MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
Toxic Movie First Review
IMD Weather Update
Today Rasi Phalalu
Irumudi Movie 4 Days Collections
Megastar Chiranjeevi
Dhruv Jurel
OTT Releases
Devdutt Padikkal
Dakshina Kailasam Temple
Bigg Boss Agnipariksha
  • Home
  • Entertainment
  • ఆ విషయంలో చిరు-చరణ్ మధ్య అభిప్రాయ బేధాలు... తండ్రిదో మాట కొడుకుదో మాట!

ఆ విషయంలో చిరు-చరణ్ మధ్య అభిప్రాయ బేధాలు... తండ్రిదో మాట కొడుకుదో మాట!

స్టార్ హీరోల వారసులు తాతలు, తండ్రుల సినిమాలు, పాటలు...  రీమేక్, రీమిక్స్ చేయడం సాధారణమే. చిరంజీవి కొడుకు రామ్ చరణ్ కి కూడా తన తండ్రి నటించిన ఓ మూవీ రీమేక్ చేయాలని ఆశగా ఉందట. కానీ చిరంజీవి కోరిక మాత్రం మరొక చిత్రం చేయాలని ఆశపడుతున్నాడు... ఆ కథేమిటో చూద్దాం.

2 Min read
Author : Sambi Reddy
| Updated : Jul 10 2024, 07:33 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
17
Chiranjeevi

Chiranjeevi


కేవలం స్టార్ హీరో కొడుకు అయినంత మాత్రాన స్టార్ అయిపోతాము అనుకుంటే పొరపాటే. దానికి టాలెంట్ తో పాటు కృషి, పట్టుదల, క్రమశిక్షణ ఉండాలి. పరిశ్రమలో చాలా మంది స్టార్ కిడ్స్ అడుగుపెట్టారు. సక్సెస్ అయ్యింది కొందరే. అయితే ప్రస్తుతం టాలీవుడ్ లో ఉన్న టాప్ స్టార్స్ అందరూ నెపో కిడ్స్ కావడం కొసమెరుపు. వారిలో రామ్ చరణ్ ఒకడు. 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
27

నటన, డాన్సులలో శిక్షణ తీసుకున్న రామ్ చరణ్... 2007లో సిల్వర్ స్క్రీన్ కి పరిచయం అయ్యాడు. ఆయన డెబ్యూ మూవీ చిరుత. స్టార్ డైరెక్టర్ పూరి జగన్నాధ్ చిరుత చిత్రాన్ని తెరకెక్కించాడు. ఫస్ట్ మూవీతోనే రామ్ చరణ్ ఆకట్టుకున్నారు. డాన్సులు, మాస్ మేనరిజమ్స్ తో ప్రేక్షకుల మనసులు దోచాడు. 
 

37


రామ్ చరణ్ రెండో చిత్రం మగధీర ఇండస్ట్రీ హిట్. దర్శకుడు రాజమౌళి తెరకెక్కించిన మగధీర రామ్ చరణ్ కి స్టార్డం తెచ్చిపెట్టింది. టాలీవుడ్ ఆల్ టైం టాప్ గ్రాసర్ గా నిలిచింది. రంగస్థలం మూవీలో రామ్ చరణ్ నటనకు ప్రేక్షకులు ఫిదా అయ్యారు. విమర్శించిన వాళ్ళ నోళ్లకు తాళం వేశాడు. 

47
Chiranjeevi

Chiranjeevi


కాగా చరణ్ అంటే చిరంజీవి చాలా ఇష్టం. కొడుకు కెరీర్ లో ఎదిగేలా చేయడానికి తన వంతు కృషి చేస్తూ ఉంటాడు. కథలు, దర్శకుల ఎంపికలో చిరంజీవి పాత్ర ఖచ్చితంగా ఉంటుంది. తండ్రికి తగ్గ తనయుడు అనిపించుకున్న రామ్ చరణ్ ఆర్ ఆర్ ఆర్ మూవీతో గ్లోబల్ స్టార్ అయ్యాడు. అనేక అంతర్జాతీయ గౌరవాలు అందుకున్నాడు. 

57
Chiranjeevi

Chiranjeevi

గతంలో రామ్ చరణ్-చిరంజీవిలను మెగా డాటర్ నిహారిక ఇంటర్వ్యూ చేసింది. ర్యాపిడ్ ఫైర్ రౌండ్ లో ఓ ఆసక్తికర పరిణామం చోటు చేసుకుంది. రామ్ చరణ్ ని నిహారిక... డాడీ(చిరంజీవి) నటించిన చిత్రాల్లో ఏ మూవీ రీమేక్ చేయాలని అనుకుంటున్నావు? అని అడిగింది. రామ్ చరణ్ టక్కున గ్యాంగ్ లీడర్ అని చెప్పాడు

67
Chiranjeevi

Chiranjeevi

పక్కనే ఉన్న చిరంజీవి మాత్రం జగదేకవీరుడు అతిలోకసుందరి మూవీ చేస్తే చూడాలని ఉందని అన్నాడు. ఎవరు హీరోయిన్ అని నిహారిక అడిగింది? శ్రీదేవి కూతురు జాన్వీ అయితే బాగుంటుందని చిరంజీవి అన్నాడు. పక్కనే ఉన్న వివి వినాయక్, చరణ్, నిహారిక గట్టిగా నవ్వారు. ఆయన ఆన్సర్ ని ఎంజాయ్ చేశారు.

77
Chiranjeevi

Chiranjeevi

చిరంజీవి కెరీర్లో జగదేకవీరుడు అతిలోక సుందరి, గ్యాంగ్ లీడర్ రెండూ అతిపెద్ద బ్లాక్ బస్టర్స్. రామ్ చరణ్ కి గ్యాంగ్ లీడర్ చేయాలని ఉండగా... చిరంజీవి మాత్రం జగదేకవీరుడు అతిలోకసుందరి చిత్రం రీమేక్ చేయాలని ఆశపడ్డారు. మరి భవిష్యత్ లో ఒకటైనా కార్యరూపం దాల్చుతుందో లేదో చూడాలి.. 
 

About the Author

SR
Sambi Reddy
పది సంవత్సరాలకు పైగా జర్నలిజంలో ఉన్నారు. పొలిటికల్, ఎంటర్టైన్మెంట్ విభాగాల్లో పలు ప్రముఖ సంస్థల్లో పని చేసిన అనుభవం ఉంది. గత మూడేళ్లుగా ఏషియా నెట్ తెలుగు ఎంటర్టైన్మెంట్ విభాగంలో సబ్ ఎడిటర్ గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు.

Latest Videos
Recommended Stories
Recommended image1
Irumudi Record: 105 ఏళ్ల రికార్డ్ బ్రేక్, బాహుబలి, RRR, పుష్ప వల్ల కూడా కాలేదు.. చరిత్ర సృష్టించిన రవితేజ సినిమా
Recommended image2
Srikanth: స్టార్ హీరో ఆఫర్లన్నీ కొట్టేసిన శ్రీకాంత్.. మాస్ హీరో కామ్‌గా ఉండటానికి కారణమేంటో తెలుసా?
Recommended image3
ANR: పెళ్లై పిల్లలున్న హీరోయిన్‌తో ఏఎన్నార్ ఆన్ స్క్రీన్ రొమాన్స్... 275 రోజులు ఆడి రికార్డు సృష్టించిన సినిమా ఏదో తెలుసా?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved