా మంచి క్రేజ్ ఉన్న నటుడు. ఆయన సరసన కూడా రమ్యకృష్ణ మూడు రకాల పాత్రల్లో నటించారు. బాహుబలి సినిమాలో నాజర్ భార్యగా నటించిన రమ్యకృష్ణ.. 

89

అంతకు ముందు గతంలో రజనీకాంత్ హీరోగా వచ్చిన నరసింహలో రమ్య కృష్ణకు నాజర్ అన్న పాత్రలో నటించారు. ఈయనకు రమ్య కృష్ణ వంత రాజవతాన్ వరువేన్ అనే తమిళ సినిమాలో కూతురి పాత్రలో నటించింది. ఇలా నాజర్ కు కూతురు, చెల్లి, భార్య పాత్రలను పోషించింది రమ్య కృష్ణ.

99

ఇలా రమ్యకృష్ణ రకరకాల పాత్రల్లో నటించి మెప్పించారు. ప్రస్తుతం ఎక్కువగా క్యారెక్టర్ రోల్స్ చేస్తూ.. సందడి చేస్తోంది. ఒకప్పుడు వాణిశ్రీ మాదిరిగా.. రమ్య కృష్ణ కూడా గ్లామర్ హీరోయిన్ గా.. హీరోయిన్ల తల్లిగా.. హీరోల అత్త పాత్రలతో పాటు.. కాస్త నెగెటీవ్ శేడ్స్ ఉన్న పాత్రల్లో కూడా మెప్పిస్తోంది. 

About the Author

MJ
Mahesh Jujjuri
మహేశ్ జుజ్జూరి 13 ఏళ్ళకు పైగా తెలుగు జర్నలిస్టుగా పని చేస్తున్నారు. ఈయన గతంలో 10 టీవీలో సినిమా, ఫీచర్స్ జర్నలిస్టుగా పని చేశారు. 2021 నుంచి ఏసియా నెట్ తెలుగులో సినిమా జర్నలిస్టుగా ఉన్నరు. ఓటీటీ, టీవీ, బిగ్ బాస్, లైఫ్ స్టైల్ ఇతర సెలబ్రిటీలకు సంబందించిన విశేషాలను, ఫీచర్లను రాయడం ఈయన ప్రత్యేకత. క్వాలిటీ కంటెంట్‌ తో విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది.

Latest Videos
Recommended Stories
Recommended image1
Bigg Boss Agnipariksha 2: సృష్టితో డీమాన్ పవన్ రొమాన్స్, డేంజర్ కార్డ్ బయటకు తీసిన అభిజిత్
Recommended image2
Irumudi Day 2 Collections: రెండో రోజు ఇరుముడి కి దిమ్మతిరిగే కలెక్షన్లు, బాక్సాఫీస్ దగ్గర దుమ్మురేపుతున్న రవితేజ మూవీ
Recommended image3
Chiranjeevi Movie Remake: చిరంజీవి సూపర్ హిట్ మూవీ రీమేక్, ఆ కామెడీ హీరోకే సాధ్యం.. తేల్చేసిన రాంచరణ్, కానీ
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved