- Home
- Entertainment
- ఎన్టీఆర్ ఇంటికి వచ్చారు.. 'RRR-2' గురించి చర్చలు జరుగుతున్నాయి, ఫ్యాన్స్ కి పూనకాలే..
ఎన్టీఆర్ ఇంటికి వచ్చారు.. 'RRR-2' గురించి చర్చలు జరుగుతున్నాయి, ఫ్యాన్స్ కి పూనకాలే..
దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కించిన ఆర్ఆర్ఆర్ చిత్రం బాక్సాఫీస్ వద్ద విధ్వంస రచన చేస్తోంది. ప్రపంచ వ్యాప్తంగా ఈ చిత్రం ఇప్పటికే 700 కోట్ల గ్రాస్ వసూలు చేసింది. తెలుగు రాష్ట్రాలతో పాటు హిందీలో కూడా షేర్ 200 కోట్ల వైపు పరుగులు తీస్తున్నాయి.

RRR Movie
దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కించిన ఆర్ఆర్ఆర్ చిత్రం బాక్సాఫీస్ వద్ద విధ్వంస రచన చేస్తోంది. ప్రపంచ వ్యాప్తంగా ఈ చిత్రం ఇప్పటికే 700 కోట్ల గ్రాస్ వసూలు చేసింది. తెలుగు రాష్ట్రాలతో పాటు హిందీలో కూడా షేర్ 200 కోట్ల వైపు పరుగులు తీస్తున్నాయి. కళ్ళు చెదిరే యాక్షన్ బ్లాక్స్ తో రాజమౌళి మరోసారి మ్యాజిక్ చేశారు.
RRR Movie
ఇక ఎన్టీఆర్, రాంచరణ్ ఇద్దరూ తమ కెరీర్ లోనే ది బెస్ట్ పెర్ఫామెన్స్ ఇచ్చిన సంగతి తెలిసిందే. రాంచరణ్ సినిమా మొత్తం ఇంటెన్స్ యాక్టింగ్ తో అదరగొట్టాడు. ఎన్టీఆర్ ఎమోషనల్ పెర్ఫామెన్స్ ప్రతి ఒక్కరికి కంటతడి పెట్టించే విధంగా ఉంది. విప్లవ వీరులు అల్లూరి సీతా రామరాజు, కొమరం భీమ్ పాత్రల్లో రాంచరణ్, ఎన్టీఆర్ నటించారు.
RRR Movie
సమకాలీకులైన వీరిద్దరూ అజ్ఞాతంలోకి వెళ్ళినపుడు స్నేహితులుగా మారి ఉంటే ఎలా ఉంటుంది అనే ఊహాజనిత ఆలోచన నుంచి ఆర్ఆర్ఆర్ కథ పుట్టింది. సినిమాని ప్రారంభించినప్పుడే ఇది రెండు భాగాలు కాదని రాజమౌళి ప్రకటించారు. కానీ ప్రస్తుతం థియేటర్స్ లో ఆర్ఆర్ఆర్ చిత్రానికి థండర్ రెస్పాన్స్ వస్తోంది.
RRR Movie
ఎన్టీఆర్,రాంచరణ్ లాంటి నటుల్ని కలసి వెండితెరపై మళ్ళీ చూడాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. మరోసారి వారి కోరిక ఫలించే దిశగా అడుగులు పడుతున్నాయి. తాజాగా ఇంటర్వ్యూలో రచయిత, రాజమౌళి తండ్రి విజయేంద్ర ప్రసాద్ ఆర్ఆర్ఆర్ 2 గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
RRR Movie
ఆర్ఆర్ఆర్ 2 వచ్చే ఛాన్స్ ఉందా అని ప్రశ్నించగా.. ఉంది అని సమాధానం ఇచ్చారు. రీసెంట్ గా ఎన్టీఆర్ మా ఇంటికి వచ్చారు. అందరం ఆర్ఆర్ఆర్ 2 పాజిబులిటీస్ చర్చించుకున్నాం. కొన్ని ఐడియాలు కూడా అనుకున్నాం. అవి అందరికి బాగా నచ్చాయి. దైవం తలిస్తే ఆర్ఆర్ఆర్ 2 ఉంటుంది అని విజయేంద్ర ప్రసాద్ ప్రకటించారు.
RRR Movie
విజయేంద్ర ప్రసాద్ కామెంట్స్ రాంచరణ్, ఎన్టీఆర్ ఫ్యాన్స్ కి పూనకాలు తెప్పించడం ఖాయం అని చెప్పొచ్చు. ఒక వేల ఆర్ఆర్ఆర్ 2 ఉంటే అది మొదటి భాగం కన్నా ఎన్ని రెట్లు భారీగా ఉంటుందో ఊహించలేం. ఇక ఈ చిత్రంలో ఎన్టీఆర్ పాత్రని తగ్గించారు అనే కామెంట్స్ పై విజయేంద్ర ప్రసాద్ స్పందించారు. కందకి లేని దురద కత్తికి ఎందుకు ? ఎన్టీఆర్ ఆర్ఆర్ఆర్ చిత్ర సక్సెస్ ని ఎంజాయ్ చేస్తున్నారు. నా కెరీర్ ఆర్ఆర్ఆర్ కి ముందు ఆర్ఆర్ఆర్ కి తర్వాత అని ఆయనే చెప్పారు అని విజయేంద్ర ప్రసాద్ అన్నారు.