రాజమౌళి, అలియాభట్‌, ఆర్‌ఆర్‌ఆర్‌ టీమ్‌కి రామ్‌చరణ్‌ సవాల్‌..

First Published 8, Nov 2020, 10:48 AM

`మొక్కలు నాటడం మన ప్రాథమిక కర్తవ్యం. ప్రకృతి సమతూల్యంతో ఉంటేనే మనందరం ఈ భూమ్మీద మనగలుగుతాం. లేదంటే అనేక విపత్తులు ఎదుర్కోవల్సి వస్తుంది` అని అంటున్నారు హీరో రామ్‌చరణ్‌.

రామ్‌చరణ్‌ ఆదివారం `హరాహైతోభరాహై` గ్రీన్‌ ఇండియా ఛాలెంజ్‌లో ఎంపీ సంతోష్‌ జోగినపల్లితో కలిసి పాల్గొన్నారు. ప్రభాస్‌ విసిరిన ఛాలెంజ్‌ని స్వీకరించి జూబ్లీహిల్స్ లోని తన నివాసంలో మూడు మొక్కలు నాటారు.

ఈ సందర్భంగా రామ్‌చరణ్‌ మాట్లాడుతూ, నాకు మొక్కలు నాటే అవకాశం రావడం చాలా సంతోషంగా ఉంది. మొక్కలు నాటడం ప్రాథమిక కర్తవ్యం. ప్రకృతి సమతూల్యంతోనే మనందరం మనుగడ సాధించగలం. లేదంటే విపత్తులతో ఇబ్బందులు పడాల్సి వస్తుందన్నారు.

ఇంకా చెబుతూ, ప్రకృతి రహస్యాలను గ్రహించి తన వంతు బాధ్యతగా కొన్ని లక్షల మందిని తన `గ్రీన్‌ ఇండియా ఛాలెంజ్‌` ద్వారా కదిలిస్తున్న జోగినిపల్లి సంతోష్‌ గారిని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను. ఈ కార్యక్రమం నిరంతరం కొనసాగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నార`ని చెప్పారు.

ఈ సందర్భంగా ప్రముఖ బాలీవుడ్ హీరోయిన్ అలియాభట్‌, దర్శకుడు రాజమౌళి, తాను నటించే `ఆర్ఆర్‌ఆర్‌` చిత్ర బృందానికి గ్రీన్‌ ఇండియా ఛాలెంజ్‌ విసిరారు. ఈ ఛాలెంజ్ స్వీకరించి

మొక్కలు నాటాలని కోరారు.

అంతేకాదు మెగా ఫ్యామిలీ అభిమానులంతా ఈ గ్రీన్ ఇండియా ఛాలెంజ్‌ లో పాల్గొనాలని విజ్ఞప్తి చేశారు. దీన్ని మరింత ముందుకు తీసుకెళ్లాలని కోరారు. ప్రస్తుతం రామ్‌చరణ్‌ `ఆర్‌ఆర్‌ఆర్‌`లో ఎన్టీఆర్‌తో కలిసి నటిస్తుండగా, రాజమౌళి దర్శకత్వం వహిస్తున్నారు. ఇందులో చెర్రీ సరసన బాలీవుడ్‌ నటి అలియాభట్‌ నటిస్తుంది.