ఎన్టీఆర్ ఫస్ట్ లుక్ పై క్రేజీ న్యూస్ చెప్పిన రాజమౌళి..!
కొమరం భీమ్ గా ఎన్టీఆర్ ఫస్ట్ లుక్ వీడియో కోసం ఫ్యాన్స్ వేయి కళ్ళతో ఎదురుచూస్తున్నారు. దీనిపై కీలక ప్రకటన ఎప్పుడు వస్తుందని ఆసక్తిగా గమనిస్తున్నారు. కాగా దీనిపై దర్శకుడు రాజమౌళి ప్రకటన చేసినట్లు తెలుస్తుంది.
అనుకున్న సమయానికి ఆర్ ఆర్ ఆర్ నుండి ఎన్టీఆర్ ఫస్ట్ లుక్ వీడియో విడుదల కాకపోవడం ఫ్యాన్స్ ని తీవ్రంగా నిరాశపరిచిన అంశం. ఎన్నో ఆశలతో ఎదురుచూసిన వారి కలలపై రాజమౌళి ప్రకటన నీళ్లు చల్లింది. రెండేళ్లుగా ఎన్టీఆర్ నుండి మూవీ లేదని నిరాశలో ఉన్న ఫ్యాన్స్ కి పుట్టినరోజు నాడు ఫస్ట్ లుక్ వీడియో రాకపోవడం మరింత అసహానికి గురిచేసింది.
ఎన్టీఆర్ పుట్టినరోజు మే 20కాగా అప్పటికే లాక్ డౌన్ మొదలైపోయింది. ఎన్టీఆర్ ఫస్ట్ లుక్ వీడియోకి కావలసిన మెటీరియల్ లేకపోవడంతో పాటు, లాక్ డౌన్ వలన షూటింగ్ జరిపే పరిస్థితి లేదు అని రాజమౌళి చెప్పారు. కాబట్టి ఎన్టీఆర్ ఫస్ట్ లుక్ వీడియో విడుదల చేయలేము అని ఆయన వివరణ ఇవ్వడం జరిగింది.
ఇప్పటికే ఆర్ ఆర్ ఆర్ నుండి చరణ్ ఫస్ట్ లుక్ వీడియో విడుదల కాగా సూపర్ రెస్పాన్స్ దక్కించుకుంది. రామరాజుగా చరణ్ ని చాలా కొత్తగా రాజమౌళి ప్రెజెంట్ చేశారు. చరణ్ కండల శరీరంతో అలరించగా, అద్భుత విజువల్స్ తో ఆ టీజర్ దుమ్మురేపింది. దీనితో ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఎన్టీఆర్ కొమరం భీమ్ ఫస్ట్ లుక్ వీడియోపై భారీ అంచనాలు పెట్టుకున్నారు.
కాగా రాజమౌళి ఈ వీడియో ఎప్పుడు విడుదల చేస్తారు అన్న ప్రశ్నకు సమాధానము దొరికినట్లు వార్తలు వస్తున్నాయి. రాజమౌళి ఈ విషయంపై స్పస్టత ఇచ్చారట. ఆర్ ఆర్ ఆర్ షూటింగ్ మొదలైన పది రోజులలో ఎన్టీఆర్ ఫస్ట్ లుక్ వీడియో విడుదల చేయనున్నట్లు చెప్పారట.
ఓ మీడియా ఛానెల్ ఇంటర్వ్యూలో రాజమౌళి ఈ కీలక ప్రకటన చేసినట్లు సమాచారం. ఎప్పుడా ఎప్పుడా అని ఎదురుచూస్తున్న ఫ్యాన్స్ కి ఇది ఉపశమనం కలిగించే విషయమే అని చెప్పాలి. ఇటీవల కరోనా నుండి కోలుకున్న రాజమౌళి ఆర్ ఆర్ ఆర్ షూటింగ్ ప్రణాళికలలో ఉన్నారు. విదేశాలలో ఈ మూవీ షూటింగ్ తిరిగి ప్రారంభం కానున్నట్లు వార్తలు వస్తున్నాయి.