MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
Bigg Boss Telugu 10
Asian Games 2026
IMD Weather Update
Today's Rasi Phalalu
Jr NTR Injury Update
OTT Releases This Week
Actress Roja Selvamani
Team India Captain
Dimpu Kallem Asha
Abhishek Sharma
Missing Meghana Movie Review
Getup Srinu Remuneration
Chicken Curry Recipe
  • Home
  • Entertainment
  • చిన్నప్పుడు ఎన్టీఆర్‌ మూవీలో రాజమౌళికి చేదు అనుభవం.. దాన్ని తన సినిమాల్లో రూల్‌గా పెట్టుకున్న జక్కన్న.. ఏంటంటే

చిన్నప్పుడు ఎన్టీఆర్‌ మూవీలో రాజమౌళికి చేదు అనుభవం.. దాన్ని తన సినిమాల్లో రూల్‌గా పెట్టుకున్న జక్కన్న.. ఏంటంటే

రాజమౌళి.. సీనియర్‌ ఎన్టీఆర్‌ సినిమాలో ఓ చేదు అనుభవం ఎదురైంది. దాన్ని ఇప్పటికీ ఫాలో అవుతున్నాడట. తన సినిమాల్లో ఆ రూల్‌ని ఫాలో అవుతాడట.   

3 Min read
Author : Aithagoni Raju
Published : Apr 12 2024, 04:57 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
19

దర్శకధీరుడు రాజమౌళి.. ఇప్పుడు దేశం గర్వించదగ్గ దర్శకుడిగా ఎదిగారు. ఇండియన్స్ డ్రీమ్‌గా ఉన్న ఆస్కార్ ని తెచ్చిపెట్టాడు. ఇప్పుడు అంతర్జాతీయంగా దర్శకుడిగా సత్తా చాటేందుకు ప్రయత్నిస్తున్నారు. అయితే తన సినిమాల్లో మాత్రం ఓ విషయాన్ని రూల్‌గా పాటిస్తాడట. దానికి ఎన్టీఆర్‌ సినిమా ఇన్‌స్పైర్‌ చేసిందట. ఆ కథేంటో చూస్తే..
 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
29

రాజమౌళి.. జూ ఎన్టీఆర్‌ హీరోగా తెరకెక్కిన `స్టూడెంట్‌ నెం1` చిత్రంతో దర్శకుడిగా మారాడు. ఈ సినిమా ఆ తర్వాత `సింహాద్రి`, `ఛత్రపతి` సినిమాలు చేశారు. ప్రభాస్‌తో `ఛత్రపతి` మూవీతో జర్నీ ప్రారంభమైంది. ఈ మూవీ ప్రమోషన్స్ లో భాగంగా ఓ ఇంటర్వ్యూ ఇచ్చారు ప్రభాస్‌, రాజమౌళి. ఝాన్సీ యాంకర్. సినిమా విశేషాలను అడిగి తెలుసుకుంది. మధ్యలో రాజమౌళి సోదరుడు కాంచి వచ్చాడు. ఆయన నటుడు, రైటర్‌గా రాణిస్తున్నారు. 
 

39

రాజమౌళికి యాక్షన్‌ సినిమాలంటే ఇష్టం. ఇటీవల `ప్రేమలు` ఈవెంట్‌లోనూ కూడా తనకు లవ్‌ స్టోరీస్ నచ్చవని చెప్పాడు. చిన్నప్పట్నుంచి కూడా తాను యాక్షన్‌ మూవీస్‌నే ఇష్టపడేవాడట రాజమౌళి. ఈ సందర్బంగా చిన్ననాటి సంఘటన గుర్తు చేసుకున్నారు. తమ ఫ్యామిలీ చాలా పెద్దది, తాము 13 మంది కజిన్స్ అట. అందులో కాంచి, రాజన్న అని ఇద్దరు పెద్దవాళ్లు. వాళ్లకి నెలకు రెండు సినిమాలు, తాము ఏడెనిమిది మంది ఉండేవాళ్లం. తమకు మాత్రం నెలకు ఒక్క సినిమానే  చూసేలా కండీషన్స్ ఉండేదట. 
 

49

తమ ఊర్లో రెండు థియేటర్లు ఉండేవట. అందులో ఒక థియేటర్‌లో ఎన్టీఆర్‌ `అగ్గిపిడుగు`, మరో థియేటర్లో `మంచి చెడు` అనే సినిమా వచ్చింది. రెండు సినిమాల్లోనూ ఎన్టీరామారావు హీరో. పెద్దవాళ్లు `అగ్గిపిడుగు` సినిమా చూశారు. అందులో కత్తిఫైట్లు, అవి ఇవి చాలా ఉన్నాయని ఇంట్లో చెప్పారు. దీంతో వచ్చే వారం కోసం రాజమౌళి వాళ్లు వెయిట్‌ చేస్తున్నారట. `అగ్గిపిడుగు` సినిమాకి వెళ్దామని రెడీ అవ్వగా, `మంచి చెడు` సినిమాకి వెళ్దాం, అందులో అన్నీ ఫైట్లే ఉన్నాయి, `అగ్గిపిడుగు`లో రెండే ఫైట్లు ఉన్నాయని అబద్దం చెప్పి ఆసినిమాకి తీసుకెళ్లారట. 

