షోలో భర్త రాజీవ్ చేత కన్నీరు పెట్టించిన యాంకర్ సుమ... ఆయన ఏడవడం చూసి..!
బుల్లితెర మహారాణి యాంకర్ సుమ భర్త రాజీవ్ తో కలిసి ఓ కార్యక్రమంలో సందడి చేశారు. భార్య భర్తలు ఇద్దరు తమ మార్కు పంచ్ లతో షోలో రెచ్చిపోయారు. ఈ షోలో పాల్గొన్న యాంకర్ రవిని వీరు ఆడుకున్నారు . ఐతే ఓ భావోద్వేగ సంఘటన వీరి చేత కన్నీరు పెట్టించింది.
జీ తెలుగులో ప్రసారం అవుతున్న బిగ్ సెలెబ్రిటీ ఛాలెంజ్ లో స్టార్ కపుల్ రాజీవ్ కనకాల, సుమ పాల్గొన్నారు.
వస్తూ వస్తూనే సిధ్ శ్రీరామ్ పాడిన ఓ రొమాంటిక్ సాంగ్ తో ఎంట్రీ ఇచ్చారు వీరు. అందమైన స్టెప్స్ తో ఈ జంట అలరించారు.
ఇక యాంకర్ సుమను ఉద్దేశిస్తూ ఎలా భరిస్తున్నావ్ మామ.. అని యాంకర్ రవి, రాజీవ్ కనకాలను అడిగారు. దానికి సమాధానంగా రాజీవి కనకాల అసలు నీతో పెద్దగా మాట్లాడదట కదా అని పంచ్ వేశాడు.
రాజీవ్ కనకాల పంచ్ లకు షోలో ఉన్న రవితో పాటు, బిగ్ బాస్ ఫేమ్ హిమజ పడి పడి నవ్వారు. ఐతే షో చివర్లో ఓ సందర్భం వీరిని భావోద్వేగానికి గురి చేసింది.
ఓ ఆర్టిస్ట్ రాజీవ్ కళ్ళకు గంతలు కట్టి, అతని చేయి పట్టుకొని ఒకరి బొమ్మ వేయించారు.
కళ్ళకు ఉన్న గంతలు తీసిన రాజీవ్, ఆ ఆర్టిస్ట్ వేసిన బొమ్మ తన తండ్రి దేవదాస్ కనకాలది అని గ్రహించి కన్నీరు పెట్టుకున్నారు. భర్తను చూసిన సుమ కూడా కన్నీరు కార్చారు.
2019 ఆగష్టులో దేవదాస్ కనకాల కన్నుమూశారు. నటుడిగా అనేక చిత్రాలలో నటించిన ఆయన, అనేక మంది ఆర్టిస్టులకు నటనలో శిక్షణ ఇచ్చారు.
భౌతికంగా దూరమైన తండ్రిని తలచుకొని రాజీవ్ కన్నీరు పెట్టుకోగా, ఆయన్ని చూసిన సుమ కూడా భావోద్వేగానికి గురయ్యారు.
ఆమధ్య సుమ, రాజీవ్ విడిపోతున్నారంటూ వార్తలు రాగా, ఆ వార్తలకు వివరణ ఇస్తూ ఇద్దరూ ఓ కార్యక్రమంలో కన్నీటి పర్యంతం అయ్యారు.