ప్రియుడితో పెళ్ళికి సిద్ధమైన రకుల్..? కన్ఫర్మ్ చేసిన ఆమె తమ్ముడు!
రకుల్ ప్రీత్ సింగ్ ప్రియుడిని పరిచయం చేసి ఏడాది అవుతుంది. జాకీ భగ్నానీని ప్రేమిస్తున్నట్లు ఆమె వెల్లడించగా పెళ్లి ఎప్పుడనే సందేహాలు అభిమానులను వెంటాడుతున్నాయి. దీనిపై ఆమె తమ్ముడు ఒక క్లారిటీ ఇచ్చాడు.

బాలీవుడ్ సినిమాలతో రకుల్ ప్రీత్ సింగ్ బిజీగా ఉంది. అలాగే తమిళ్ లో కొన్ని చిత్రాలు చేస్తున్నారు. మొత్తంగా అరడజను చిత్రాలకు పైగా ఆమె ఖాతాలో ఉన్నాయి. నెలల వ్యవధిలో రకుల్ ప్రీత్ నటించిన అటాక్, రన్ వే, కట్ పుట్లి చిత్రాలు విడుదలయ్యాయి. జయాపజయాలతో సంబంధం లేకుండా ఆమెకు అవకాశాలు క్యూ కడుతున్నాయి.
Image: Varinder Chawla
ఇక రకుల్ ప్రీత్ ని పెళ్లి ఎప్పుడనే ప్రశ్న వెంటాడుతుంది. ఏ చిత్ర ప్రమోషనల్ ఈవెంట్ లో పాల్గొన్నా మీడియా ఆమెను వివాహం ఎప్పుడు చేసుకుంటున్నారని అడుగుతున్నారు. పదే పదే అడగడంతో రకుల్ ఒకింత అసహనానికి గురవుతున్నారు. మీడియాపై ఆమె ఒకటి రెండు సందర్భాల్లో ఫైర్ అయ్యారు కూడా.
2021 అక్టోబర్ నెలలో రకుల్ తన ప్రియుడ్ని పరిచయం చేశారు. నటుడు, నిర్మాత జాకీ భగ్నానీని ప్రేమిస్తున్నట్లు వెల్లడించారు. ఆయనతో దిగిన ఫోటో ఇంస్టాగ్రామ్ లో షేర్ చేశారు. రకుల్ సోషల్ మీడియా పోస్ట్ ఒకింత షాక్ ఇచ్చింది. ఎలాంటి హింట్ లేకుండా ఆమె తన లవ్ స్టోరీ బయటపెట్టడం సంచలనం రేపింది.
2022 అక్టోబర్ 10న మరో పుట్టినరోజు జరుపుకున్న రకుల్ ప్రియుడ్ని పరిచయం చేసి ఏడాది అవుతుంది. ఈ క్రమంలో పెళ్లి ఎప్పుడనే ప్రశ్నలు మరలా తెరపైకి వచ్చాయి. కాగా బాలీవుడ్ మీడియా రకుల్ ప్రీత్ తమ్ముడు అమన్ ప్రీత్ ని సంప్రదించగా ఓ హింట్ ఇచ్చాడు. అమన్ ప్రీత్ అక్క పెళ్లి గురించి చెప్పిన వార్తను బాలీవుడ్ మీడియా ప్రముఖంగా ప్రచురించింది.
అమన్ ప్రీత్ మాట్లాడుతూ... రకుల్-జాకీలకు పెళ్లి చేసుకోవాలనే ఆలోచన ఉంది. దీనికి సంబంధించిన ప్రణాళికలు కూడా వేస్తున్నారు. అయితే స్పష్టమైన నిర్ణయం తీసుకోలేదు. పెళ్లికి ముహూర్తం కుదిరితే రకుల్ స్వయంగా తానే వెల్లడిస్తుంది. ప్రస్తుతం ఇద్దరూ తమ తమ ప్రొఫెషన్స్ లో బిజీగా ఉన్నారని ఆయన అన్నారు.
దీంతో 2023 లో రకుల్-జాకీ భగ్నానీ పెళ్లి చేసుకోవడం ఖాయమని అంటున్నారు. రకుల్ చేస్తున్న ప్రాజెక్ట్స్ షూట్స్ ఈ ఏడాది చివరికి పూర్తి కానున్నాయి. సమ్మర్ తర్వాత ఆమెకు విరామం దొరకవచ్చు. కాబట్టి వచ్చే ఏడాది రకుల్ పెళ్లి చేసుకుంటారన్న ఊహాగానాలు మొదలయ్యాయి.
అయితే తమ్ముడు అమన్ ప్రీత్ స్టేట్మెంట్ పై రకుల్ స్పందించడం విశేషం. అమన్ ప్రీత్ నువ్వు కన్ఫర్మ్ చేశావా? నాకు కూడా చెప్పలేదేంటి బ్రో. నా జీవితం గురించి నాకే తెలియకపోవడం నవ్వు తెప్పిస్తుంది అంటూ సోషల్ మీడియా పోస్ట్ చేసింది. ఆమె కామెంట్స్ మరలా సందేహాలకు తావిచ్చాయి.