- Home
- Entertainment
- `భజరంగీ భాయిజాన్` రాజమౌళి చేయాల్సిన సినిమానా? ఎలా మిస్ అయ్యింది.. విజయేంద్రప్రసాద్ ఎంత పనిచేశాడు!
`భజరంగీ భాయిజాన్` రాజమౌళి చేయాల్సిన సినిమానా? ఎలా మిస్ అయ్యింది.. విజయేంద్రప్రసాద్ ఎంత పనిచేశాడు!
సల్మాన్ ఖాన్ నటించిన `భజరంగీ భాయిజాన్` హిందీలో సంచలన విజయం సాధించింది. ఈ మూవీని రాజమౌళి చేయాల్సిందా? మరి విజయేంద్రప్రసాద్ చేసిన మిస్టేక్ ఏంటి.?

ఏ స్క్రిప్ట్ అయినా రాజమౌళి చేతిలో పడిందంటే దాని రూపు రేఖలు మారిపోవాల్సిందే. దాని రేంజ్ నెక్ట్స్ లెవల్‌కి వెళ్తుంది. అదొక వెయ్యి కోట్ల సినిమా, లేదంటే రెండువేల కోట్ల సినిమాగా చేస్తాడు. ఓ మ్యాజిక్ చేస్తాడు. `సింహాద్రి`, `ఛత్రపతి`, `యమదొంగ`, `ఈగ`, `మగధీర`, `బాహుబలి`, `ఆర్‌ఆర్‌ఆర్` వరకు ఒక్కో సినిమా రేంజ్‌ని పెంచుకుంటూ, అదే సమయంలో తెలుగు సినిమా స్థాయిని పెంచుకుంటూ వచ్చాడు. ప్రపంచానికి తెలుగు సినిమాని పరియం చేశాడు.
`బాహుబలి` సినిమాకి ఆయనకు దాదాపు ఐదేళ్లు పట్టింది. రెండు పార్ట్ లు చేయడానికి అంత సమయం పట్టింది. కానీ వెయిటింగ్‌కి మించిన రిజల్ట్ వచ్చింది. ఆ తర్వాత ఆ మూవీ తర్వాత రాజమౌళి `భజరంగీ భాయిజాన్` చేయాల్సింది. కానీ తండ్రి విజయేంద్ర ప్రసాద్ వల్లే అది మిస్ అయ్యింది. ఇంతకి ఏం జరిగిందంటే.. అప్పుడు `బాహుబలి` సినిమా షూటింగ్ జరుగుతుంది. వేల మంది టీమ్‌తో చిత్రీకరణ చేస్తున్నారు. మెయిన్ కాస్టింగ్ ఉన్నారు.
అంతేకాదు అది సమ్మర్ టైమ్. ఓ వైపు పైనుంచి సూర్యుడి ఎండ, మరోవైపు కింద నేల సెగలు కక్కుతుంది. ఆ షూటింగ్ టైమ్‌లో విజయేంద్రప్రసాద్.. రాజమౌళికి `భజరంగీ భాయిజాన్` కథ చెప్పాడట. అది కూడా సల్మాన్ ఖాన్‌కి ఈ కథ నెరేట్ చేసిన వచ్చాట. ఆ ఎండలో విన్న రాజమౌళి కథలోని ఎమోషన్స్ కి కన్నీళ్లు పెట్టుకున్నాడు. సరే ఇచ్చేయ్ అంటూ ఆ సమయంలో తండ్రికి చెప్పాడట.
అయితే బాలీవుడ్‌లో కబీర్ ఖాన్ ఆ మూవీని చేశారు. సల్మాన్ ఖాన్, కరీనాకపూర్ జంటగా నటించారు. పాకిస్థాన్ నుంచి తప్పిపోయిన ఓ చిన్నారిని తిరిగి వారి దేశానికి, పాప తల్లి దండ్రులకు చేర్చడమనేది కథ. అప్పట్లో ఇది పెద్ద హిట్ అయ్యింది. ఆరువందల కోట్ల గ్రాస్ కలెక్ట్ చేసింది. ఆ సినిమా అంత పెద్ద హిట్ అయిన తర్వాత ఓ సారి ఇంట్లో విజయేంద్రప్రసాద్, రాజమౌళి మధ్య చర్చకు వచ్చిందట. అంతటి విజయాన్ని చూశాక రాజమౌళి.. నాన్నతో ఇలా అన్నాడట.
`ఆ రోజు ఎండ మంచి కాకమీద ఉన్న సమయంలో ఆ కథ నాకు చెప్పావు. ఆ మూడ్‌లో వాళ్లకి ఇచ్చేయమన్నాను. అదే పదిహేను రోజుల ముందు చెప్పినా, ఆ తర్వాత పదిహేను రోజుల తర్వాత చెప్పినా ఉంచేయమనే వాడిని(మనమే చేద్దామని). కానీ ఆ ఎండ కాకలో ఉన్నప్పుడు చెప్పడంలో తాను చిరాకుతో వదులుకోవాల్సి వచ్చిందని చెప్పాడట రాజమౌళి. నిజంగానే విజయేంద్రప్రసాద్ పెద్ద మిస్టేక్ చేశాడని చెప్పొచ్చు. ఫస్ట్ రాజమౌళికి చెబితే అసలు ఆ సినిమా లెక్కే మారిపోయేది.
ప్రస్తుతం రాజమౌళి చేస్తున్న మహేష్ బాబు మూవీకి స్క్రిప్ట్ ని కూడా విజయేంద్రప్రసాదే అందిస్తున్నారు. ఆల్మోస్ట్ అన్ని కథలను ఆయనే అందిస్తారు. వారిద్దరి మధ్య అంతటి కంఫర్ట్, అండర్‌స్టాండింగ్ ఉంటది కాబట్టి అది సాధ్యమవుతుంది. ఇక ఇప్పుడు మహేష్ మూవీని ఈ ఏడాది ద్వితీయార్థంలో ప్రారంభించబోతున్నారట. ఇందులో అంతర్జాతీయ ఆర్టిస్ట్ లు కూడా నటించబోతన్నట్టు తెలుస్తుంది. ఆఫ్రికన్ అడవుల నేపథ్యంలో అడ్వెంచరస్ జర్నీగా మూవీ సాగుతుందని తెలుస్తుంది. దాదాపు వెయ్యి కోట్లతో ఈ మూవీని రూపొందించబోతున్నారు రాజమౌళి.