- Home
- Entertainment
- తాను కండక్టర్‌గా పనిచేసిన డిపోని సందర్శించిన రజనీ.. ఆ జ్ఞాపకాలు నెమరేసుకుంటూ సిబ్బందితో ముచ్చట్లు
తాను కండక్టర్‌గా పనిచేసిన డిపోని సందర్శించిన రజనీ.. ఆ జ్ఞాపకాలు నెమరేసుకుంటూ సిబ్బందితో ముచ్చట్లు
సూపర్ స్టార్ రజనీకాంత్ తన పాత జ్ఞాపకాలను నెమరేసుకున్నారు. తాను నటుడిగా మారకముందు కండక్టర్‌గా పనిచేసిన నేపథ్యంలో తాజాగా ఆ బస్ డిపోని సందర్శించారు. సిబ్బందితో గడిపారు.

రజనీకాంత్(Rajinikanth) చాలా రోజుల తర్వాత విజయాన్ని అందుకున్నారు. `జైలర్`(jailer) సినిమాతో బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ అందుకున్నారు. నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం సుమారు ఆరువందల కోట్ల కలెక్షన్లని రాబట్టింది. ఆరేడు ఏళ్ల తర్వాత రజనీకి ప్రాపర్ బ్లాక్ బస్టర్ పడిందని చెప్పొచ్చు. దీంతో రెట్టించిన ఆనందంలో ఉన్నారు సూపర్ స్టార్. చాలా రిలాక్స్ గా ఉన్నారు. సినిమా రిలీజ్ టైమ్‌కి హిమాలయాలకు ద్యానం కోసం వెళ్లిన ఆయన ఆ తర్వాత `జైలర్` టీమ్‌తో సక్సెస్ సెలబ్రేట్ చేసుకున్నారు.
తాను ఎక్కడి నుంచి వచ్చాడో, ఆ మూలాలను మర్చిపోలేదు. తాజాగా ఆయన బెంగుళూరు బస్ డిపోని సందర్శించారు. తాను హీరో కాకముందు కర్నాటక ఆర్టీసీ బస్ కండక్టర్‌గా పనిచేసిన విషయం తెలిసిందే. ఇన్నేళ్ల తర్వాత కూడా ఆ డిపోని మర్చిపోలేదు రజనీ. తాజాగా ఆ డిపోని సందర్శించారు.
బెంగుళూరులోని బెంగుళూరు మెట్రోపాలిటన్ ట్రాన్స్ పోర్ట్ కార్పోరేషన్ డిపో 4న రజనీ మంగళవారం సందర్శించారు. అకస్మాత్తుగా ఆయన సందర్శించడంతో ఆర్‌టీసీ సిబ్బంది ఆనందానికి అవదుల్లేవ్. తాను పనిచేసిన ప్రాంతమంతా తిరుగుతూ, అప్పటి జ్ఞాపకాలను నెమరేసుకున్నారు రజనీకాంత్.
సిబ్బందితో ఆయన సరదాగా ముచ్చటించారు. వారితో ఫోటోలు దిగారు. రజనీ రాకతో ఆనందంలో సిబ్బంది ఫోటోలు, సెల్ఫీలు తీసుకున్నారు. వారితో రజనీ ఎంతో ప్రేమగా ముచ్చటించారు. కాసేపు సరదాగా ముచ్చట్లు చెప్పుకున్నారు.
అనంతరం సమీపంలోని రాఘవేంద్ర మఠ్‌లో రజనీకాంత్ ప్రత్యేకంగా పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా దిగిన ఫోటోలు ప్రస్తుతం నెట్టింట చక్కర్లు కొడుతున్నాయి.
రజనీకాంత్ కర్నాటక ఆర్టీసీ బస్ కండక్టర్‌గా జీవితాన్ని ప్రారంభించారు. టికెట్ కొట్టడం, డబ్బులు ఇవ్వడం, బస్‌లోనూ సిగరేట్లు స్టయిల్‌గా తాగడం చేసేవారు. ఆయన డ్యూటీ చేసే బస్ లోని ప్రయాణికులను తన స్టయిల్‌తో ఎంటర్‌టైన్ చేసేవారు.
దీంతో రజనీలోని స్టయిల్‌ని చూసి సినిమాల్లో ట్రై చేయాలనే సలహాలతో ఆ దిశగా ప్రయత్నాలు చేశారు. నాటకాలు వేశారు. మద్రాస్ ఫిల్మ్ ఇనిస్టిట్యూట్‌లో యాక్టింగ్ కోర్స్ చేశారు. అనంతరం సినిమాల్లోకి వచ్చారు. కమల్ హాసన్ నటించిన `అపూర్వ రాగంగల్` చిత్రంతో ఆయన నటుడిగా వెండితెరకి పరిచయం అయ్యారు. ఇందులో ఆయనది నెగటివ్ షేడ్ ఉన్న పాత్ర కావడం విశేషం.
1975లో నటుడిగా పూర్తిగా కెరీర్‌ని ప్రారంభించారు. 48ఏళ్ల సుధీర్ఘ సినిమా కెరీర్‌ని సాగించారు. సౌత్ సూపర్ స్టార్‌గా ఎదిగారు. తమిళ చిత్ర పరిశ్రమని ప్రభావితం చేయడంతోపాటు కొన్నాళ్లపాటు శాషించారు. ఇప్పటికీ అదే క్రేజ్‌తో రాణిస్తున్నారు. తన స్టయిల్‌తో పాపులర్ అయిన రజనీ.. ఇప్పుడు ఎంతో మందికి ఆదర్శంగా నిలుస్తున్నారు.