MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Forecast
Today's Rasi Phalalu
Women's Asia Cup 2026
Smriti Mandhana
Sahaa Movie Review
Bigg Boss Telugu
Chiranjeevi's Mother
Romanchakam Movie Review
Allari Naresh
Tollywood Cinema
Hardik Pandya
Team India T20 Squad
Irumudi 12 Days Collections
Hello Brother Movie Review
Andhra Pradesh Startup Hub
Horror Movies Streaming on OTT
Ishtakameshwari Temple
  • Home
  • Entertainment
  • రామ్‌ గోపాల్‌ వర్మ ఎప్పుడు ఏడ్చాడో తెలుసా? ఆ టైమ్‌లో కన్నీళ్లు ఆగలేదట.. ఆర్జీవీలో ఎవరూ చూడని యాంగిల్‌

రామ్‌ గోపాల్‌ వర్మ ఎప్పుడు ఏడ్చాడో తెలుసా? ఆ టైమ్‌లో కన్నీళ్లు ఆగలేదట.. ఆర్జీవీలో ఎవరూ చూడని యాంగిల్‌

సంచలన దర్శకుడు రామ్‌గోపాల్‌ వర్మ అన్నిరకాల ఎమోషన్స్ కి దూరంగా ఉంటాడు. కానీ ఆయన ఓ సందర్భంలో కన్నీళ్లు పెట్టుకున్నాడట. తాజాగా ఆ విషయాన్ని బయటపెట్టాడు.  

2 Min read
Author : Aithagoni Raju
| Updated : Feb 24 2024, 09:55 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16

రామ్‌గోపాల్‌ వర్మ ప్రారంభంలో సంచలన దర్శకుడు. ఇప్పుడు వివాదాస్పద దర్శకుడిగా మారుతున్నారు. ఆయన సోషల్‌ మీడియాలో పెట్టే పోస్ట్ లు, చేసే కామెంట్లు, తీసే సినిమాల పరంగా ఆయన కాంట్రావర్సియల్‌ పర్సన్‌గా మారుతున్నారు. బోల్డ్ కామెంట్లతో తరచూ వార్తల్లో నిలుస్తుంటారు వర్మ. తన సినిమాలను ప్రమోట్‌ చేసుకునే విషయంలో ఆయన వివాదాస్పద పోస్ట్ లు, సెటైర్లతో రచ్చ చేస్తుంటాడు. అందరి అటెన్షన్‌ తనవైపు తిప్పుకుంటాడు. 
 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
26

రామ్‌గోపాల్‌ వర్మ ఎమోషన్స్ కి దూరంగా ఉంటారు. నవ్వు, ఏడుపు, బాధ, ఆనందం వంటి వాటికి పెద్దగా ప్రయారిటీ ఇవ్వరు. రిలేషన్స్ కూడా ప్రయారిటీ ఇవ్వరు. తనకు నచ్చినట్టు ఉంటాడు, నచ్చినట్టు బతికేస్తాడు. ఏడుపు అనే ఎమోషన్‌ ఆయనలో ఉందా అనే డౌట్‌ వచ్చేలా ఉంటాడు. ఆయన్ని ఎమోషనల్‌గా ప్రభావితం చాలా కష్టం. అస్సలు సాధ్యం కూడా కాదట. అలాంటిది రామ్‌గోపాల్‌ వర్మ ఒక విషయంలో మాత్రం కన్నీళ్లు పెట్టుకున్నాడు. తెలియకుండానే ఏడ్చేశాడట. అసలు ఎందుకు ఏడుస్తున్నాడో అర్థం కాలేదట. మరి అంతగా ప్రభావితం చేసిన అంశమేంటి అనేది చూస్తే..
 

36

ఇటీవల జర్నలిస్ట్ ప్రేమకి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈ విషయాన్ని పంచుకున్నాడు రామ్‌గోపాల్‌ వర్మ. తాను ఎప్పుడూ ఎమోషన్‌ కానని చెప్పిన వర్మ, ఏదో టైమ్‌లో సడెన్‌గా అలా అనిపించినా, ఐదు నిమిషాల్లోనే వాస్తవంలోకి వస్తానని తెలిపారు. కానీ ఒక విషయంలో మాత్రం తను కంట్రోల్‌ కాలేకపోయాడట. ఆ విషయం చెబుతూ, ప్రముఖ అమెరికన్‌-రష్యా రచయిత్రి అయన్‌ ర్యాండ్‌ డాక్యుమెంటరీ `ఏ సెన్స్ ఆఫ్‌ లైఫ్‌` చూసినప్పుడు మాత్రం కన్నీళ్లు పెట్టుకున్నాడు. ఆ డాక్యుమెంటరీ చివరికి వచ్చేటప్పుడు తాను తెలియకుండానే ఏడ్చేస్తున్నాడట. కళ్ల నుంచి నీళ్లు కారిపోతున్నాయట. ఆ సమయంలో ఆ డాక్యుమెంటరీలో ఎలాంటి విషాదం చోటు చేసుకోలేదు, అక్కడ ఏం జరగడం లేదు. 
 

46

ఆమె బతికి తీరు, సర్వైవ్‌ అయిన తీరుకి ఆయన కన్నీళ్లు పెట్టుకున్నాడట. అది తనకు బాగా నచ్చిందని, ఆ సమయంలో మనసు తెలియకుండానే రియాక్ట్ అయ్యిందని, అలా కన్నీళ్లు పెట్టుకున్నట్టు తెలిపాడు వర్మ. కొన్ని సంఘటనలు మనల్ని అతిగా రియాక్ట్ అయ్యేలా చేస్తుంటాయని, అలాంటి ఘటనే అది అని చెప్పాడు వర్మ. 
 

56

అయన్‌ ర్యాండ్‌ అమెరికన్‌ ఫిలాసఫర్‌, రైటర్స్. అనేక విప్లవాత్మక నవలలు రాశారు. 1950-70 మధ్యలో అమెరికన్‌ సమాజాని తన రచనలతో, నవలలో తీవ్రంగా ప్రభావితం చేశారు. ఎన్నో ఆటుపోట్లు ఎదుర్కొన్నారు. ఆమె నవలలు సినిమాలుగా వచ్చాయి. సంచలనాలు క్రియేట్‌ చేశాయి. ఆమె లైఫ్‌, ఆమె కెరీర్‌ ఇన్‌స్పైరింగ్‌గా నిలిచింది. ఎంతో అణచివేతని ఎదుర్కొని ఆమె మనుగడ సాధించడం మామూలు విషయం కాదు. 
 

66

ఇక రామ్‌ గోపాల్‌ వర్మ ప్రస్తుతం `వ్యూహం` అనే సినిమాని తెరకెక్కించాడు. ఇది ఈ నెల 23న విడుదల కావాల్సి ఉంది. కానీ దీన్ని వాయిదా వేశారు. మార్చి 1న విడుదల చేస్తున్నారు. దీనికి కొనసాగింపుగా తీసిన `శపథం` మార్చి 8న విడుదల చేయబోతున్నారట. వైఎస్‌ రాజశేఖర్‌ రెడ్డి మరణం అనంతరం ఏపీ రాజకీయాల్లో చోటు చేసుకున్న పరిణామాల నేపథ్యంలో వైఎస్‌ జగన్‌ పాయింట్‌ ఆఫ్‌ వ్యూలో ఈ మూవీని తెరకెక్కించాడు వర్మ. 
 

About the Author

AR
Aithagoni Raju
అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.

Latest Videos
Recommended Stories
Recommended image1
Bigg Boss 10 Krishnudu: హీరో కాబోయి వినాయకుడు అయ్యాడు.. యాక్సిడెంట్‌ లైఫ్‌ రివర్స్.. కృష్ణుడు ఎమోషనల్‌ జర్నీ
Recommended image2
Bigg Boss Telugu 10: అవమానించిన బిందు మాధవి చేతుల మీదగానే ఎంట్రీ ఇచ్చిన రోహిత్ శెట్టి..!
Recommended image3
Temper Vamsi: చిరంజీవిపై ఇష్టంతో ఫిల్మ్‌ నగర్‌ కష్టాలు.. బిగ్‌ బాస్‌ హౌజ్‌లో మరో కోణం చూపిస్తానంటున్న టెంపర్‌ వంశీ
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved