MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • రాంచరణ్, సుకుమార్ మూవీ బడ్జెట్.. ప్రాథమిక అంచనానే ఎన్ని వందల కోట్లో తెలుసా ?

రాంచరణ్, సుకుమార్ మూవీ బడ్జెట్.. ప్రాథమిక అంచనానే ఎన్ని వందల కోట్లో తెలుసా ?

రీసెంట్ గా రాంచరణ్ భారీ పాన్ ఇండియా చిత్రం ఒకటి ప్రారంభం అయింది. బుచ్చిబాబు దర్శకత్వంలో తెరకెక్కబోయే ఈ చిత్రానికి ముందు నుంచి విపరీతమైన హైప్ ఏర్పడింది. 

2 Min read
Author : Tirumala Dornala
Published : Mar 21 2024, 10:24 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16

మెగా పవర్ స్టార్ రాంచరణ్ సినిమాల విషయంలో గేరు మార్చినట్లే కనిపిస్తున్నారు. ఆర్ఆర్ఆర్ తర్వాత చరణ్ నుంచి ఒక్క చిత్రం కూడా రాలేదు. శంకర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న గేమ్ ఛేంజర్ షూటింగ్ నత్త నడకగా సాగుతోంది. కొన్ని సందర్భాల్లో చరణ్ ఫ్యాన్స్.. శంకర్ పై, నిర్మాత దిల్ రాజుపై అసహనం కూడా వ్యక్తం చేశారు. 

Add Asianetnews Telugu as a Preferred SourcegooglePreferred
26

రీసెంట్ గా రాంచరణ్ భారీ పాన్ ఇండియా చిత్రం ఒకటి ప్రారంభం అయింది. బుచ్చిబాబు దర్శకత్వంలో తెరకెక్కబోయే ఈ చిత్రానికి ముందు నుంచి విపరీతమైన హైప్ ఏర్పడింది. రెహమాన్, జాన్వీ కపూర్ , శివరాజ్ కుమార్ ఇలా పెద్ద పెద్ద వాళ్ళు ఈ చిత్రంలో ఫిక్స్ అయిపోయారు. 

 

36

ఇంతలోనే రాంచరణ్ చిత్రం మరో క్రేజీ కాంబినేషన్ లో సెట్ అయింది అంటూ ప్రచారం జరుగుతోంది. రంగస్థలం లాంటి నాన్ బాహుబలి హిట్ ఇచ్చిన సుకుమార్ మరోసారి రాంచరణ్ తో జత కట్టబోతున్నట్లు స్ట్రాంగ్ బజ్ వినిపిస్తోంది. ఈ కాంబినేషన్ ఆల్మోస్ట్ ఖరారైనట్లు టాక్. 

 

46

మార్చి 27న రాంచరణ్ పుట్టినరోజు ఉంది. ఆ రోజు RC 17 చిత్రాన్ని అధికారికంగా అనౌన్స్ చేస్తారట. ఆల్మోస్ట్ రంగస్థలం సినిమాకి పనిచేసిన వాళ్లే ఈ చిత్రానికి కూడా ఉండబోతున్నారు. మైత్రి మూవీస్ సంస్థ నిర్మాణంలో దేవిశ్రీ ప్రసాద్ సంగీతం లో ఈ చిత్రం ఉండబోతున్నట్లు తెలుస్తోంది. 

56

సుకుమార్, రాంచరణ్ ఇద్దరూ ఇప్పుడు పాన్ ఇండియా సెలెబ్రిటీలు. కాబట్టి వీళ్లిద్దరి కాంబినేషన్ లో వచ్చే చిత్రం అంతే భారీగా ఉండాలి. అందుకు తగ్గట్లుగానే ఈ చిత్రానికి 250 కోట్ల బడ్జెట్ అని ప్రాథమికంగా అంచనా వేశారట. ప్రస్తుతం సుకుమార్ పుష్ప 2తో బిజీగా ఉన్నారు. ఆగష్టు నుంచి సుక్కు ఫ్రీ అవుతారు. ఆ తర్వాత రాంచరణ్ చిత్రానికి సంబంధించిన స్క్రిప్ట్ కి తుది మెరుగులు ఉంటాయి. 

66

ఇయర్ ఎండ్ నుంచి షూటింగ్ మొదలు పెట్టే అవకాశం ఉంది. అటు బుచ్చిబాబు చిత్రానికి.. ఇటు సుకుమార్ చిత్రానికి చరణ్ పార్లల్ గా వర్క్ చేసే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. అలా జరిగితే రేర్ ఫీట్ అవుతుంది. గురుశిష్యులు ఇద్దరూ ఒకే హీరోతో ఒకే సమయంలో వర్క్ చేసినట్లు అవుతుంది. 

 

About the Author

TD
Tirumala Dornala
ఏడేళ్లుగా డిజిటల్, వెబ్ మీడియా రంగంలో పనిచేస్తున్నారు. ప్రధానంగా సినిమా, ఎంటర్టైన్మెంట్ విభాగాల్లో పని చేసిన అనుభవం ఉంది. గతంలో కొన్ని మీడియా సంస్థల్లో సబ్ ఎడిటర్ గా రాణించారు. ప్రస్తుతం 2021 నుంచి ఏసియా నెట్ లో ఎంటర్టైన్మెంట్ విభాగంలో సీనియర్ సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. సినిమాకి సంబంధించిన వార్తలు, విశ్లేషణలు అందించడంలో అనుభవం ఉంది.

Latest Videos
Recommended Stories
Recommended image1
Jr NTR House: జూనియర్ ఎన్టీఆర్ ఇంద్రభవనం గురించి తెలుసా.. 25 కోట్లతో డ్రీమ్ హౌస్ నిర్మించుకున్న యంగ్ టైగర్
Recommended image2
Kurchi Thatha: తీవ్ర విషాదం, సోషల్ మీడియా సంచలనం కుర్చీ తాత మృతి.. కన్నీరు మున్నీరవుతున్న వైజాగ్ సత్య
Recommended image3
Madhuri Dixit: గర్భవతి, పైగా జ్వరం.. అయినా 13 గంటలు డ్యాన్స్ చేసిన హీరోయిన్
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved