- Home
- Entertainment
- ఆమె చూపుల్లో ఏ మత్తుమందు ఉందో..ఆ అందాలతో ఊరిస్తూ మైకంలో ముంచేస్తున్న డింపుల్ హయతి..
ఆమె చూపుల్లో ఏ మత్తుమందు ఉందో..ఆ అందాలతో ఊరిస్తూ మైకంలో ముంచేస్తున్న డింపుల్ హయతి..
హీరోయిన్ గా డింపుల్ హయతికి ఇంకా హిట్ పడలేదు. యువతని పిచ్చెక్కించే అందం ఉన్నప్పటికీ తొలి విజయం కోసం డింపుల్ ఎదురుచూస్తోంది. రామబాణంతో తన తొలి విజయం సొంతం అవుతుందని డింపుల్ భావిస్తోంది.

యాక్షన్ హీరో గోపీచంద్ నటించిన లేటెస్ట్ మూవీ రామబాణం. ఫ్యామిలీ అండ్ యాక్షన్ ఎంటర్టైనర్ గా తెరకెక్కిన ఈ చిత్రం మే 5న గ్రాండ్ రిలీజ్ కి రెడీ అవుతోంది. లౌక్యం, లక్ష్యం ఫేమ్ శ్రీవాస్ ఈ చిత్రానికి దర్శకుడు. సూపర్ హిట్ కాంబినేషన్ లో వస్తున్న చిత్రం కావడంతో మంచి అంచనాలు ఉన్నాయి.ఈ చిత్రంలో గోపీచంద్ సరసన డస్కీ బ్యూటీ డింపుల్ హయతి నటిస్తున్న సంగతి తెలిసిందే.
గద్దల కొండ గణేష్ చిత్రంలో ఐటెం సాంగ్ తో డింపుల్ హయతి ఎంట్రీ ఇచ్చిన సంగతి తెలిసిందే. ఐటెం సాంగ్ చేసినంత మాత్రాన ఆమెపై ఐటెం బ్యూటీ అనే ముద్ర పడలేదు. కుర్రాళ్లు మెచ్చేలా హాట్ హాట్ అందాలతో ఉండడంతో దర్శకులని ఆకర్షించింది.
డింపుల్ హయతి చివరగా మాస్ మహారాజ్ రవితేజ ఖిలాడీ చిత్రంలో నటించింది. ఈ మూవీలో డింపుల్ హయతి రెచ్చిపోయి అందాలు ఆరబోసింది. డస్కీ బ్యూటీగా కుర్ర హృదయాల్లో రచ్చ చేసింది. కానీ ఖిలాడీ చిత్రం బాక్సాఫీస్ వద్ద దారుణంగా డిజాస్టర్ కావడంతో అమ్మడి గ్లామర్ షోకి ప్రతిఫలం లేకుండా పోయింది.
డింపుల్ హయతి అవసరమైన మేరకు అందాల ఆరబోతకు రెడీగా ఉంటుంది. ఖిలాడీ చిత్రంలో కూడా డింపుల్ గ్లామర్ గా కనిపించబోతోంది. ఇక సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే డింపుల్ తరచుగా తన గ్లామరస్ పిక్స్ ని షేర్ చేస్తూ ఉంటుంది.
ఇటీవల డింపుల్ హయతి గ్లామర్ రచ్చ సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారుతోంది. డింపుల్ హయతి ప్రస్తుతం టాలీవుడ్ లో కుర్రాళ్లకు కొత్త కలల రాణిగా మారిపోతోంది.
తాజాగా డింపుల్ హయతి తన అందంతో యువతని మెస్మరైజ్ చేసింది. రామబాణం ప్రచార కార్యక్రమాలతో బిజీగా ఉన్న డింపుల్ హయతి డిఫెరెంట్ అవుట్ ఫిట్స్ లో కళ్ళు చెదిరే ఫోజులు ఇస్తోంది.
కలర్ ఫుల్ గా ఉన్న లాంగ్ డ్రెస్ లో డింపుల్ హయతి తన డస్కీ అందాలతో విజువల్ ట్రీట్ ఇస్తోంది. చిరునవ్వులు చిందిస్తూ.. కొంచెం కొంచెం ఎద పరువాలతో యువతని ఉడికిస్తూ ఇచ్చిన ఫోజులు అద్భుతంగా ఉన్నాయి.
లాంగ్ డ్రెస్ లో డింపుల్ అప్పుడే విరిసిన తామరలా ఆకర్షిస్తూ ఫోజులు ఇస్తోంది. డింపుల్ సొగసుకి నెటిజన్లు మైమరచిపోతున్నారు. సైనైడ్ లుక్స్ తో కుర్రలని కోలుకోని షాక్ కి గురిచేస్తోంది అంటూ కామెంట్స్ చేస్తున్నారు.
ఇటీవల ఈ చిత్రం ట్రైలర్ లాంచ్ చేశారు. ట్రైలర్ కి మంచి రెస్పాన్స్ వచ్చింది. ఈ మూవీలో డింపుల్ హయతి భైరవి పాత్రలో నటిస్తోంది.
హీరోయిన్ గా డింపుల్ హయతికి ఇంకా హిట్ పడలేదు. యువతని పిచ్చెక్కించే అందం ఉన్నప్పటికీ తొలి విజయం కోసం డింపుల్ ఎదురుచూస్తోంది. రామబాణంతో తన తొలి విజయం సొంతం అవుతుందని డింపుల్ భావిస్తోంది.