- Home
- Entertainment
- నాన్న రాజమౌళిని ఒప్పించబట్టే ఆచార్య చేశాను, మెగాస్టార్ తో ఆ క్షణాలు మర్చిపోలేనివన్న రామ్ చరణ్
నాన్న రాజమౌళిని ఒప్పించబట్టే ఆచార్య చేశాను, మెగాస్టార్ తో ఆ క్షణాలు మర్చిపోలేనివన్న రామ్ చరణ్
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ఇంట్రెస్టింగ్ విషయాలు పంచుకున్నారు. ఓ చిట్ చాట్‌లో పాల్గొన్న రామ్ చరణ్ తన తండ్రితో కలిసి నటించిన అనుభవాలను పంచుకున్నాడు. షూటింగ్ జరుగుతున్నంత కాలం ప్రతి నిమిషం తన తండ్రి తో కలిసి ఉండటం, తన జీవితంలోనే మర్చిపోలేని రోజులన్నారు చరణ్.

మెగాస్టార్ చిరంజీవి – మెగా పవర్ స్టా రామ్ చరణ్ కాంబినేషన్లో కొరటాల శివ డైరెక్షన్ లో తెరకెక్కిన మూవీ ఆచార్య. నిరంజన్, అవినాశ్ రెడ్డి తో కలిసి రామ్ చరణ్ నిర్మించిన ఈ సినిమాను ఈ నెల 29న ప్రపంచ వ్యాప్తంగా గ్రాండ్ గా రిలీజ్ చేయబోతున్నారు. ఇక ఈ సినిమా ప్రమోషన్స్ ఊపందుకున్నాయి.
ఈ సినిమా ప్రమోషన్స్ లో బిజీగా ఉన్నారు టీమ్ ఇక తాజాగా ఇంటర్వ్యూలో రామ్ చరణ్ మాట్లాడుతూ ఒక ఆసక్తికరమైన విషయాన్ని అభిమానులతో పంచుకున్నారు.
ఇంటి నిర్మాణానికి సంబంధించిన పనుల కారణంగా నాలుగేళ్లుగా నాన్నతో కలిసి ఉండలేకపోయాను. నాన్నకు దూరంగా ఉండవలసి వచ్చినందుకు నాకు చాలా బాధగా ఉండేది అంటూ ఎమోషనల్ అయ్యారు చరణ్. కాని ఆ బాధ ఆచార్య సినిమా షూటింట్ తీర్చిందన్నారు.
ఇక అలాంటి పరిస్థితుల్లో నాన్నతో కలిసి ఉండే అదృష్టం ఆచార్య సినిమా వల్ల కలిగింది అన్నారు చరణ్.. ఈ సినిమా కోసం ఇద్దరం కలిసి 18 రోజుల పాటు ఒకే కాటేజ్ లో ఉన్నామన్నారు చరణ్. అసలు తాను ఆచార్య సినిమాలో చేయడానికి కారణం తన తండ్రి చిరంజీవే అన్నారు రామ్ చరణ్. ట్రిపుల్ ఆర్ బిజీలో ఉన్న తనను రాజమౌళిని ఒప్పించి ఆచార్య కోసం కొన్ని రోజులు తీసుకున్నారన్నారు రామ్ చరణ్. లేకుంటే తనకు ఆచార్య చేసే అవకాశం వచ్చేది కాదన్నారు.
ఇక రామ్ చరణ్ మాట్లాడుతూ.. నాకూ, డాడీకి షూటింగ్ టైమ్ లో వీలుగా ఉండటానికి ఒక డబుల్‌బెడ్రూం కాటేజీని ఇచ్చారు అక్కడ దాదాపు 20రోజులు నేను, డాడీ కలిసి నిద్రలేవడం, కలిసి భోజనం చేసేవాళ్లం. ప్రతీ రోజు మార్నింగ్ అయిదున్నారకు లేచి కలిసి వర్కవుట్ చేశామన్నారు.
రోజూ కలిసి షూటింగ్‌కు వెళ్లడం,సెట్స్‌లో ఇద్దరం కలిసి పని చేయడం, షూటింగ్ పూర్తయిన వెంటనే ఇద్దరం కలిసి ఒకే కారులో కాటేజికి రావడం. ఈ క్షణాలన్నీ నాకు ఎంతో మధురమైనవి, నాన్నతో ప్రయాణం చేస్తున్న దాని గురించి నా ఫీలింగ్స్‌ను మాటల్లో వర్ణించలేను అంటూ ఎమోషనల్ అయ్యారు రామ్ చరణ్.
అడవికి సంబంధించిన సన్నివేశాలను చిత్రీకరిస్తున్నప్పుడు. కలిసి బ్రేక్ ఫాస్ట్ చేసేవాళ్లం. సాయంత్రం షూటింగు నుంచి వచ్చిన తరువాత టీ తాగుతూ కబుర్లు చెప్పుకునేవాళ్లం. అలా నాన్నతో గడిపిన ఆ 18 రోజులు .. నా జీవితంలో నాకు ఎప్పటికీ గుర్తుండిపోతాయి అని చెప్పుకొచ్చాడు.
అంతే కాదు ఆ టైమ్ లో నాన్న అన్న కొన్ని మాటలు తనపై గట్టిగా ప్రభావం చూపించాయి అన్నారు చరణ్. చరణ్ నీకు అర్ధం కావడం లేదేమో దీని వాల్యూ... ఎప్పటికో కానీ మనకు ఇలాంటి అవకాశం రాదు. ఆచార్య వల్ల మనకు ఈ అవకాశం వచ్చింది. ప్రతి నిమిషాన్ని ఎంజాయ్ చేద్దాం. మళ్లీ నీతో నాకు ఇలాంటి అవకాశం ఎప్పుడు వస్తుందో నాకు తెలియదు అని మెగాస్టార్ అన్నారంటూ.. చరణ్ వివరించారు.
అంతే కాదు మెగాస్టార్ మరికొన్ని విషయాలు తనతో చెప్పిన్టు ఆయన వివరించారు. ఇంత మంచి కథలో మనం కలిసి నటించడం ప్రతిసారీ కుదరదు అంటూ.. నాన్న నన్ను హత్తుకున్నపుడు నాకు కన్నీళ్లు వచ్చాయంటూ ఎమోషనల్ అయ్యాడు రామ్ చరణ్.
ఇలా ఆచార్య సినిమా తమకు చాలా స్పెషల్ అంటూ తన తండ్రి చిరంజీవి గురించి, ఆచార్య షూటింగ్ విషేషాల గరించి అభిమానులతో పంచుకున్నారు చరణ్. ఇక ఈసినిమా గురించి మెగా ఫ్యాన్స్ ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు. మెగా తండ్రీ కొడుకులు నటించడంతో ఆచార్య సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి.