మళ్ళీ మొదలైన రాఖీ సావంత్ రచ్చ, మాజీ భర్త పై పోలీసులకు ఫిర్యాదు
కొత్త ప్రియడు దొరికాడు ,ఇక వివాదం ముగిసినట్టే అనుకున్న టైమ్ లో రాఖీ సావంత్ రచ్చ మళ్లీ మొదలయ్యింది. మాజీ భర్తతో వివాదాలు ఇంకా ముగిసినట్టు లేదు. అందుకే తన మాజీ భర్తపై పోలీసులకు పిర్యాదు చేసింది రాఖీ.

రాఖీ సావంత్ తన మాజీ భర్తపై ముంబై పోలీసులకు ఫిర్యాదు చేసింది. కొత్త బోయ్ ఫ్రెండ్ ఆదిల్ ఖాన్ తో కలిసి శుక్రవారం సాయంత్రం ఒషివర పోలీసు స్టేషన్ కు వచ్చిన ఆమె, పాత మొగుడు రితేష్ పై కేసు దాఖలు చేసింది.
తన సోషల్ మీడియా ఖాతాలు, ఆన్ లైన్ చెల్లింపుల విధానాలను తన మాజీ భర్త రితేష్ హ్యాక్ చేసినట్టు ఆమె ఆరోపించింది. తనకు తన మాజీ భర్త టార్చర్ నుంచి విముక్తి కల్పించాలని కొరుతూ పోలీసులను ఆశ్రయించింది రాఖీ సావంత్. ఈ సందర్భంగా ఆమె ఏడుస్తూ కనిపించింది.
తన కొత్త బోయ్ ఫ్రెండ్ ఆదిల్ ను చూసి తన మాజీ భర్త రితేష్ అసూయ పడుతున్నాడంటోంది రాఖీ. అందుకే తనపై దీనికి ప్రతీకారం తీర్చుకోవడం కోసమే రితేష్ ఇలా చేస్తున్నాడంటూ ఆరోపణలు చేసింది. రితేష్ తో తాను కలిసున్నప్పుడు తన సోషల్ మీడియా ఖాతాల నిర్వహణను అతడు చూసే వాడని.. అతడి నుంచి వేరుపడిన తర్వాత పాస్ వర్డ్ లను మార్చలేదని రాఖీ సావంత్ వివరించింది.
ఇక ఈ సందర్భంగా ఏడుస్తూ.. రాఖీ కొన్ని విషయాలు వెల్లడించింది. నా మాజీ భర్త రితేష్ నాకు ఎన్నో సమస్యలు తీసుకొస్తున్నాడు. అందుకనే నేను పోలీసు స్టేషన్ కు వచ్చాను. తను నా ఇన్ స్టా గ్రామ్, ఫేస్ బుక్, జీమెయిల్ ఖాతాలను హ్యాక్ చేశాడు. నా ఖాతాలు అన్నింటిలోనూ అతడి నంబర్, అతడి పేరు ఇచ్చాడు.
మేము ఇద్దరం కలసి ఉన్నప్పుడు నా ఐడీ, పాస్ వర్డ్స్ వివరాలు అతడికి ఇచ్చాను. తర్వాత వాటి పాస్ వర్డ్ లు మార్చలేదు. మేము ఇద్దరం ఫ్రెండ్లీగానే విడిపోయాం. అయినా కానీ, అతడు నాపై పగపెంచుకున్నాడు. నాపై ప్రతీకార తీర్చుకునే విధంగా వ్యవహరిస్తున్నాడు. నన్ను నాశనం చేస్తానని స్పష్టంగా బెదిరిస్తున్నాడు అన్నది.
ఇన్ స్టా గ్రామ్ నుంచి తానకు రావల్సిన డబ్బును కూడా.. నా అకౌంట్ హ్యాక్ చేశి రాకుండా చేస్తున్నాడు. నాకు ఇన్ కమ్ లేకుండా చేసి.. నా నుంచి అతను డబ్బు సంపాదించుకోవాలి అని చూస్తున్నాడు అంటూ.. మీడియాతో తన బాధను పంచుకుంది రాఖీ సావంత్.
ప్రతీకారం తీర్చుకుంటున్నారని ఎలా చెబుతున్నారంటూ.. మీడియా ప్రశ్నించగా.. తన ఖాతాలో కొన్ని టీవీలకు, వ్యతిరేకంగా విషయాలు పోస్ట్ చేస్తున్నాడని చెప్పింది. వాటిని చూసి నేనే వాటిని రాస్తున్నానని టెలివిజన్ ఛానల్ వాళ్లు భావిస్తారు. ఛానల్ వాళ్లు నన్ను బ్యాన్ చేయాలని కోరుకుంటున్నాడు అని సావంత్ వివరించింది.
ప్రస్తుతం రాఖీ సావంత్ తన భర్తతో విడిపోయి.. కొత్త ప్రియుడు అదిల్ ఖాన్ తో కలిసి ఉంటోంది. తనకంటే చిన్నవాడు అయినా.. అదిల్ తల్లి తండ్రులను తమ పెళ్లికి ఒప్పించే పనిలో ఉంది. ఆ మధ్య తన బాయ్ ప్రెండ్ నుంచి కోట్ల విలువ చేసే కానుకలు కూడా అందుకుంది రాఖీ సావంత్.