- Home
- Entertainment
- గురుస్వామిగా రామ్ చరణ్ కు ప్రమోషన్, సీజన్ కాకున్నా మెగా పవర్ స్టార్ అయ్యప్ప దీక్ష ఎందుకు తీసుకున్నారో తెలుసా..
గురుస్వామిగా రామ్ చరణ్ కు ప్రమోషన్, సీజన్ కాకున్నా మెగా పవర్ స్టార్ అయ్యప్ప దీక్ష ఎందుకు తీసుకున్నారో తెలుసా..
రామ్ చరణ్ సడెన్ గా అయ్యప్ప దీక్షలో కనిస్తున్నాడు. ఇందులో విచిత్రం ఏముంది చరణ్ ఎప్పుడూ తీసుకుంటూనే ఉంటాడు కదా అనుకోవచ్చు. కాని ప్రస్తుతం సమ్మర్ సీజన్ నడుస్తోంది. అయ్యప్ప దీక్షలకు ఇది టైమ్ కాదు. మరి రామ్ చరణ్ ఇప్పుడు అయ్యప్ప దీక్ష ఎందుకు తీసుకున్నారో తెలుసా..?

ఫిల్మ్ ఇండస్ట్రీలో చాలా మంది స్టార్స్ కు భక్తి భావం ఎక్కువ. అందులో ముఖ్యంగా మెగా ఫ్యామిలీలో పూజలు,దీక్షలు ఎక్కువగా చేస్తుంటారు. మెగాస్టార్ చిరంజీవి, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ మిస్ అవ్వకుండా అయ్యప్ప దీక్ష తీసుకుంటుంటారు.
చిరంజీవి మిస్ అయినా.. రామ్ చరణ్ మాత్రం సీజన్ మిస్ అవ్వకుండా అయ్యప్ప దీక్షలు తీసుకుంటారు. ఇది వారికి సెంటిమెంట్ గా వస్తుంది. చరణ్ ఇలా చేయడానికి రకరకాల కారణాలు వినిపిస్తూ ఉంటాయి ఇండస్ట్రీలో. ఇక లాస్ట్ సజన్ లో కూడా దీక్ష తీసుకున్నాడు చరణ్. అయితే ఇప్పుడు సడెన్ గా మరోసారి సడెన్ గా అయ్యప్ప దీక్షలోకనిపిస్తున్నారు.
రీసెంట్ గా ముంబయ్ లో ట్రిపుల్ ఆర్ రెస్పాన్స్ చూడటానికి వెళ్ళాడు చరణ్ . సరిగ్గా అదే టైమ్ లో ఆయన్ను ఫ్యాన్స్ చుట్టుముట్టారు. ఈ టైమ్ లోనే అయ్యప్ప దీక్షా డ్రెస్ లో కనిపించారు చరణ్. దీంతో రామ్ చరణ్ ఎందుకు మళ్ళీ దీక్ష తీసుకున్నారు అన్న డౌట్ చాలా మంది ఆడియన్స్ లో వచ్చింది.
రామ్ చరణ్ అయ్యప్ప దీక్ష తీసుకోబట్టి చాలా కాలం అవుతుంది. ఎటువంటి పరిస్థితులు ఉన్నా..? షూటింగ్స్ లో ఎంత బిజీగా ఉన్నా..? సీజన్ లో తప్పకుండా అయ్యప్ప దీక్ష తీసుకుంటుంటాడు రామ్ చరణ్. సినిమా ఫంక్షన్స్ లో కూడా చాలా సార్లు దీక్షలోనే కనిపించాడు చరణ్.
ఇక ఎన్నో సార్లు అయ్యప్ప దీక్ష తీసుకోవడంతో రామ్ చరణ్ కు గురు స్వామిగా ప్రమోషన్ వచ్చిందట. ఇప్పుడు అయ్యప్ప మాలధారుల్లో చరణ్ సీనియన్ అయిపోయాడు. ఇక నుంచి కొత్త వారికి దీక్ష ఇచ్చే అధికారం కూడా రామ్ చరణ్ కు వచ్చినట్టు తెలుస్తోంది.
అందుకే రామ్ చరణ్ టైమ్ కాని టైమ్ లో అయ్యప్ప దీక్షలో కనిపించినట్టు తెలుస్తోంది. ప్రస్తుంతం ట్రిపుల్ ఆర్ సక్సెస్ ను ఎంజాయ్ చేస్తున్న చరణ్.. శంకర్ సినిమాపై సీరియస్ గా దృష్టిపెట్టినట్టు తెలుస్తోంది. పక్కా ప్లాన్ తో నెక్ట్స్ షెడ్యూల్ ను స్టార్ట్ చేయబోతున్నారు టీమ్.