Ram Charan - Upasana : పులి లాంటి రామ్ చరణ్ తో... ఉపాసన ఎలాంటి సేవలు చేయించుకుంటుందో చూశారా?
మెగా యంగ్ దంపతులు రామ్ చరణ్ - ఉపాసన (Upasana Konidela)ల మధ్య ఉన్న బంధం తాజాగా బయటపడింది. ఉపాసన చెర్రీ ఎలాగుంటారో ఓ వీడియో ద్వారా తెలిసిపోతోంది.
మెగా కోడలుగా, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ (Ram Charan) భార్యగా ఉసాపన కొణిదెల చిరంజీవి ఇంట అడుగు పెట్టిన విషయం తెలిసిందే. కొన్నేళ్లుగా ఆ ఇంట వెలుగులు నింపుతోంది.
గతేడాది పండంటి ఆడబిడ్డ, మెగా ప్రిన్సెస్ క్లింకార (Klin kaara)కు కూడా జన్మిచ్చింది. మనవరాలు వచ్చిన తరుణంలో అటు వరుణ్ పెళ్లి, ఇటు పద్మవిభూషణ్ అవార్డుతో మెగా ఇంట సందడి నెలకొంది.
వీటన్నింటిని ఉపాసన కొణిదెల ఎంతగానో సెలబ్రేట్ చేసుకుంది. ప్రతి మూమెంట్ ను మెగా అభిమానులతో సోషల్ మీడియా ద్వారా పంచుకుంటూ వచ్చింది. ఇక చరణ్ గురించి కూడా అప్డేట్ ఇస్తూ ఉంటుంది.
ఇదిలా ఉంటే.. రామ్ చరణ్ - ఉపాసన సమయం దొరికినప్పుడల్లా టూర్లకు వెళ్తూనే ఉంటారు. ఈ క్రమంలో వీకెండ్ ట్రిప్ కు సంబంధించిన ఓ వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్ గా మారింది.
వెండితెరపై పులిలా వేటాడే చరణ్ ఈ వీడియోలో ఉపాసన దగ్గర చిన్నపిల్లాడిలా మారిపోయాడు. భార్యకు సేవలు చేస్తూ సాధారణ వ్యక్తిలా కనిపించారు. తన అర్థభాగమైన ఉపాసనకు భర్తగా సేవలు చేసుకున్నారు.
ఆకాశంలో ప్రైయివేట్ ఫ్లైట్ లో ప్రయాణిస్తూ ఉపాసన చరణ్ తో సేవలు చేయించుకుంటూ ఇలా కనిపించింది. దీంతో చరణ్ కుటుంబీకులతో ఉండే తీరు, ముఖ్యంగా ఉపాసనను ఎంత ప్రేమగా చూసుకుంటారో తెలిసి నెటిజన్లు అభినందిస్తున్నారు.