తెరపైకి మరో బ్లాక్ బస్టర్ సీక్వెల్.. రెడీ అవుతున్న రామ్ చరణ్, డైరెక్టర్ ఎవరంటే..?
ఈ మధ్య సీక్వెల్ సినిమాల సందడి పెరిగిపోయింది. చిన్నా పెద్దా సినిమాలన్నీ సీక్వెల్స్ కు వెళ్ళిపోతున్నాయి. ఇప్పుడు రిలీజ్ అవుతున్న సినిమాలు వెంటనే సీక్వెల్స్ ను అనౌన్స్ చేస్తుంటే... ఆ మధ్య వచ్చిన సూపర్ హిట్ మూవీస్ కు కూడా సీక్వెల్స్ అనౌన్స్ చేస్తున్నారు.
టాలీవుడ్ లో సూపర్ హిట్ సినిమాలన్నీ సీక్వెల్స్ కు రెడీ అవుతున్నాయి.. కొన్ని సినిమాలు సీక్వెల్స్ రిలీజ్ అయ్యాయి కూడా. ఇక ఇప్పుడు రామ్ చరణ్ నటించిన మరో టాలీవుడ్ సూపర్ హిట్ మూవీకి సీక్వెల్ చేయడానికి రెడీ అవుతున్నారు మేకర్స్. అటు చరణ్ కూడా ఈ సినిమా కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు తెలుస్తోంది.
రామ్‌చరణ్ సినిమాలలో మర్చిపోలేని సినిమా ధృవ. కమర్షియల్‌గానే కాకుండా.. నటన పరంగా కూడా చరణ్ కు విమర్షకుల నుంచి ప్రశంసలు దక్కాయి. రంగస్థలానికి ముందు రామ్ చరణ్ కు చెప్పుకోదగిన గొప్ప సినిమాల్లో దృవ లిస్ట్ లో పక్కాగా ఉంటుంది. అప్పటి వరకు రామ్‌చరణ్ నటన ఒకెత్తయితే.. దృవ మరో ఎత్తు. ఒక రకంగా రాజమౌళి మగధీర తర్వాత చరణ్ కెరీర్‌లో చెప్పుకొదగ్గ మంచి సినిమా గా ధృవ నిలిచిపోయింది.
ధృవ సినిమా తరువాత మెగా పవర్ స్టార్ రామ్‌చరణ్ యాక్టింగ్ లో...కథల ఎంపికలో..తన లుక్ విషయంలో పూర్తిగా మార్పు కనిపించింది. నటనలో మార్పులు, కథల ఎంపిక పూర్తిగా మారింది. ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర దాదాపు 90 కోట్ల వరకూ కలెక్షన్స్ కూడా సాధించింది. ఇక ఈమూవీకి ఇప్పుడు సీక్వెల్ తెరకెక్కబోతున్నట్టు తెలుస్తోంది.
యాక్షన్ థ్రిల్లర్ నేపథ్యంలో సురేందర్ రెడ్డి దర్శకత్వం వహించిన ఈ సినిమాకు సీక్వెల్ రెడీ అవుతుంది. ప్రొడ్యూసర్ ఎన్.వీ ప్రసాద్ రీసెంట్ గా ధృవ సినిమాకు సీక్వెల్ కన్ఫార్మ్ చేశాడు. దృవ-2 తెరకెక్కనున్నట్లు అనౌన్స్ చేశారు. ఇప్పటికే స్క్రిప్ట్ పనులు కూడా స్టార్ట్ అయినట్టు తెలుస్తోంది. అంతే కాదు మరో బ్రేకింగ్ ఏంటంటే..? ఈసినిమాకు గాడ్‌ఫాదర్ ఫేం మోహన్‌రాజా డైరెక్ట్ చేయబోతున్నట్టు తెలుస్తోంది.
ఇక ఈ సినిమాకు సంబంధించి వివరాలు త్వరలో అనౌన్స్ చేసే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. ఈ న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ అవ్వడంతో మెగా అభిమానులు పండగ చేసుకుంటున్నారు. ఎప్పుడెప్పుడు అనౌన్స్ మెంట్ వస్తుందా అని ఎదురు చూస్తున్నారు. మెగాస్టార్ గాడ్ ఫాదర్ హిట్ అయితే.. మోహన్ రాజాతో సినిమా కన్ ఫార్మ్ అయినట్టే అని అంటున్నారు.