MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathimynation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • ఆ హీరో వల్లే మేము ఒక్కటయ్యాం.. రాహుల్ రవీంద్రన్, చిన్మయి ఇంట్రెస్టింగ్ కామెంట్స్ వైరల్

ఆ హీరో వల్లే మేము ఒక్కటయ్యాం.. రాహుల్ రవీంద్రన్, చిన్మయి ఇంట్రెస్టింగ్ కామెంట్స్ వైరల్

ఎప్పుడూ ఏదో ఒక కాంట్రవర్సీ కామెంట్స్ లో లైమ్ లైట్ లో ఉంటారు రాహుల్,చిన్మయి దంపతులు. ఇక ఈసారి మాత్రం తమ పర్సనల్ లైఫ్ గురించి.. తమ పెళ్ళి గురించి హాట్ కామెంట్స్ చేసి.. హడావిడి చేశారు. ఇంతకీ వారేమన్నారంటే..   

2 Min read
Mahesh Jujjuri
Published : May 28 2023, 07:53 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • Google NewsFollow Us
16
Asianet Image

అటు కోలీవుడ్ లో.. ఇటు టాలీవుడ్‌లో క్యూట్, అండ్ హాట్  కపుల్స్  అంటే వెంటనే గుర్తుకు వచ్చేది రాహుల్ రవీంద్రన్, చిన్మ యి దంపతులే.  వీరిద్దరి గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. కాంట్రవర్సీలకు కేరాఫ్ అడ్రస్ గా ఉండే వీరు.. ఏమాత్రం భయం లేకుండా ఉన్నది ఉన్నట్టు మాట్లాడతారు. ముఖ్యంగా చిన్మచి సోషల్ మీడియా కామెంట్స్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఈమధ్య డైరెక్టర్ గా కమల్ హాసన్ నే ప్రశ్నించింది చిన్మయి. 

26
Asianet Image

ఇక రాహుల్ విషయానికి వస్తే.. హీరోగా కెరీర్ స్టార్ట్ చేసి..  దర్శకుడిగా, అలాగే ప్రత్యేకమైన క్యారెక్టరతో స్క్రీన్ మీద అద్భుతం చేస్తున్నారు. రాహుల్ రవీంద్రన్... అందాల రాక్షసి సినిమాతో టాలీవుడ్‌లోకి అడుగు పెట్టి.. చిలసౌతో దర్శకుడిగా మారాడు రాహుల్. చిలసౌ సినిమాకు గానూ బెస్ట్ ఒరిజనల్ స్ర్కీన్ ప్లే విభాగంలో జాతీయ అవార్డును కూడా పొందారు. 

36
chinmaiye

chinmaiye

ఇక  సింగర్ గా  డబ్బింగ్ ఆర్టిస్ట్ గా..  అద్భుతాలే చేస్తోంది చిన్మయి.  తెలుగు, తమిళ, మలయాళ, కన్నడ,  హిందీ భాషల్లో ఎన్నో పాటలకు ప్రాణం పోసింది చిన్మయి. అంతే కాదు సమంత సినిమా అంటే ఆమె పాత్రకు వాయిస్ చిన్మయి ఇవ్వాల్సిందే. ఇవి కాకుండా సోషల్ అవైర్నెస్ ప్రోగ్రామ్స్ లో కూడా చురుగ్గా ఉంటుంది చిన్మయి.  అంతే కాకుండా సామాజిక కార్యకర్తగా కూడా వ్యవరిస్తున్నారు. ఆడ పిల్లలపై లైంగికపరమైన దోపిడీని అడ్డుకునేందుకు సోషల్ మీడియా వేదికగా ఖండిస్తూ.. ఉద్యామం చేస్తుంది కూడా. 

46
Asianet Image

ఇకఈ స్వీట్ క్యూట్ కపుల్స్ కు కవల పిల్లలు కూడా పుట్టారు. ఈ విషయంలో కూడా వివాదం ఎదుర్కొన్నారు ఈ జంట. ఈజంట  స్టార్ కమెడియన్, వెన్నెల కిశోర్ అలా మొదలైంది కార్యక్రమంలో పాల్గొని పలు ఆసక్తికర విషయాలు వెల్లడించారు. దీనికి సంబంధించిన ప్రోమోను విడుదల చేశారు. వెన్నెల కిశోర్ మాట్లాడుతూ.. మంచితనానికి మాశ్చురైజర్ చేస్తే రాహుల్ అని, సత్యానికి శానిటైజ్ పెడితే చిన్మయి అంటూ పొగడ్తలతో ముంచెత్తాడు. 
 

56
Asianet Image

అలాగే వీరి లవ్ స్టోరీ గురించి అడిగి తెలుసుకున్నాడు. డబ్బింగ్ చేస్తుంటే ఈ అబ్బాయి ఎవరో క్యూట్‌గా ఉన్నాడు కదా అని అనిపించిందట. ఈ విషయం పెళ్లి తర్వాత చెప్పింది అని రాహుల్ అనే సరికి..అయ్యే ఈయన ఏదో వాగుతున్నాడు అంది చిన్నయి. అసలు తాను పెళ్లి చేసుకోవాలని అనుకోలేదని చెప్పారు. అయితే రాహుల్.. తనను కలవక ముందు వరకు తనదీ అదే నిర్ణయమని అన్నారు.

66
Asianet Image

ఆ టైమ్ లో.. తమనున కలిపిన హీరో గురించి ఈ జంట వివరించారు.  సందీప్ కిషన్ నువ్వు రాహుల్ని కలవాలి, అతడిని మీట్ అవ్వాలి అని అన్నాడట. ఆమాట అనగానే.. సందీప్ తనకోసం మార్కెటింగ్ మొదలు పెట్టాడు అని  రాహుల్ కామెంట్ చేశాడు. మార్కెటింగ్ లో సందీప్ కిషన్ వేరే లెవల్ యాక్చువల్‌గా  అంటూ ఫన్నీ కామెంట్స్ చేశారు వెన్నెల కిశోర్.  ప్రస్తుతం ఈ కామెంట్లు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. 

About the Author

Mahesh Jujjuri
Mahesh Jujjuri
మహేశ్ జుజ్జూరి 13 ఏళ్ళకు పైగా తెలుగు జర్నలిస్టుగా పని చేస్తున్నారు. ఈయన గతంలో 10 టీవీలో సినిమా, ఫీచర్స్ జర్నలిస్టుగా పని చేశారు. 2021 నుంచి ఏసియా నెట్ తెలుగులో సినిమా జర్నలిస్టుగా ఉన్నరు. ఓటీటీ, టీవీ, బిగ్ బాస్, లైఫ్ స్టైల్ ఇతర సెలబ్రిటీలకు సంబందించిన విశేషాలను, ఫీచర్లను రాయడం ఈయన ప్రత్యేకత. క్వాలిటీ కంటెంట్‌ తో విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది.
 
Recommended Stories
Top Stories
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Andriod_icon
  • IOS_icon
  • About Us
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2025 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved