- Home
- Entertainment
- నాగార్జునతో సినిమా కోసం 1000 అబద్ధాలు ఆడిన రామ్ గోపాల్ వర్మ, ఏఎన్నార్ ను ఎలా మాయ చేశాడంటే?
నాగార్జునతో సినిమా కోసం 1000 అబద్ధాలు ఆడిన రామ్ గోపాల్ వర్మ, ఏఎన్నార్ ను ఎలా మాయ చేశాడంటే?
శివ సినిమా కోసం పెద్ద సాహసమే చేశాడు వివాదాల దర్శకుడు రామ్ గోపాల్ వర్మ. నాగార్జునతో మూవీ చేజారిపోకుండా కొన్ని కుట్రలు కూడా చేశాడట. ఏఎన్నార్ ను ఒప్పించడానికి వర్మ వాడిన కిటుక్కులు ఏంటో తెలుసా?

టాలీవుడ్ లో హిస్టరీ క్రియేట్ చేసిన సినిమా
టాలీవుడ్ చరిత్రలో సరికొత్త రికార్డును క్రియేట్ చేసిన సినిమా ‘శివ’. 1989లో విడుదలైన ఈ సినిమా రామ్ గోపాల్ వర్మను దర్శకుడిగా పరిచయం చేయడమే కాకుండా, హీరో నాగార్జున కెరీర్ కు బ్రేక్ ఇచ్చింది. ఆయన సినిమా జీవితాన్ని ఈ సినిమా మలుపు తిప్పింది. 36 ఏళ్లు అవుతున్నాా.. శివ సినిమా క్రేజ్ ఇప్పటికీ ఏమాత్రం తగ్గలేదు. ఈ క్రమంలో ఈ కల్ట్ క్లాసిక్ సినిమాను రీ రిలీజ్ చేయబోతున్నారు. నవంబర్ 14న ఈ మూవీ ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ కు రెడీ అవుతోంది. ఈ క్రమంలో సంచలనాల దర్శకుడు రామ్ గోపాల్ వర్మ.. ఈసినిమా విశేషాలను ఓ ఇంటర్వ్యూలో వెల్లడించారు.
సమస్యలను ఎదిరించిన ఆర్జీవి
శివ సినిమా కంప్లీట్ చేయడంలో ఎన్నో సవాళ్లను ఫేస్ చేశారు వర్మ. ఈ సినిమా వల్ల వచ్చిన అనుభవాలు ఎప్పటికీ మర్చిపోలేనివి అన్నారు వర్మ. ఆర్జీవి మాట్లాడుతూ, “చాలామంది జీవితంలో ఎదిగాక, తమ కెరీర్ మొదట్లో ఎదురైన అవమానాలను గుర్తుచేసుకుంటూ ఉంటారు. కానీ అది కరెక్ట్ కాదు.. అప్పటికి మనం ఏ స్థాయిలో లేమో, మనల్ని గుర్తించకపోవడం వాళ్ల తప్పు కాదు. మనం ఆ స్థాయికి చేరుకోకపోవడమే మన తప్పు అని నేను నమ్ముతాను. శివ సినిమా సెట్స్ ఎక్కించే క్రమంలో ఎన్నో ఆటంకాలు ఎదురయ్యాయి. ప్రతి దశలో ఏదో ఒక సమస్య వెంటాడేది.. ఆ సవాళ్లు దాటుకుంటూ సినిమాను కంప్లీట్ చేశాను '' అని రామ్ గోపాల్ వర్మ అన్నారు.
నాగేశ్వరావు ను మాయ చేసిన రామ్ గోపాల్ వర్మ
వర్మ మాట్లాడుతూ.. "శివ సినిమా చేజారకుండా చాలా జాగ్రత్త పడ్డాను. నాగార్జున ఈ సినిమా చేయడానికి ఓప్పుకున్నప్పటికీ.. ఆయన తండ్రి నాగేశ్వరరావు గారు గ్రీన్ సిగ్నల్ ఇవ్వకపోవచ్చని అనిపించింది. అలాగే నిర్మాతగా వెంకట్ గారిని కూడా ఒప్పించాల్సిన అవసరం కూడా వచ్చింది. దాంతో ఈ ముగ్గురికీ దగ్గరవడం, నాపై నమ్మకం పెంచుకోవడం చాలా అవసరమైంది. వారిని అర్థం చేసుకోవడం, నా ఆలోచనలపై విశ్వాసం కలిగించుకోవడం కోసం చాలా ప్రయత్నాలు చేశాను. అదే సమయంలో, వారి వైపు నుంచి వేరే ప్రాజెక్టులు మధ్యలో అడ్డుపడకుండా చూసుకోడానికి చాలా మాయ చేయాల్సి వచ్చింది ” అని వర్మ అన్నారు.
శివ సినిమా కోసం వర్మ 1000 అబద్దాలు
ఆర్జీవి మాట్లాడుతూ.. “‘శివ’ సినిమా షూటింగ్ స్టార్ట్ అయ్యే వరకూ.. ఎన్నో అడ్డంకులు ఎదురయ్యాయి. ఆ ప్రాజెక్ట్ కోసం నేను 1000 అబద్ధాలు ఆడవలసి వచ్చింది. కొన్నిసార్లు కొంత కుట్రలు కూడా చేయాల్సి వచ్చింది. కానీ చివరికి ఆ కష్టం ఫలించింది. శివ సినిమా విడుదలైన తర్వాత అందరి దృష్టిలో నేను దర్శకుడిగా నిలబడ్డాను. ఈ సినిమా కేవలం యాక్షన్ మూవీ మాత్రమే కాదు, ఆ కాలంలో యువతలో ఉన్న కోపం, తిరుగుబాటు మనస్తత్వాన్ని ఈసినిమాలో చూపించాను. అందుకే శివ మూవీ ఇప్పటికీ ప్రజల మనసుల్లో నిలిచిపోయింది,” అని రామ్ గోపాల్ వర్మ అన్నారు.