Janaki Kalaganaledu: జెస్సీ ముందు దొంగ ప్రేమ నటిస్తున్న అఖిల్.. జానకి మాటలకు ఆలోచనలో పడ్డ రామచంద్ర?
Janaki Kalaganaledu: బుల్లితెరపై ప్రసారమవుతున్న జానకి కలగనలేదు సీరియల్ మంచి కుటుంబ కథ నేపథ్యంలో కొనసాగుతూ ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటుంది. కుటుంబం పరువుతో కూడిన కాన్సెప్ట్ తో ఈ సీరియల్ కొనసాగుతుంది. ఇక ఈరోజు నవంబర్ 30 వ ఎపిసోడ్ లో ఏం జరిగిందో తెలుసుకుందాం..
ఈరోజు ఎపిసోడ్ లో మల్లిక దేవుడు ముందు కూర్చుని అక్కడ ఉన్న ఆకులను చూసి షాక్ లో ఉంటుంది. అప్పుడు మల్లిక ఒసేయ్ చికిత ఈ లక్ష పత్ర పూజ అంటే ఎప్పుడు పూర్తవ్వాలి అంటూ ఏడుపు ముఖం పెట్టగా వెంటనే పనిమనిషి చికిత అమ్మగారి మీకోసం ముక్కున్నారు కదా అమ్మా చేయాల్సిందే అని అంటుంది. అప్పుడు చికిత నేను 1000 ఆకులు తీసుకుని వచ్చి ఇక్కడ వేస్తాను నువ్వు పూజ చెయ్యి అమ్మగారు అని అనగా వెంటనే మల్లిక నేను మనసులో మమ అనుకుని పూజ చేస్తాను ఈ పూజ ఏదో చికిత ప్లీజ్ ప్లీజ్ అని అంటుండగా ఇంతలో అక్కడికి గోవిందరాజులు వస్తాడు. అమ్మ మల్లిక నువ్వు చేసిన పనులు దోషాలు పోవాలి అంటే ఈ పూజ చేయాల్సిందే అని అంటాడు.
అప్పుడు విష్ణు ఎలాగో లేడు కాబట్టి నీతో ఈ పూజ దగ్గరుండి చేయించమని మీ అత్తయ్య గాడు ఆర్డర్ వేశారు అని అనగా నా పని అయిపోయింది అనుకుంటూ ఉంటుంది. అప్పుడు గోవిందరాజులు ఓం నమశ్శివాయ అంటుండగా మల్లిక విసుక్కుంటూ పూజ చేస్తూ ఉంటుంది. ఆ తర్వాత రామచంద్ర దేవుడు ముందు చేతిలో హారతి వెలిగించుకొని నా భార్య మనసు మార్చు స్వామి అని కోరుకుంటూ ఉండగా అది చూసిన జానకి ఒక్కసారిగా షాక్ అయ్యి అక్కడికి పరుగుతో వెళ్లి ఆ కర్పూరాన్ని పక్కకు నూకేస్తుంది. ఆ కర్పూరం వెళ్లి దేవుడి ముందు పడుతుంది. అప్పుడు ఏం చేస్తున్నారు రామచంద్ర గారు అని జానకి అడగగా నీ మనసు మార్చమని మీరు మళ్ళీ కాలేజీకి వెళ్లేలా చేయమని ఆ దేవుడిని కోరుకుంటున్నాను అని అనగా జానకి చేతులు జోడించి పదేపదే ఆ విషయాన్ని ప్రస్తావించకండి అని అంటుంది.
