రామ్ చరణ్ మైండ్ లో ఇంత రన్ అవుతుందా.. అయినా ఎక్కడ బయటపడని చెర్రీ!
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ - దర్శకుడు శంకర్ కాంబినేషన్ లో వస్తున్న పాన్ ఇండియా ఫిల్మ్ ‘ఆర్సీ15’. ఈ చిత్రంతో పాటు.. మరిన్నీ అంశాలతో రామ్ చరణ్ కాస్తా డిప్రెషన్ గురైనట్టు టాక్ వినిపిస్తోంది. అయినా బయటకి మాత్రం చాలా కూల్ గా కనిపిస్తూ ఫ్యాన్స్ ను ఖుషీ చేస్తున్నారు.

‘ఆర్ఆర్ఆర్’ (RRR) తర్వాత మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ (Ram Charan)క్రేజ్ ఇండియా వ్యాప్తంగా పెరిగిపోయింది. దక్షిణాదిన అత్యంత డిమాండ్ ఉన్న నటుల్లో ఒకరిగా రామ్ చరణ్ చేరిపోయారు. దీంతో తదుపరి రూపుదిద్దుకుంటున్న చిత్రాలను భారీ స్థాయిలోనే ఉండబోతున్నాయి.
ప్రస్తుతం చరణ్ తమిళ దర్శకుడు శంకర్ (Shankar) డైరెక్షన్ లో నటిస్తున్నారు. ‘ఆర్సీ15’ వర్క్ టైటిల్ తో రూపుదిద్దుకుంటోంది. ఇప్పటికే పలు షెడ్యూళ్లను పూర్తి చేసుకున్న ఈ చిత్రం తాజా షెడ్యూల్ ను కూడా ప్రారంభించినట్టు తెలుస్తోంది. న్యూజీలాండ్ లో షూటింగ్ కొనసాగనుండగా.. ఇప్పటికే టీమ్ అక్కడికి చేరుకుంది.
శంకర్ దర్శకత్వంలో రామ్ చరణ్ నటిస్తుండటంతో సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. సినిమాకు తగట్టుగానే రామ్ చరణ్ లుక్స్ కూడా పూర్తిగా మార్చేశారు. మరోవైపు యాక్షన్ సన్నివేశాలను నెక్ట్స్ లెవల్లో చిత్రీకరించేందుకు శంకర్ శ్రమిస్తున్నారు. అయితే చరణ్ కూడా తన శక్తిమించి సినిమా కోసం పనిచేస్తున్నారు. తాజా షెడ్యూల్ కోసం చరణ్ సంసిద్ధం అవుతున్నారు. ముఖ్యంగా నెక్ట్స్ షెడ్యూల్ లో యాక్షన్ సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారని తెలుస్తోంది. ఇందుకోసం చరణ్ డైలీ వర్కౌట్స్ పై మరింత ఫోకస్ పెట్టారు.
హెవీ వెయిట్స్ లిఫ్ట్ చేస్తూ శరీరాన్ని ఉక్కులా మారుస్తున్నారు. ఇందుకు సంబంధించిన ఓ వీడియోను కూడా చెర్రీ అభిమానులతో పంచుకున్నారు. డైలీ రామ్ చరణ్ చేసే జిమ్ వర్కౌట్స్ ను న్యూజిలాండ్ నూ కొనసాగిస్తున్నారు. షూటింగ్ లోకేషన్లలో సరైన ఎక్విప్ మెంట్ లేకున్నా.. అక్కడి జిమ్ పరికరాలతోనే వ్యాయమం చేస్తున్నారు. వర్కౌట్స్ కు మాత్రం ఏమాత్రం బ్రేక్ రాకుండా చూసుకుంటున్నారు.
ఇదిలా ఉంటే.. చరణ్ ఆర్సీ15’తో డిప్రెషన్ లోకి వెళ్లినట్టు టాక్ వినిపిస్తోంది. ఎప్పుడో షూటింగ్ ప్రారంభం అయినా.. ఇంకా కొనసాగుతూనే ఉంది. దర్శకుడు శంకర్ మధ్యలో ‘ఇండియన్ 2’ను తెరకెక్కిస్తుండటంతో.. ‘ఆర్సీ15’ ఇంకా ఆలస్యం అవుతోంది. ఎలాంటి అప్డేట్స్ రాకపోవడంతో అభిమానులు అసహనం వ్యక్తం చేస్తున్నారు. ఈ టెన్షన్ ఒకవైపు ఉండగా.. దర్శకుడు గౌతమ్ తిన్ననూరి ప్రాజెక్ట్ ను క్యాన్సిల్ చేసిన చరణ్ తనముందున్న భారీ ప్రాజెక్టులను తేల్చులేకపోతున్నాడు. ఇప్పటికే కొరటాల శివ, ప్రశాంత్ నీల్ తోనూ ప్రాజెక్టులు ఉన్నట్టు తెలుస్తోంది. మరోవైపు ‘ఆచార్య’ రిజల్ట్.. శంకర్ కూడా ‘ఇండియన్ 2’పైనే ఎక్కువ ఫోకస్ పెట్టడంతో కాస్తా అప్సెట్ అయినట్టు తెలుస్తోంది. ఇక పర్సనల్ లైఫ్ లోనూ కొన్ని సమస్యలు ఎదుర్కొంటుడం మరో అంశం. ఇక వీటన్నింటి గురించి ఆలోచిస్తూ చరణ్ కాస్తా డిప్రెషన్ కు లోనవుతున్నారనీ అంటున్నారు. అందుకే ఈ మధ్య వేకేషన్స్ కు వెళ్తూ రిలీఫ్ పొందుతున్నారంట. కానీ ఎక్కడ మాత్రం చెర్రీ బయటపడకుండా.. చాలా కూల్ గా కనిపిస్తున్నారు.
ఇక చరణ్ మాత్రం ఇవేవీ బయటికి కనిపించకుండా హుషారుగానే కనిపిస్తున్నారు. ఆలస్యం అవుతున్నా.. చాలా ఓపిగ్గా ఉంటున్నారు. ‘ఆర్సీ15’ పట్ల ఇంట్రెస్ట్ క్రియేట్ చేసేలా పలు పోస్టులు కూడా పెడుతున్నారు. తాజా షెడ్యూల్ కోసం ఆయన వర్కౌట్ సెషన్ వీడియోను పంచుకున్నారు. ఇంతలా సినిమా కోసం చరణ్ కష్టపడుతున్న తీరుకు అభిమానులతో పాటు నెటిజన్లు కూడా హర్షిస్తున్నారు. త్వరలో ఈ చిత్రం నుంచి అప్డేట్ ఇవ్వాలని కోరుతున్నారు.
రామ్ చరణ్ - కియారా అద్వానీ హీరోహీరోయిన్లుగా నటిస్తున్నారు. శంకర్ ఈ చిత్రాన్ని ప్రత్యేక శ్రద్ధతో తెరకెక్కిస్తున్నారు. స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజు భారీ బడ్జెట్ తో రూపొందిస్తున్నారు. ఇప్పటికే పలు షెడ్యూళ్లను పూర్తి చేసుకున్న ఈ చిత్రం.. త్వరలోనే షూటింగ్ పార్టును పూర్తి చేసుకోనుంది. చిత్రంలో హీరోయిన్ అంజలి, ఎస్ జే సూర్య, నవీన్ చంద్ర, సముద్రఖని, జయరామ్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఎస్ థమన్ సంగీతం అందిస్తున్నారు.