- Home
- Entertainment
- వాళ్లిద్దరూ చేసింది నచ్చక షూటింగ్ నుంచి వెళ్లిపోయిన జూ.ఎన్టీఆర్, భరించలేని అవమానం.. నాగ్ కూడా హ్యాండిచ్చారు
వాళ్లిద్దరూ చేసింది నచ్చక షూటింగ్ నుంచి వెళ్లిపోయిన జూ.ఎన్టీఆర్, భరించలేని అవమానం.. నాగ్ కూడా హ్యాండిచ్చారు
యంగ్ టైగర్ ఎన్టీఆర్ నటించిన కంత్రి మూవీ షూటింగ్ సమయంలో ఇద్దరు సోదరులకు అవమానం జరిగింది. ఎన్టీఆర్ షూటింగ్ లొకేషన్ నుంచే వెళ్లిపోయారట. ఇంతకీ ఏంటా సంఘటన, ఆ ఇద్దరు సోదరులు ఎవరు అనేది ఈ కథనంలో తెలుసుకుందాం.

రామ్ లక్ష్మణ్ మాస్టర్స్ జర్నీ
యంగ్ టైగర్ ఎన్టీఆర్ నటించిన ఎన్నో హిట్ చిత్రాల్లో నటించారు. కొన్ని ఫ్లాప్ చిత్రాలు కూడా ఉన్నాయి. జూనియర్ ఎన్టీఆర్ మూవీ సెట్ లో తమకి అవమానం జరిగింది అని ఇద్దరు క్రేజీ ఫైట్ మాస్టర్లు ఓ ఇంటర్వ్యూలో ఓపెన్ గా చెప్పారు. కానీ ఆ అవమానాలు, కష్టాలు అధికమించడం వల్లే తాము ఇప్పుడు ఈ స్థాయిలో ఉన్నామని ఆ ఫైట్ మాస్టర్స్ తెలిపారు. టాలీవుడ్ లో చాలా కాలంగా రాణిస్తున్న ఆ ఫైట్ మాస్టర్స్ ఇద్దరూ రామ్, లక్ష్మణ్ లు.
టాలీవుడ్ లో అదరగొడుతున్న కవల సోదరులు
ఈ ఇద్దరు కవల సోదరులు మాస్ యాక్షన్ ఫైట్స్ కి పెట్టింది పేరు. రామ్ లక్ష్మణ్ మాస్టర్స్ స్టంట్ కొరియోగ్రఫీ చేస్తున్నారంటే ఆ సినిమాతో మాస్ ఆడియన్స్ కి ఫీస్ట్ గ్యారెంటీ అని చెప్పొచ్చు. రామ్ లక్ష్మణ్ మాస్టర్స్ బావగారు బాగున్నారా మూవీ టైం నుంచి ఇండస్ట్రీలో ఉన్నారు. తమకి కెరీర్ లో ఎదురైన అవమానాల గురించి రామ్ లక్ష్మణ్ ఓ ఇంటర్వ్యూలో మాట్లాడారు.
షూటింగ్ నుంచి వెళ్లిపోయిన జూ. ఎన్టీఆర్
యంగ్ టైగర్ ఎన్టీఆర్ నటించిన కంత్రి చిత్రంలో ఒక చిన్న సీక్వెన్స్ కి ఫైట్ కొరియోగ్రఫీ చేసే అవకాశం వచ్చింది. సినిమా మొత్తం మరో ఫైట్ మాస్టర్ చేస్తున్నారు. ఆ చిన్న సీక్వెన్స్ కి మాత్రమే మమ్మల్ని తీసుకున్నారు. కానీ మేము చేసింది తారక్ బాబుకి నచ్చలేదు. వెంటనే షూటింగ్ నుంచి వెళ్ళిపోయాడు అని రామ్ లక్ష్మణ్ మాస్టర్స్ అన్నారు. ఆ క్షణం జరిగిన అవమాననానికి కళ్ళలో నీళ్లు వచ్చాయి అని రామ్ లక్ష్మణ్ మాస్టర్స్ ఎమోషనల్ అయ్యారు. మెహర్ రమేష్ దర్శకత్వంలో వచ్చిన కంత్రి చిత్రం ఫ్లాప్ అయింది.
నాగార్జున సినిమాలో ఛాన్స్
డైరెక్టర్ విఎన్ ఆదిత్య, నాగార్జున కాంబినేషన్ లో నేనున్నాను, బాస్ లాంటి చిత్రాలు వచ్చాయి. అయితే రామ్ లక్ష్మణ్ మాస్టర్ సినిమా పేరు చెప్పలేదు కానీ.. వీరి కాంబోలో వచ్చిన ఒక చిత్రానికి తామే యాక్షన్ కొరియోగ్రాఫర్స్ గా ఎంపిక అయ్యాం అని తెలిపారు. మా వర్కింగ్ స్టైల్ వేరుగా ఉంటుంది.
గొప్ప మనసు చాటుకున్న నాగార్జున
రోప్స్ ఎక్కువగా వాడాలని చెప్పాం. దీనితో నాగార్జున గారు ఇబ్బంది పడతారని మమ్మల్ని ఆ మూవీ నుంచి తొలగించారు. కానీ నాగార్జున మాత్రం గొప్ప మనసు చాటుకున్నారు. మమ్మల్ని ఆల్రెడీ ఎంపిక చేశారు కాబట్టి ఫుల్ పేమెంట్ ఇచ్చి పంపించినట్లు రామ్ లక్ష్మణ్ మాస్టర్స్ తెలిపారు.