MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • #Maheshbabu కు జోడీగా ఇండోనేషియన్ హీరోయిన్?

#Maheshbabu కు జోడీగా ఇండోనేషియన్ హీరోయిన్?

మహేష్  ఇప్పుడు తన  నెక్స్ సినిమాలో  అంతర్జాతీయ యాత్ర చేయబోతున్నారు. ఆ క్రమంలో నటీనటుల ఎంపిక సైతం మారిపోతోంది.   

3 Min read
Author : Surya Prakash
Published : Jan 07 2024, 07:51 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
19
Mahesh, rajamouli

Mahesh, rajamouli


తెలుగు సినిమా మారిపోతోంది. రాష్ట్రాలు,దేశం దాటి ఇప్పుడు విశ్వవ్యాప్తం అవుతోంది. దాంతో తమ సినిమా రూపు రేఖలను మార్చేందుకు స్టార్స్, డైరక్టర్స్ ప్రయత్నాలు చేస్తున్నారు. అందులో మొదటి వరసలో ఉన్నది ఎవరూ అంటే రాజమౌళి అని చెప్పాలి. ఆయన బాహుబలి, ఆర్.ఆర్.ఆర్ చిత్రాలతో తెలుగు సినిమా మార్కెట్ ని నెక్ట్స్ లెవిల్ కు తీసుకెళ్లారు. ఇప్పుడు మహేష్ తో కలిసి అంతర్జాతీయ యాత్ర చేయబోతున్నారు. ఆ క్రమంలో నటీనటుల ఎంపిక సైతం మారిపోతోంది. నార్త్ నుంచి హీరోయిన్స్ తెచ్చుకునే తెలుగు సినిమా ఇప్పుడు ఇతర దేశాల నుంచి కూడా హీరోయిన్స్ ని దిగుమతి చేసుకుంటోంది. సినిమా గ్లోబులైజేషన్ అయ్యిందనాలి.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
29


మహేష్, రాజమౌళి కాంబినేషన్ లో రూపొందే  సినిమా కోసం ఓ ఇండోనేషియ‌న్ హీరోయిన్ ని ఎంచుకొన్నార‌ని వార్తలు వస్తున్నాయి. ఆమె పేరు… చెల్సియా ఇస్లాన్. ఇప్పటికే ఆమె  కొన్ని హాలీవుడ్ చిత్రాల్లో న‌టించింది. రీసెంట్ గా ఆమెను స్క్రీన్ టెస్ట్ కూడా చేశార‌ని, ఈ సినిమాలో ఆమె వర్క్ చేయటం కన్ఫర్మ్ అని తెలుస్తోంది. అయితే  చెల్సియాని హీరోయిన్ పాత్ర కోసం ఎంచుకొన్నారా, లేదంటే కీల‌క పాత్ర కోసం తీసుకొన్నారా? అనేది తెలియాల్సివుంది.
 

39


రాజమౌళి, మహేష్ బాబు కాంబినేషన్ లో ఎప్పుడో సినిమా రావాల్సి ఉన్నా...  ‘బాహుబలి’, ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ వంటి భారీ ప్రాజెక్టుల వల్ల ఆలస్యమవుతూ వచ్చింది. ఇక ఇప్పుడు ఆ సినిమాకు రూట్‌ క్లియర్‌ అయింది. మరికొద్ది రోజుల్లోనే రాజమౌళి ప్రపంచంలోకి అడుగుపెడతారు మహేష్. ఈ కాంబినేషన్‌లో వస్తున్న మూవీపై చాలా అంచనాలు ఉన్నాయి.  
 

49


అలాగే  ఈ చిత్రం కోసం 1200 కోట్ల బడ్జెట్ ని కేటాయిస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. అయితే ఓ తెలుగు హీరో నటించే సినిమాకు అంత పెట్టడం అంటే మామూలు విషయం కాదు. నిజమే అయితే పెద్ద రికార్డే. ప్రస్తుతం రాజమౌళి లొకేషన్‌ల వేటలో ఉన్నారు. ఇంకా టైటిల్ పెట్టని ఈ యాక్షన్ చిత్రం   షూట్ ఏప్రిల్ 2024లో ప్రారంభమవుతుంది. షూటింగ్‌కు ముందు రాజమౌళి ఒక ప్రత్యేక వర్క్‌షాప్‌ని ప్లాన్ చేసారు. మహేష్ బాబుతో పాటు మొత్తం టీమ్ కూడా హాజరుకానున్నారు. 

