ఇక పొలిటికల్ చిత్రాలు ఆపేస్తా, మాటమీద నిలబడతా.. రాంగోపాల్ వర్మ
ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ లో పొలిటికల్ హీట్ రోజురోజుకి పెరుగుతోంది. ఇందులో తాను కూడా భాగం అయ్యేలా వివాదాస్పద దర్శకుడు రాంగోపాల్ వర్మ 'వ్యూహం' చిత్రాన్ని రెడీ చేస్తున్నారు.
ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ లో పొలిటికల్ హీట్ రోజురోజుకి పెరుగుతోంది. ఇందులో తాను కూడా భాగం అయ్యేలా వివాదాస్పద దర్శకుడు రాంగోపాల్ వర్మ 'వ్యూహం' చిత్రాన్ని రెడీ చేస్తున్నారు. ఏపీ సీఎం వైఎస్ జగన్ పొలిటికల్ జర్నీ ఆధారంగా వర్మ ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నట్లు తెలుస్తోంది. పొలిటికల్ చిత్రాలకి వివాదాలు జోడించి ఆసక్తి పెంచడంలో వర్మ స్టయిలే వేరు.
వ్యూహం చిత్రాన్ని ఆర్జీవీ రెండు భాగాలుగా తెరెరకేక్కిస్తున్నారు. మొదటి భాగం నవంబర్ 10న రిలీజ్ కి రెడీ అవుతోంది. దీనితో నేడు వ్యూహం మొదటి భాగం ట్రైలర్ ని రిలీజ్ చేశారు. ఊహించిన విధంగానే వర్మ వైయస్ జగన్ ని హైలైట్ చేస్తూ, వైఎస్ఆర్సీపీ కి అనుకూలంగా ఈ చిత్రాన్ని తెరకెక్కించినట్లు ట్రైలర్ ద్వారా అర్థం అవుతోంది.
పవన్ కళ్యాణ్, చంద్రబాబులని టార్గెట్ చేస్తూ వర్మ తనదైన శైలిలో సెటైరికల్ గా వారి పాత్రలని చిత్రీకరించారు. మరి చిత్రంలో ఇంకెత వివాదాస్పద అంశాలు ఉన్నాయో చూడాలి. అయితే ట్రైలర్ లాంచ్ సందర్భంగా వర్మ చేసిన వ్యాఖ్యలు ఆసక్తికరంగా ఉన్నాయి.
వర్మ ఇటీవల తెరకెక్కించిన చిత్రాలు గమనిస్తే.. వంగవీటి, లక్ష్మీస్ ఎన్టీఆర్, అమ్మరాజ్యంలో కడప బిడ్డలు, పవర్ స్టార్, ఇప్పుడు తెరకెక్కిస్తున్న వ్యహం చిత్రాలతో సహా అన్ని పొలిటికల్ కాంట్రవర్సీ చిత్రమే.
లేకుంటే అడల్ట్ కంటెంట్ తో సినిమాలు చేయడం చూస్తున్నాం. దీనితో శివ లాంటి కల్ట్ మూవీ తెరకెక్కించిన వర్మ ఇప్పుడు ఇలా మారారు ఏంటి అంటూ సినీ అభిమానుల్లో విమర్శలు చెలరేగుతున్నాయి.
ఈ విమర్శకు వర్మ వ్యూహం ట్రైలర్ లాంచ్ లో బదులిచ్చారు. వ్యూహం చిత్రమే తన చివరి పొలిటికల్ మూవీ అని వర్మ తెలిపారు. మీ మాట మీద మీరే నిలబడిన సందర్భాలు లేవు కదా అని ప్రశ్నించగా.. ఈ సారి ఖచ్చితంగా చెబుతున్నాను. ఇకపై పొలిటికల్ చిత్రాలు చేయను అని అన్నారు.