నేను ఒకటికి పది సార్లు ఆలోచించే ఈ నిర్ణయాన్ని తీసుకున్నాను నాకు ఈ నిర్ణయం మంచిదే అనిపించింది ఉంటుంది మన జానకి. అప్పుడు రామచంద్రా నేను మీకు ఒక విషయం చెప్పాలి అనుకుంటున్నాను అంటూ అప్పుడు మీరు ఇచ్చిన మాటను మీకే మీకు గుర్తు చేయాలి అనుకుంటున్నాను అంటూ ఒక పెన్నున్ని చూపిస్తాడు రామచంద్ర. అప్పుడు రామచంద్ర ఆ పెన్నును చూపిస్తూ జానకి కర్తవ్యం గురించి మరోసారి గుర్తు చేస్తాడు. అప్పుడు రామచంద్ర ఎంత చెప్పినా జానకి ఎమోషనల్ అయితే వినిపించుకోకుండా నేను తీసుకున్న నిర్ణయం కరెక్టే రామా గారు అని అంటుంది.
తప్పు చేసింది భర్త అయినా శిక్షించే అంత ధైర్యం ఉంటే చదువు చదవాలి లేకుంటే చదువు కుటుంబము ఏదో ఒక బాధ్యత మాత్రమే తీసుకోవాలి అని అంటుంది జానకి. నాకు ఈ ఐపీఎస్ వద్దు కుటుంబం చాలు అని అంటుంది. అప్పుడు నీకు ఐపీఎస్ అవ్వాలి అన్న కోరిక లేదేమో కానీ నా భార్యను నేను ఐపీఎస్ ఆఫీసర్ గా చూడాలి అనుకుంటున్నాను అంటూ కోపంగా మాట్లాడుతాడు రామచంద్ర. మామయ్య గారు అత్తయ్య గారి కోరిక నెరవేర్చండి అని చెప్పి జానకి చేతుల్లో పెన్ను పెట్టి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు రామచంద్ర. మరొకవైపు అఖిల్ అటాక్ చేసిన అమ్మాయి చికిత్స తీసుకుంటూ ఉంటుంది. అప్పుడు డాక్టర్ కండిషన్ ఏం బాగోలేదు ఊపిరి ఉన్నా కూడా కదల్లేని పరిస్థితి అని చెప్పడంతో ఆ అమ్మాయి తల్లిదండ్రులు బోరున విలపిస్తూ ఉంటారు.
మరొకవైపు అఖిల్ భోజనం చేస్తుండగా జెస్సీ ప్రేమగా వడ్డిస్తుంది. అప్పుడు జెస్సి అఖిల్ అత్తయ్య గారు అంతా మంచే జరగాలని పూజ చేయించారు నువ్వు జాయిన్ అయిన కోర్స్ ని తొందరగా పూర్తి చేసి జాబ్లో జాయిన్ అవ్వు అని మంచి మాటలు చెబుతూ ఉంటుంది. ఇప్పుడు అఖిల్ తినేటప్పుడు పడుకునేటప్పుడు దీని నీతి వాక్యాలతో నాకు నచ్చెక్కిపోతుంది అనుకుంటూ ఉంటాడు. మరొకవైపు రామచంద్ర జానకి గురించి వెతుకుతూ ఉంటాడు. ఒకవైపు జానకి బయట ఆకాశదీపం పెడుతుండగా ఇంతలో అక్కడికి రామచంద్ర వస్తాడు. నేను గుడిలో అడిగిన విషయం గురించి ఏమీ చెప్పలేదు జానకి గారు నేను ఏమనుకోవాలి అనడంతో మీ వైపు నుంచి నాకు క్లారిటీ రాలేదు రామగారు అని అంటుంది జానకి.
అప్పుడు జానకి ఇప్పుడు జరిగిన పరిస్థితి నేను ఐఏఎస్ ఆఫీసర్ అయిన తర్వాత జరిగితే అప్పుడు మీ మాట వినాలా లేకపోతే నేను చేయాల్సిన డ్యూటీ చేయాలా అని అడగడంతో రామచంద్ర మౌనంగా ఆలోచిస్తూ ఉంటాడు. అప్పుడు కూడా నేను మీరు చెప్పినట్టుగా మాట వింటే రోజు స్వార్థంతో పోలీసు డ్యూటీకి అన్యాయం చేయాల్సి వస్తుంది అని అంటుంది. అప్పుడు జానకి పూజ చేసి రామచంద్ర కు బొట్టు పెట్టి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది.