MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • పెరుగుతోన్న పెద్ది నెంబర్లు.. రామ్ చరణ్ మూవీ ఓటీటీ డీల్ ఎన్ని కోట్లంటే?

పెరుగుతోన్న పెద్ది నెంబర్లు.. రామ్ చరణ్ మూవీ ఓటీటీ డీల్ ఎన్ని కోట్లంటే?

Ram Charan Peddi:రామ్ చరణ్ హీరోగా బుచ్చిబాబు సానా దర్శకత్వంలో వస్తున్న స్పోర్ట్స్ డ్రామా ‘పెద్ది’ పై భారీ అంచనాలు నెలకొన్నాయి. రూ.300 కోట్లకు పైగా బడ్జెట్‌తో తెరకెక్కుతున్న ఈ చిత్రం ఓటీటీ, ఆడియో, థియేట్రికల్ రైట్స్ ద్వారా రికార్డు బిజినెస్ చేస్తోంది.

2 Min read
Author : Rajesh K
Published : Sep 12 2025, 01:34 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16
పెద్ది పై భారీ అంచనాలు!
Image Credit : Asianet News

పెద్ది పై భారీ అంచనాలు!

గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ హీరోగా, ‘ఉప్పెన’ ఫేమ్ బుచ్చిబాబు సానా దర్శకత్వంలో తెరకెక్కనున్న పాన్ ఇండియా మూవీ ‘పెద్ది’(Peddi). స్పోర్ట్స్ డ్రామాగా వస్తున్న ఈ మూవీని వృద్ధి సినిమాస్ నిర్మిస్తోంది. ‘గేమ్ ఛేంజర్’ తర్వాత రామ్ చరణ్ చేస్తున్న ఈ సినిమా ఇప్పటికే టాలీవుడ్‌లోనే కాకుండా దేశవ్యాప్తంగా భారీ హైప్ క్రియేట్ చేసింది.

ఇప్పటికే విడుదలైన గ్లింప్స్‌కి భారీ రెస్పాన్స్ వచ్చింది. ముఖ్యంగా రామ్ చరణ్ ఆడిన క్రికెట్ షాట్ ట్రెండ్ గా మారింది. ఇలా కొత్త అప్డేట్ ఈ మూవీపై మరింత హైప్ అండ్ క్రేజ్ పెంచుతున్నాయి.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
26
₹300 కోట్లకు పైగా బడ్జెట్!
Image Credit : instagram /buchi babu sana

₹300 కోట్లకు పైగా బడ్జెట్!

‘పెద్ది’ సినిమా బడ్జెట్ దాదాపు రూ.300 కోట్లకు పైగానే ఉన్నట్లు సమాచారం. ఇందులో రామ్ చరణ్ రెమ్యూనరేషన్ మాత్రమే సుమారు 100 కోట్లుగా వినిపిస్తోంది. 

ఇక మేకింగ్ కాస్ట్ 200 కోట్లను దాటిందని తెలిసింది. ఇప్పటికే సగం షూటింగ్ పూర్తి అయిందనీ, ఇంకా సగం షూటింగ్ షెడ్యూల్ మిగిలి ఉందట ఫీల్మి వర్గాల టాక్. 

భారీ ఖర్చుతో తెరకెక్కుతున్న ఈ సినిమాపై నిర్మాతలు భారీ అంచనాలు పెట్టుకున్నారు. పాన్ ఇండియా లెవల్ లో రికార్డులు క్రియేట్ చేయాలని పెద్ద పెద్ద ప్లాన్స్ వేస్తున్నరట పెద్ది మూవీ మేకర్స్.

36
పెద్ది కథ ఇదేనా ?
Image Credit : Instagram / buchi babu sana

పెద్ది కథ ఇదేనా ?

గ్రామీణ ఆధారిత క్రికెట్ టోర్నమెంట్ నేపథ్యంలో నడిచే స్పోర్ట్స్ యాక్షన్ డ్రామా అయిన పెద్దిలో రామ్ చరణ్, జాన్వి కపూర్ లు లీడ్ లో నటిస్తుండగా,  శివ రాజ్ కుమార్, దివ్యేందు, జగపతి బాబు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. 

ఇటీవల రామ్ చరణ్ స్వయంగా పెద్ది గురించి ఒక అప్‌డేట్‌ను పంచుకున్నాడు, AR రెహమాన్‌ను కలిసిన ఫోటోను పోస్ట్ చేశాడు. మొదటి సింగిల్ త్వరలో వస్తుందని టీజ్ చేశాడు. మరో అప్‌డేట్‌లో సినిమా సినిమాటోగ్రాఫర్ రత్నవేలు దాదాపు 50% షూటింగ్ పూర్తయిందని వెల్లడించారు.

46
థియేట్రికల్ బిజినెస్ పై అంచనాలు
Image Credit : stockphoto

థియేట్రికల్ బిజినెస్ పై అంచనాలు

రామ్ చరణ్ స్పోర్ట్స్ డ్రామా పెద్ది థియేట్రికల్ బిజినెస్ విషయానికి వస్తే... కేవలం తెలుగు రాష్ట్రాల్లోనే రూ.120 కోట్లకు పైగా డిస్ట్రిబ్యూషన్ బిజినెస్ జరగనట్టు టాక్. రెస్టాఫ్ ఇండియా, ఓవర్సీస్ కలిపి మరో 100 కోట్లకు పైగా బిజినెస్ అయ్యే అవకాశాలు ఉన్నయట. రామ్ చరణ్ క్రేజ్ అలాంటిది మరి. మొత్తానికి థియేట్రికల్ రైట్స్ ద్వారా రూ.220–250 కోట్ల మధ్య బిజినెస్ జరిగే అవకాశాలున్నాయి.

56
రికార్డు స్థాయిలో డిజిటల్ రైట్స్
Image Credit : youtube

రికార్డు స్థాయిలో డిజిటల్ రైట్స్

స్పోర్ట్స్ యాక్షన్ డ్రామా గా తెరకెక్కుతోన్న ఈ సినిమాలో రామ్ చరణ్, జాన్వీ కపూర్ జంటగా నటిస్తున్నారు. వీరి కాంబినేషన్ ప్రకటించగానే సినిమాపై మరింత హైప్ క్రియేట్ అయింది. ఇప్పటికే విడుదలైన గ్లింప్స్, పోస్టర్ లుక్ కే అంచనాలు తారా స్థాయికి చేరుకున్నాయి. తాజాగా ఈ స్పోర్ట్స్ యాక్షన్ డ్రామాకి భారీ ఓటీటీ డీల్ సెట్ అయినట్టు తెలుస్తోంది. టాలీవుడ్ టాక్ ప్రకారం.. పెద్ది నిర్మాతలు తమ సినిమా డిజిటల్ హక్కులను రూ.130 కోట్లకు ప్రముఖ ఓటీటీ సంస్థ నెట్ ఫ్లిక్స్ కు అమ్మినట్లు తెలుస్తోంది. అలాగే, పెద్ది ఆడియో రైట్స్ ను ‘టీ సిరీస్’రూ.20 కోట్లకు సొంతం చేసుకుందని ట్రేడ్ వర్గాలు టాక్. 

66
రిలీజ్ డేట్ కన్ఫర్మ్
Image Credit : our own

రిలీజ్ డేట్ కన్ఫర్మ్

ప్రస్తుతం షూటింగ్ శరవేగంగా కొనసాగుతోంది. ఇప్పటికే సగం షూటింగ్ పూర్తయిందట. మిగిలిన షెడ్యూల్స్ పూర్తి చేయడానికి యూనిట్ స్పీడ్‌ పెంచింది. రామ్ చరణ్ పుట్టినరోజు సందర్భంగా వచ్చే ఏడాది మార్చి 27న సినిమాను గ్రాండ్‌గా విడుదల చేయనున్నట్లు అధికారికంగా ప్రకటించారు. మొత్తానికి, ‘పెద్ది’ సినిమా ప్రీ రిలీజ్ బిజినెస్ 350 కోట్ల మార్క్‌ని టార్గెట్ చేస్తూ, విడుదలకు ముందే ఇండస్ట్రీలో భారీ హైప్ క్రియేట్ చేసింది. 

About the Author

RK
Rajesh K
రాజేశ్ కారంపూరి: ఆరు సంవత్సరాలుగా ప్రముఖ ప్రింట్, డిజిటల్, వెబ్ మీడియా సంస్థల్లో సబ్ ఎడిటర్ గా రాణించారు. ప్రధానంగా పొలిటికల్ తో పాటు ఎడ్యుకేషన్, సినిమా, స్పోర్ట్స్ విభాగాల్లో పని చేసిన అనుభవం ఉంది. ప్రస్తుతం ఏసియానెట్‌ తెలుగులో ఫ్రీలాన్సర్ గా పని చేస్తున్నారు.
రామ్ చరణ్ కొణిదెల
వినోదం
ఏషియానెట్ న్యూస్
తెలుగు సినిమా
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Nidhhi Agerwal: తెలుగు అబ్బాయిలంటేనే ఇష్టం, పెళ్లి కూడా చేసుకుంటా, నిధి అగర్వాల్ కామెంట్స్ వైరల్
Recommended image2
Ranabaali Sensor Review: ఒక్క కట్ కూడా లేదు.. విజయ్ దేవరకొండ సినిమాపై షాకింగ్ కామెంట్స్, రణబాలి సెన్సార్ రివ్యూ
Recommended image3
Pawan Kalyan: పవన్ కళ్యాణ్ పాడిన 10 పాటలు.. సింగర్‌గా అదరగొట్టిన పవర్ స్టార్!
Related Stories
Recommended image1
Ram Charan: 'చిరుత' తర్వాత చిరు అనుకున్న ప్రాజెక్టు వేరు, కానీ
Recommended image2
రామ్ చరణ్ పెద్ది కోసం ఏకంగా విజయనగరం సెట్, ఎన్ని కోట్లు ఖర్చు పెడుతున్నారంటే?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved