మరోసారి జంటగా రజనీకాంత్, ఐశ్వర్యరాయ్.. ఈ సారి దర్శకుడు ఎవరంటే..?
మరోసారి సౌత్,నార్త్ స్టార్ జోడీ వెండితెరపై సందడి చేయబోతోంది. సూపర్ స్టార్ రజనీ కాంత్ సరసన బాలీవుడ్ స్టార్ సీనియర్ బ్యూటీ ఐశ్వర్య రాయ్ రెండో సారి నటించబోతోంది. మరి ఈసారి వీరిద్దరిని డైరెక్ట్ చేయబోయేది ఎవరు..?
సూపర్ స్టార్ రజనీకాంత్, బాలీవుడ్ భామ ఐశ్వర్యారాయ్ వీరిద్దరు చేసింది ఒక్క సినిమానే అయినా.. అది దేశవ్యాప్తంగా క్రేజ్ ను తీసుకొచ్చింది. వీరిద్దరు జంటగా 2010లో వచ్చిన రోబో సినిమా ఎంత హిట్ అయ్యిందో అందరికి తెలసిందే.. రజనీ యాక్షన్, ఐశ్వర్య అందం, దర్శకుడు శంకర్ గ్రాఫిక్స్ మాయాజాలం అన్నీ కలిసి రోబో సినిమా సూపర్ సక్సెస్ సాధించింది.
శంకర్ చేసిన విజ్యువల్ వండర్ రోబో.. ఈ సినిమా తరువాత సరిగ్గా 8 ఏళ్లకు.. అంతకు మంది బడ్జెట్.. అంతకు మించి గ్రాఫిక్స్.. అంతకు మించి అన్నింటిని సెట్ చేసుకుని చేసిన రోబో2.0 ఘోరమైన పరాజయాన్ని చూసింది. భారీ నష్టాన్ని కూడా మిగిల్చింది.
ఇక రోబో రిలీస్ అయ్యి ఇప్పటికి దాదాపు 12 ఏళ్లు గడిచిపోయాయి. ఇప్పుడు వీరిద్దరూ మరోసారి జతకట్టబోతున్నారనే వార్తలు కోలీవుడ్ లో బలంగా వినిపిస్తున్నాయి. వీరిద్దరి కాంబినేషన్ లో మరోసారి తమిళంలో మరో అద్భుతం చేయడానికి ఓ యంగ్ డైరెక్ట్ రెడీగా ఉన్నాడ.
రజనీ, ఐశ్వర్యల తాజా చిత్రానికి నెల్సన్ దిలీప్ దర్శకత్వం వహించనున్నట్టు సమాచారం. ఈ సినిమా కమర్షియల్ ఎంటర్టైనర్ గా తెరకెక్కించనున్నారు. మరోవైపు రజనీకి ఇది 169వ సినిమా కాబోతోంది. త్వరలోనే ఈ మూవీ సెట్స్ మీదికు వెళ్లబోతున్నట్టు తెలుస్తోంది.
అంతే కాదు ఈ సినిమాలో మరో విశేషం ఏంటీ అంటే.. ఈ సినిమాలో హీరోయిన్ ప్రియాంక అరుల్ మోహన్ ఒక కీలకపాత్రలో నటించబోతోందని సమాచారం. అయితే ఈసిమాపై ఇప్పటి వరకూ అఫిషియల్ అనౌన్స్ మెంట్ అయితే రాలేదు. త్వరలో ఈమూవీకి సంబంధించిన వివరాలు వెల్లడిస్తారని సమాచారం.
ప్రస్తుతం ఐశ్వర్య రాయ్ తమిళ సినిమాలోనే నటిస్తోంది. మణిరత్నం ఎంతో ప్రతిష్టాత్మకంగా రూపొందిస్తున్న పొన్నియన్ సెల్వన్ లో కీలకపాత్రలో ఐశ్వర్య కనిపించబోతోంది. అటు రజనీ కాంత్ కూడా నెక్ట్స్ సినిమాపై కసరత్తులుచేస్తున్నారు. నెల్సన్ దిలీప్ కంటే ముందు మరికొంత మంది డైరెక్టర్లతో సూపర్ స్టార్ మంతనాలు జరుపుతున్నారు.