- Home
- Entertainment
- 400 మిలియన్ రికార్డ్ సాధించిన రామ్ చరణ్ డిజాస్టర్ మూవీ, అక్కడ చరణ్ క్రేజ్ మామూలుగా లేదుగా?
400 మిలియన్ రికార్డ్ సాధించిన రామ్ చరణ్ డిజాస్టర్ మూవీ, అక్కడ చరణ్ క్రేజ్ మామూలుగా లేదుగా?
గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ క్రేజ్ అంతా ఇంతా కాదు. సినిమా హిట్ అయినా కాకపోయినా చరణ్ క్రేజ్ ఏమాత్రం తగ్గదు. ఈ విషయం చాలా సార్లు నిరూపణ అయ్యింది. తాజాగా మరోసారి ఇది ఫ్యూ అయ్యింది. రామ్ చరణ్ అంటే ఆడియన్స్ లో ఉన్న క్రేజ్ అది కూడా నార్త్ ఆడియన్స్ మెగా పవన్ స్టార్ ను ఎంత ప్రేమిస్తున్నారో తెలిసిపోయింది. ఇంతకీ విషయం ఏంటంటే?
- FB
- TW
- Linkdin
Follow Us
)
Ram Charan
ఆర్ఆర్ఆర్ తో రామ్ చరణ్ ఇమేజ్ ఎక్కడికో వెళ్లిపోయింది. ఆయన కనిపిస్తే చాలు అనుకునే అభిమానులు దేశ వ్యాప్తంగా ఉన్నారు. ఆర్ఆర్ఆర్ తరువాత ఆచార్య సినిమా ప్లాప్ అయ్యింది. తాజాగా గేమ్ ఛేంజర్ కూడా డిజాస్టర్ అయ్యింది. అయినా సరే మెగా హీరో ఇమేజ్ కాస్త కూడా చెక్కు చెదరలేదు. చరణ్ పై ప్రేమను అప్పటిలాగానే చూపిస్తున్నారు. మరీ ముఖ్యంగా తెలుగు రాష్ట్రాలతో పాటు నార్త్ లో చరణ్ కు భారీగా ఫ్యాన్ ఫాలోయింగ్ పెరిగింది. రామ్ చరణ్ మూవీ ఏదైనా వస్తే.. వదలకుండా చూస్తున్నారు.
ఇక నార్త్ ఆడియన్స్ వల్ల రామ్ చరణ్ డిజాస్టర్ మూవీ కూడా ఓ రికార్డ్ ను సాధించింది. ఇంతకీ ఏంటా మూవీ అంటే.. రీసెంట్ గా రిలీజ్ అయిన గేమ్ ఛేంజర్. ఈసినిమా కోసం రామ్ చరణ్ మూడేళ్ళు కష్టపడ్డాడు. శంకర్ ఫామ్ లో లేడు అని తెలిసినా.. ఆయన మీద గౌరవంతో ఈసినిమా చేశాడు చరణ్. అయితే ఫ్యాన్స్ భయపడ్డట్టుగానే గేమ్ ఛేంజర్ డిజాస్టర్ అయ్యింది. అయితే హిందీలో గేమ్ ఛేంజర్ థియేటర్లలో పెద్దగా ఆడలేదు కాని డిజిటల్ మీడియాలో మాత్రం సత్తా చాటింది గేమ్ ఛేంజర్. హిందీ ఆడియన్స్ ఈ సినిమాకు బ్రహ్మరథం పట్టారు.
హిందీ వెర్షన్ ఓటీటీ రైట్స్ ని నిర్మాత దిల్ రాజు జీ ఛానల్ కి అమ్మాడు. మార్చి 7 న ఈసినిమా జీ5’ యాప్ లో రిలీజ్ అవ్వగా.. స్ట్రీమింగ్ అవ్వడం మొదలు పెట్టిన రోజు నుంచి గేమ్ ఛేంజర్ ట్రెండింగ్ లోనే ఉంది. అప్పటి నుంచి ఇప్పటి వరకూ దాదాపు ఆరు వారాలుగా టాప్ లోనే ట్రెండ్ అవుతూ ఉంది. సూపర్ హిట్ అయిన సినిమాలకు కూడా ఇది సాధ్యం కాదు. అంతలా గేమ్ ఛేంజర్ ను ఆదరించారు నార్త్ లోని ఫ్యామిలీ ఆడియన్స్. ఈ సినిమాకు జీ లో 400 మిలియన్ వరకూ వాచ్ మినిట్స్ వచ్చాయి. ఇది ఆల్ టైమ్ రికార్డ్ అని చెప్పాలి.
Ram Charans Game Changer
అంతే కాదు ఈసినిమా సంక్రాంతికి రిలీజ్ అవ్వగా.. ఆటైమ్ లో రిలీజ్ అయిన సంక్రాంతికి వస్తున్నాం సినిమా కూడా జీ లోనే స్క్రీమింగ్ అయ్యింది. అయితే ఐదు భాషల్లో ఈసినిమా సాధించిన రికార్డ్ ను గేమ్ ఛేంజర్ హిందీలోనే సాధించింది గేమ్ ఛేంజర్. ఇలా రామ్ చరణ్ సినిమా డిజాస్టర్ అయినా.. రికార్డ్ మాత్రం సాధించింది. ఇక ప్రస్తుతం రామ్ చరణ్ బుచ్చిబాబు డైరెక్షన్ లో ‘పెద్ది’ సినిమా చేస్తున్నాడు. ఈ సినిమాతో సాలిడ్ హిట్ కొట్టాలని చూస్తున్నాడు చరణ్.
peddi, ram charan
ఇక పెద్ది సినిమా తరువాత సుకుమార్ డైరెక్షన్ లో భారీ బడ్జెట్ పాన్ ఇండియా సినిమాను ప్లాన్ చేస్తున్నాడు రామ్ చరణ్. ఇక పెద్ద హడావిడి ఏడాది ముందు నుంచే స్టార్ట్ అయ్యింది. ఈమూవీ నుంచి రీసెంట్ గా టైటిల్ పోస్టర్ తో పాటు, ఫస్ట్ గ్లింప్ ను కూడా రిలీజ్ చేశారు. ఇక మూవీని వచ్చే ఏడాది మార్చి 27 న ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ చేయబోతున్నారు. ఇక ఈమూవీలో హీరోయిన్ గా జాన్వీ కపూర్ నటిస్తుండగా.. ఆస్కార్ విన్నర్ AR రెహమాన్ సంగీతం అందిస్తున్నాడు.