ప్రియుడికి రకుల్ ప్రీత్ సింగ్ బర్త్ డే విషెస్.. ముంబైలో రచ్చరచ్చ.. వైరల్ పిక్స్!
స్టార్ హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్, బాలీవుడ్ నటుడు జాకీ భగ్నానీ కొన్నాళ్లుగా డేటింగ్ లో ఉన్న విషయం తెలిసిందే. ఈరోజు జాకీ భగ్నానీ పుట్టినరోజు కావడంతో రకుల్ ప్రీత్ స్పెషల్ గా విష్ చేసింది. ముంబైలో జాకీ బర్త్ డే వేడుకలను గ్రాండ్ గా నిర్వహించారు.

ఈతరం ఆడియెన్స్ కు పరిచయం అవసరం లేని హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ (Rakul Preet Singh). కొన్నాళ్లపాటు టాలీవుడ్ ను ఊపూపిన రకుల్ ప్రస్తుతం బాలీవుడ్ లోనే పాతుకుపోయింది. బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో దూసుకుపోతోంది. ఏడాదిలోనే ఐదు సినిమాలను రిలీజ్ చేసి ఆశ్చర్యపరిచింది.
అయితే, గతేడాదే తన భాయ్ ఫ్రెండ్ ను అభిమానులకు పరిచయం చేసిన విషయం తెలిసింది. బాలీవుడ్ నటుడు జాకీ భగ్నానీ (Jackky Bhagnani)తో డేటింగ్ లో ఉందని, త్వరలోనే వీరిద్దరి పెళ్లి కూడా జరగబోతుందంటూ ఇప్పటికీ నెట్టింట వార్తలు పుట్టుకొస్తూనే ఉన్నాయి.
ఇదిలా ఉంటే.. ఈ రోజు జాకీ భగ్నానీ పుట్టినరోజు కావడం విశేషం. దీంతో రకుల్ ప్రీత్ సింగ్ తన భాయ్ ఫ్రెండ్ జాకీ భగ్నానీకి స్పెషల్ గా విషెస్ తెలిసింది. ఈ సందర్భంగా ఓ రొమాంటిక్ పిక్ ను కూడా విడుదల చేసింది. ఇన్ స్టా ద్వారా ప్రియుడిని వాటేసుకున్న ఫొటోను వదులుతూ శుభాకాంక్షలు తెలిపింది.
జాకీ భగ్నానీతో కలిసి ఉన్న పిక్ ను షేర్ చేస్తూ.. ‘శాంటా నా జీవితానికి ఉత్తమమైన బహుమతిని అందించాడు. అది నువ్వే. ఈరోజు మై లవ్ జాకీ భగ్నానీ పుట్టిన రోజు కావడం సంతోషంగా ఉంది. ఎప్పటికీ నీవెంటే ఉంటాను. అలాగే నువ్వు కోరుకున్నవన్నీ జయించాలని ఆకాంక్షిస్తున్నారు. ఎప్పుడూ నవ్వుతూ సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నాను’ అంటూ శుభాకాంక్షలు తెలిపింది.
జాకీ భగ్నానీతో తన లవ్ ట్రాక్ ను రిలీజ్ చేసిన తర్వాత నుంచి రకుల్ ప్రీత్ సింగ్ సౌత్ వైపు చూడటం తగ్గించింది. ఢిల్లీ, ముంబైలోనే ఉంటూ.. సినిమాలు చేస్తోంది. మరోవైపు తన పర్సనల్ లైఫ్ ను కూడా ఎంజాయ్ చేస్తోంది. భాయ్ ఫ్రెండ్ తో సిటీలో, పలు ఈవెంట్లకు హాజరవుతూ రచ్చరచ్చ చేస్తోంది.
నిన్న రాత్రి జాకీ భగ్నానీ పుట్టిన రోజు వేడుకలను ముంబైలో నిర్వహించారు. ఈ సందర్భంగా బాలీవుడ్ నుంచి స్టార్ ప్రొడ్యూసర్ కరణ్ జోహార్, కృతి సనన్, కార్తీక్ ఆర్యన్, వరుణ్ ధావన్ మరియు అతని భార్య నటాషా దలాల్, అలయ ఎఫ్, షాహిద్ కపూర్, సోఫీ చౌదరి మరికొంత మంది స్టార్స్ హాజరయ్యారు. రకుల్ ప్రీత్ సింగ్ స్టన్నింగ్ అవుట్ ఫిట్ లో దర్శనమివ్వడంతో ప్రస్తుతం ఆ ఫొటోలు కూడా నెట్టింట వైరల్ అవుతున్నాయి.