59

ఇక తాను ఫైట్ల కోసం వెయిట్‌ చేస్తున్నాడట రాజమౌళి. ఇంటర్వెల్ అవుతుంది. ఒక్క ఫైట్‌ కూడా రాలేదు. తానేమో ఏడుస్తున్నాడట. ఈ కమ్రంలోనే ఎన్టీఆర్‌ని దొంగలు చుట్టుముట్టారట. తీరా చూస్తే అది ఫైట్‌ కాదని మళ్లీ ఎండింగ్‌ వరకు ఒక్క ఫైట్‌ కూడా లేదట. దీంతో తాను బాగా ఏడ్చేశానని, ఫైట్లు లేవని అన్నల ముందు గోల చేశాడట రాజమౌళి. ఇక చివరికి సినిమాల్లో హీరో ఎన్టీఆర్‌ చచ్చిపోతాడట. ట్రాజెడీ ఎండింగ్‌ చూసి మామూలు చిరాకు కాదు, బాగా ఏడ్చేశాడట. 
 

69

అయితే ఈ సినిమా ఓ విషయంలో తనని బాగా ప్రభావితం చేసిందని చెప్పాడు రాజమౌళి. ఆ ట్రాజెడీ ఎండింగ్‌ చూసి నా జన్మలో ఇలాంటి ఎండింగ్‌ పెట్టకూడదని నిర్ణయించుకున్నారట. `ఛత్రపతి` సినిమాలోనూ హీరో చనిపోతే ఎలా ఉంటుందనే చర్చ కూడా వచ్చినప్పుడు రాజమౌళి ఈ విషయాన్ని చెప్పాడట. నా జన్మలో నా హీరో సినిమాల్లో ఎప్పటికీ చావడు అన్నాడట. అదే పాటిస్తున్నాడట. 
 

79

రాజమౌళి తీసిన చిత్రాల్లో `విక్రమార్కుడు`లో రవితేజ ఒక పాత్ర చనిపోతుంది. కానీ మరో రవితేజ పాత్రతో దాన్ని బ్యాలెన్స్ చేశాడు రాజమౌళి. అంతేకాదు `మగధీర`లోనూ సేమ్‌.. రాజుల కాలం నాటి కథలో హీరో చనిపోతాడు, ప్రస్తుతం కాలంలో బ్రతికే ఉంటాడు.

89

అంతేకాదు `ఈగ`లోనూ హీరో చనిపోతాడు. కానీ ఈగ రూపంలో బతికే ఉంటాడు. మరోవైపు `బాహుబలి`లోనూ ఓ ప్రభాస్‌ చనిపోతే, మరో ప్రభాస్‌ ద్వారా దాన్ని బ్యాలెన్స్ చేశాడు. ఇలా సాడ్‌ ఎండింగ్‌ లేకుండా చూసుకుంటున్నాడట రాజమౌళి. దానికి ఎన్టీఆర్ నటించిన `మంచి చెడు` సినిమానే ఓ కారణమని తెలిపారు రాజమౌళి. 
 

99
Rajamouli

Rajamouli

చివరగా `ఆర్‌ఆర్‌ఆర్‌`తో మెప్పించిన రాజమౌళి ఇప్పుడు మహేష్‌ బాబు హీరోగా సినిమా చేయబోతున్నారు. `ఎస్‌ఎస్‌ఎంబీ29` పేరుతో ఈ మూవీ తెరకెక్కనుంది. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్‌ వర్క్ జరుగుతుంది. త్వరలోనే ప్రారంభం కానుందని తెలుస్తుంది. గ్లోబల్ మార్కెట్‌ టార్గెట్‌గా ఈ చిత్రాన్ని తెరకెక్కించబోతున్నారు రాజమౌళి. ఆఫ్రీకన్‌ అడవుల నేపథ్యంలో యాక్షన్‌ అడ్వెంచరస్‌గా సినిమా సాగుతుందని తెలుస్తుంది. 

About the Author

AR
Aithagoni Raju
అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.
ప్రభాస్
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Jr NTR: గాయం నుంచి కోలుకున్న ఎన్టీఆర్, డ్రాగన్ షూటింగ్‌పై కీలక అప్‌డేట్, సెట్స్‌పైకి ఎప్పుడంటే?
Recommended image2
OTT: ఈ వారం ఓటీటీ రిలీజ్ లు ఇవే.. థ్రిల్లర్స్, రొమాంటిక్ మూవీస్ రెడీ.. ఒక్కటి కూడా మిస్ అవ్వొద్దు
Recommended image3
Roja Selvamani: సినిమాలు వదిలి పారిపోదామనుకున్న రోజా.. మెగాస్టార్ చిరంజీవి ఏం చేశాడో తెలుసా?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved