రామ్ 'రెడ్' మూవీ రివ్యూ

First Published Jan 14, 2021, 2:03 PM IST

లైటర్ వీన్ కామెడీలు, లవ్ స్టోరీలు చేయటంలో రామ్ పండిపోయాడు. మొన్న వచ్చిన ఇస్మార్ట్ శంకర్ తో మాస్ హీరోగానూ ప్రూవ్ అయ్యాడు. అయితే అతని కెరీర్ లో క్రైమ్ థ్రిల్లర్ జోనర్ మాత్రం  చేసింది లేదు. ఆ ముచ్చట కూడా  ‘రెడ్‌’ తో తీరినట్లే. అంతేకాదు తమిళ హిట్ చిత్రం తడమ్ కు తెలుగు రీమేక్‌గా వచ్చిన ఈ సినిమాలో  తొలిసారి ద్విపాత్రాభినయం కూడా చేసాడు. అలాగే తన కెరీర్ లో బెస్ట్ అనుకున్న హిట్ ఇచ్చిన  ‘నేను శైలజ’ డైరక్టర్ కిషోర్ తిరుమల తో ఈ సినిమా చేసాడు. ఇన్ని స్పెషాలిటీలు ఉన్న సినిమా పై అంచనాలు అదే స్దాయిలో ఉంటాయని టీమ్ కు తెలుసు. ఆ ఎక్సపెక్టేషన్స్ ని  ఈ సినిమా ఏ మేరకు అందుకుంది. తమిళ రీమేక్ కు తెలుగులో ఎలాంటి మార్పులు చేసారు. ఇస్మార్ట్ శంకర్ తర్వాత వచ్చిన ఈ సినిమా ఎలాంటి ఫలితం అందుకోబోతోంది వంటి విషయాలు రివ్యూలో చూద్దాం.

కథేంటి:: ఒకే పోలికలతో ఉన్న కవలలు సిద్దార్ద, ఆదిత్య (రెండు పాత్రలూ రామ్ పోషించారు). వీళ్లిద్దరికీ ఓ బాధాకరమైన గతం ఉంది. పేరుకి కవలలే  అయినా వీరిద్దరూ వ్యక్తిగత పరంగా, లైఫ్ స్టైల్స్ పరంగా, పూర్తి విభిన్నమైన వ్యక్తులు. వీళ్లలో ఒకరు ఓ గౌరవనీయమైన ఇంజినీరు గా సెటిల్  అయితే మరొకరు ఈజీ మనీకు దొంగతనాలకు అలవాటు పడ్డ రోగ్. ఎవరి జీవితం వాళ్లు తమ స్దాయిలో గడుపుతూండగా..సిద్దార్ద ఓ వ్యక్తిని  హత్య చేసిన కేసులో ఇరుక్కుంటాడు.ఒక సెల్ఫీ ద్వారా.. సిద్ధార్థ్ ను పోలీస్ లు పట్టుకుని అరెస్ట్ చేస్తారు. అయితే ఆ హత్య చేయటానికి కారణం  ఏమిటన్నది అంతు పట్టదు. దాంతో పోలీస్ అధికారులు యామిని( నివేదిత పేతురాజ్), నాగేంద్ర( సంపత్ రాజ్) ఇద్దరూ కలిసి ఇన్విస్టిగేట్  చేస్తూంటారు. నాగేంద్రకు సిద్దార్థ మీద వ్యక్తిగత కక్ష ఉంటుంది. దాంతో అతను దీన్ని పర్సనల్ గా తీసుకుంటాడు.

ఈ లోగా ఊహించని విధంగా సీన్ లోకి ఆదిత్య వస్తాడు. డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులో అదే పోలీస్ స్టేషన్ కు వచ్చజి ఆదిత్య ఈ కథని మలుపు  తిప్పుతాడు. దాంతో పోలీస్ లే కన్ఫూజన్ లో పడతారు. చూస్తే ఇద్దరూ ఒకే పోలికలతో ఉన్నారు. ఎవరు అసలైన హంతకుడు..ఈ హత్యకు  కొంతకాలం క్రితం మిస్సైన సిద్దార్ద లవ్ లైఫ్ కు, అతని గర్ల్ ఫ్రెండ్ మహిమ (మాళవిక శర్మ)కు సంభందం ఏమిటి..ఎందుకని ఆదిత్య తనంతట  తానే సీన్ లోకి వచ్చాడు. అసలా హత్యకావింపబడ్డ వ్యక్తి ఎవరు... ఈ మర్డర్ ఎవరు చేసారు. వంటి ప్రశ్నలన్నిటికీ సమాధానం తెలియాలంటే  పజిల్ లాంటి ఈ సినిమా సెకండాఫ్ ని చూడాల్సిందే.

విశ్లేషణ:: సినిమాలో రెండు పాత్రలకు, మర్డర్ కు లింక్ ఉంటుంది. ఆ మర్డర్ ఎవరు చేసేరనేదే ఈ సినిమాకు ప్లాట్. దాని చుట్టూనే కథ నడుస్తుంది.  అయితే తమిళంలో అరుణ్ విజయ్ ఆ రెండు పాత్రలను అలవోకగా చేసుకుంటూ వెళ్లారు. తెలుగులో రామ్ సైతం దాన్ని అందుకునే ప్రయత్నం  చేసారు. కానీ తమిళంలో అరుణ్ విజయ్ కు ఉన్న ఇమేజ్ తో కథను కథలాగ చూడటం జరిగింది. ఇక్కడ హీరో ఇమేజ్ గల రామ్ తో ..లోతుగా  కథలోకి వెళ్లకుండా హీరో చుట్టూనే ఆలోచనలు ఆగిపోయాయి.

వాస్తవానికి ఒరిజనల్ తమిళ సినిమాకు స్క్రీన్ ప్లే ప్రాణం. ముఖ్యంగా ఆ సినిమాలో హీరో రెండు పాత్రలకు డిఫరెంట్ తెలపటానికి వేర్వేరు  కలర్స్ తో లైటింగ్ వాడారు. సాఫ్ట్ క్యారక్టర్ కు బ్లూ టోన్ ,రఫ్ క్యారక్టర్ కు ఎల్లో టోన్ యూజ్ చేసారు. జాగ్రత్తగా పరిశీలిస్తే ఏ క్యారక్టర్ కు ఏ  కలర్ యూజ్ చేసారనేది..సినిమాలో కీ పాయింట్ ఎవరు మర్డర్ చేసారో తెలిసిపోతుంది. ఎందుకంటే ఆ మర్డర్ చేసిన వ్యక్తి తాలుకూ లైటింగ్  పాట్రన్ కంటిన్యూ అవుతుంది. అంతలా డిటేలింగ్ చేసారు. అలాంటివి ఇక్కడా తెలుగులో అనుసరించారు కానీ అవేమీ అంత ఎఫెక్టివ్ గా లేవు.

మరో విషయం ఈ సినిమాలో మెయిన్ ప్లాట్ మర్డర్ ఎవరు చేసారు..అనేది తమిళ టైటిల్ డిజైన్ లో నే ఓ లాజిక్ ని ఇంక్లూడ్ చేసారు. అవన్నీ  ఇక్కడ కట్ అండ్ పేస్ట్ చేయలేదు కానీ తమదైన శైలిలో ఆబ్జెక్ట్స్ మార్చారు. అయితే ఆ స్దాయి ఇంపాక్ట్ కలిగించి అలోచనలో పడేలా  చేయలేకపోయారు. ఫస్టాఫ్ చాలా గ్రిప్పింగ్ గా ఉంటుంది. రెండో భాగంలో కూడా ప్రధానమైన సన్నివేశాలు మంచి ఫ్లో లో కొనసాగుతాయి  అనుకుంటాం అయితే అక్కడే డల్ అయ్యింది. ఇంక ప్రొసీడింగ్స్ అయితే సాగుతున్న ఫీలింగ్ తీసుకొచ్చాయి.

దానికి తోడు ఇద్దరూ లీడ్ క్యారెక్టర్ ల ఫ్లాష్ బ్యాక్ చెప్పటం విసిగించింది. అక్కడే చాలా స్లోగా అయ్యింది. ఒక థ్రిల్లర్ ప్లాష్ బ్యాక్ సీన్స్ ఎంత  ఫాస్ట్ గా ఉంటే అంత మంచిది. అయితే వారిద్దరి భిన్న స్వభావాలను ప్రేక్షకులకు అర్థం అయ్యేలా చెప్పడం కోసం దర్శకుడు చాలా ఎక్కువగా  వారి గతాన్ని సాగదీసి మనని విసిగించే పోగ్రాం పెట్టుకున్నాడు. ఒక్కోసారి ప్రేక్షకులను తక్కువ అంచనా వేసే డైరక్టర్ ఛాధస్తం ఇబ్బందిగా  మారుతుంది.

రైటింగ్ విషయంలో కిషోర్ తిరుమల తమిళ వెర్షన్ ని తెలుగుకు తేవటంలో విఫలమయ్యారనే చెప్పాలి. సెకండాఫ్ పూర్తిగా  అదుపు తప్పి.. డ్రామా మిస్ ఫైరైంది. దానికి తోడు నేటివిటి కోసం చేసిన మార్పులు థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ ని ఏరిపారేసాయి. ఇవన్ని ఒకెత్తు  అయితే పండని కామెడీ సినిమాని మరింత విసుగుకి దగ్గర చేసింది. రామ్ వంటి ఎనర్జీ హీరో కూడా కొన్ని సీన్స్ లో ఏమీ చేయలేని పరిస్దితి  వచ్చింది. ఇంట్రవెల్,ప్రీ ఇంటర్వెల్ సీన్స్ తప్పిస్తే ఈ సినిమాలో చెప్పుకోదగ్గ థ్రిల్లింగ్ గా లేదు.ప్రీ క్లైమాక్స్ ట్విస్ట్ ఉన్నంతలో బాగుంది.

రామ్ ఎలా చేసారంటే :: తొలిసారి రామ్ ఈ సినిమాలో డ్యూయిల్ రోల్ ప్లే చేసారు. మేకోవర్ బాగుంది,స్టైలింగ్ స్టైల్ గానే ఉంది. కానీ అంతకు మించి ఏముంది  చెప్పుకోవటానికి. రెండు పాత్రల్లో విబిన్నత ఏమి కనపడలేదు. ఇస్మార్ట్ శంకర్ కు మరో వెర్షన్ లా ఆదిత్య పాత్ర నడుస్తుంది. ఇక సిద్దార్ద పాత్ర  ఎన్నో సినిమాల్లో చూసిన రామ్ క్యారక్టరైజేషనే. ఇంకేముంది ఇందులో కొత్తదనం. కాబట్టి రామ్ కు ఇది చెప్పుకోదగ్గ డ్యూయిల్ రోల్ మాత్రం  కాదు.

ఇక హీరోయిన్ మాళవిక విషయానికి వస్తే..ఆమె డల్ గా కనిపించింది. ఎందుకు చేస్తున్నాంరా బాబు ఈ సినిమా అన్నట్లుగా ఉంది ఆ పాత్ర.  దాంతో ఆమెతో చేసిన రొమాంటిక్ సీన్స్ కూడా అదే స్దాయిలో ఉన్నాయి. నివేదిత పేతురాజ్ నిపోలీస్ అధికారిగా చూడటం కష్టమే అనిపించింది.  కథలో ఉండే ఇంటెన్సిటీ మొత్తం ఆమె ఇన్విస్టిగేషన్ లో పోయింది. పవిత్ర లోకేష్ పాత్ర అయితే ఇదేంటిరా ఇలాంటి క్యారక్టర్ ఇచ్చారనిపిస్తుంది.  ఇక వెన్నెల కిషోర్, పోసాని, సత్య వంటి వాళ్లూ ఏమీ చేయలేక చేతులెత్తేసారు.

టెక్నికల్ గా :: మణిశర్మ మరోసారి తన బీజీఎం తో సీన్స్ ని ఆడుకున్నారు. అయితే ఇస్మార్ట్ శంకర్ స్దాయి మాత్రం కాదు. సమీర్ రెడ్డి కెమెరా వర్క్ హై  స్టాండర్డ్ లో ఉంది. పీటర్ హైన్స్ ఫైట్స్ బాగున్నాయి. జునైద్ సిద్ధికి ఎడిటింగ్ జస్ట్ ఓకే. స్రవంతి ప్రొడక్షన్ వ్యాల్యూస్ ఎప్పటిలాగే బాగున్నాయి.  డైలాగులు కొన్ని చోట్ల బాగా పేలాయి. అయితే అన్ని బాగున్నా అసలైన స్క్రిప్టు దెబ్బకొట్టింది.

హైలెట్స్::  ‘డించక్ డించక్’ అంటూ అదరగొట్టే స్టెప్స్ వేసిన రామ్, హెబ్బాపటేల్ ఒరిజనల్ లో ఉన్న కొన్ని ట్విస్ట్ లు రామ్ స్క్రీన్ ప్రెజెన్స్ ఇంట్రవెల్ మైనస్ లు:: డల్ గా ఉన్న స్క్రిప్టు, స్క్రీన్ ప్లే ఇంట్రస్ట్ కలిగించని ట్విస్ట్ లు

ఫైనల్ థాట్:: రెడ్..బ్యాడ్ రైటింగ్ కలిగిన బ్యాడ్ రీమేక్  --సూర్య ప్రకాష్ జోశ్యుల Rating:2

ఎవరెవరు... :: సంస్థ‌: శ్రీ స్ర‌వంతి మూవీస్‌, న‌టీన‌టులు: రామ్‌, నివేదా పేతురాజ్‌, మాళవికా శర్మ, అమృతా అయ్యర్‌, నాజ‌ర్ తదితరులు సంగీతం: మణిశర్మ, ఛాయాగ్రహణం: సమీర్‌ రెడ్డి, ఆర్ట్: ఎ.ఎస్‌.ప్రకాష్‌, ఫైట్స్: పీటర్‌ హెయిన్స్, ఎడిటింగ్‌: జునైద్‌, సమర్పణ: కృష్ణ పోతినేని, నిర్మాత: ‘స్రవంతి’ రవికిశోర్‌, దర్శకత్వం: కిశోర్‌ తిరుమల.

Today's Poll

మీరు ఎంత మందితో ఆన్ లైన్ గేమ్స్ ఆడడానికి ఇష్టపడుతారు?