59


టొరంటో ఇంటర్నేషనల్‌ ఫిల్మ్‌ ఫెస్టివల్‌లో పాల్గొన్న రాజమౌళి దీనిని గురించి మాట్లాడుతూ... ‘ప్రపంచాన్ని చుట్టి వచ్చే సాహసికుడి కథ’ అంటూ యాక్షన్‌ అడ్వెంచర్‌ మూవీగా ఇది ఉంటుందని తెలిపారు. ఈ చిత్రాన్ని పాన్‌ వరల్డ్  స్థాయిలో నిర్మించనున్నారు.  హై-వోల్టేజ్ యాక్షన్‌ అండ్ అడ్వెంచరస్ ఎంటర్టైనర్ గా రానున్న ఈ సినిమా మూడు భాగాలుగా రానుందని రచయిత విజయేంద్ర ప్రసాద్ ప్రకటించిన విషయం తెలిసిందే. 

69


మొత్తం షూటింగ్  ప్రపంచంలోని మూడు దేశాల్లో జరగనుంది. ఈ సినిమా షూటింగ్‌లో కొంత భాగం దట్టమైన అమెజాన్ అడవుల్లో జరగనుంది. షూటింగ్  ప్రారంభానికి ముందు రాజమౌళి మీడియాతో ఇంటరాక్ట్ అవుతారు. ప్రముఖ హాలీవుడ్ స్టూడియో,  కెఎల్ నారాయణతో కలిసి ఈ చిత్రాన్ని నిర్మించనుంది. హీరోయిన్ , ఇతర నటీనటులను త్వరలోనే ఖరారు చేస్తారు. ఎంఎం కీరవాణి సంగీతం అందించనున్న ఈ చిత్రానికి సినిమాటోగ్రాఫర్‌ని త్వరలో ఖరారు చేయనున్నారు.
 

79


మహేశ్‌బాబు మాట్లాడుతూ...‘ఆయనతో పనిచేయాలన్న కల సాకారం కాబోతోంది. రాజమౌళితో ఒక సినిమా చేస్తే, 25 సినిమాలు చేసినట్టే. ఈ ప్రాజెక్టు విషయంలో చాలా ఉత్సాహంగా ఉన్నా. ఇది పాన్‌ ఇండియా మూవీ అవుతుంది. జాతీయ స్థాయిలో సరిహద్దులను ఈ చిత్రం చెరిపేస్తుంది’’ అని అన్నారు. 

89


ఈ సినిమాకు రాజమౌళి తండ్రి విజయేంద్రప్రసాద్‌ కథ అందిస్తున్నారు. ఇందుకు  కథని  సిద్ధం చేసినట్లు తెలుస్తోంది. అమెజాన్‌ అడవుల నేపథ్యంలో నిధి వేట ఇతివృత్తంగా ఒక కథ సిద్ధం చేయగా, జేమ్స్‌బాండ్‌ తరహాలో యాక్షన్‌ అడ్వెంచర్‌ మూవీగా దీన్ని తీర్చిదిద్దే అవకాశం ఉంది. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన  ప్రీ ప్రొడక్షన్ పనులు సాగుతున్నాయి.  

99

ఇక మహేష్ బాబు  సినిమా కోసం నటీనటుల ఎంపిక చేస్తున్నాడట రాజమైళి. ముఖ్యంగా ప్యాన్ వరల్డ్ సినిమా కాబట్టి  చాలా ఆప్షన్లు తీసుకున్నాడట. అందులో ఎవరు అయితే బాగుంటారా అని  చూస్తున్నాడట. లిస్ట్ లో టాలీవుడ్, బాలీవుడ్ ,హాలీవుడ్ నటీనటులు ఉన్నట్టు తెలుస్తోంది.  

About the Author

SP
Surya Prakash
తెలుగు సినిమా జర్నలిజం లో గత ఇరవై ఏళ్లుగా ఉన్నారు. కొన్ని వందల రివ్యూలు, విశ్లేషణాత్మక ఆర్టికల్స్ రాశారు. ఈయన ప్రముఖ సినీ విమర్శకుడు కూడా.
 

Latest Videos
Recommended Stories
Recommended image1
సెకనుకు 10 లక్షలు.. 50 సెకన్ల యాడ్ కోసం 5 కోట్లు తీసుకున్న హీరోయిన్ ఎవరో తెలుసా?
Recommended image2
Suman: శంకరాభరణం చేసిన నిర్మాతని, వీడితో సినిమా చేసి తప్పు చేశా.. సుమన్ మూవీపై కామెంట్స్, కట్ చేస్తే
Recommended image3
Chiranjeevi: రాజశేఖర్‌లాగా నేను కూడా యాక్ట్ చేయలేను.. చిరంజీవి ఓపెన్‌ స్టేట్‌మెంట్‌.. ఎప్పుడంటే?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved